For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes bank case: ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

|

అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరయ్యారు. యస్ బ్యాంకు కేసులో ఈడీ ముందుకు వచ్చారు. ఈ బ్యాంకు నుండి తీసుకున్న రుణాల విషయంలో వాంగ్మూలన్ని రికార్డ్ చేయవచ్చు. అనిల్ అంబానీతో పాటు అడాగ్ గ్రూప్‌కు చెందిన మరికొంతమందిని కూడా ఈడీ విచారించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే. యస్ బ్యాంకు రుణాలు తీసుకున్న కొన్ని కంపెనీల లోన్లు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో అనిల్ అంబానీ కంపెనీలు కూడా ఉన్నాయి. అనిల్‌తో పాటు యస్ బ్యాంకు నుండి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది.

కరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళంకరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళం

Anil Ambani appears before the Enforcement Directorate in Mumbai

అనిల్‌కు చెందిన దాదాపు తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంకు నుండి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లుగా అంచనా. ఇవి నిరర్థక ఆస్తులుగా మారాయని తెలుస్తోంది. ఇలాంటి సంస్థల వల్లే యస్ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఈడీ అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తోంది.

English summary

Yes bank case: ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ | Anil Ambani appears before the Enforcement Directorate in Mumbai

Reliance Group Chairman Anil Ambani appeared before the Enforcement Directorate in Mumbai in connection with a money laundering probe against YES Bank promoter Rana Kapoor and others.
Story first published: Thursday, March 19, 2020, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X