For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనవరి రికార్డ్ హైనుండి సెన్సెక్స్ ఆకాశం నుండి పాతాళానికి.., నిఫ్టీ 8ఏళ్ల కనిష్టానికి..

|

ముంబై: ఈ క్యాలెండర్ ఇయర్‌లో మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఏడాది ప్రారంభం నుండే కరోనా వైరస్ ప్రభావం కనిపించింది. ఆ తర్వాత రోజురోజుకు పెరిగి వందకు పైగా దేశాలకు వ్యాప్తించి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం 42 వేల మార్క్ చేరుకొని రికార్డ్ సృష్టించిన సెన్సెక్స్ అంతలోనే 33లకు దిగజారిపోయింది. 12వేల మార్క్ చేరుకొని రికార్డ్ సృష్టించిన నిప్టీ ఏకంగా 10,000 మార్క్ తక్కువగా చేరుకుంది.

డాలర్‌తో ఆల్‌టైమ్ హైకి దిగజారిన రూపాయి, కాసేపట్లోనే 82 పైసలు డౌన్డాలర్‌తో ఆల్‌టైమ్ హైకి దిగజారిన రూపాయి, కాసేపట్లోనే 82 పైసలు డౌన్

9,000 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్

9,000 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్

సెన్సెక్స్ జనవరి 20, 2020వ తేదీన 42,273 పాయింట్లతో రికార్డ్ హైకి చేరుకుంది. ప్రస్తుతం అంటే మార్చి 12వ తేదీన (వార్త రాసే సమయానికి) 33,234కు దిగజారింది. అంటే గత నెల పదిహేను రోజుల్లోనే సెన్సెక్స్ ఏకంగా 9,000 పాయింట్లకు పైగా దిగజారింది. అంటే జనవరి 20 నుండి మార్చి 12 మధ్య అంటే దాదాపు నలభై సెషన్‌లలో 21 శాతం మేరకు కూలిపోయింది.

నిఫ్టీ ఎనిమిదేళ్ల కనిష్టానికి..

నిఫ్టీ ఎనిమిదేళ్ల కనిష్టానికి..

నిఫ్టీ ఎనిమిదేళ్ళ కనిష్టానికి చేరుకుంది. జనవరి 20వ తేదీ నుండి మార్చి 12వ తేదీ నాటికి ఏకంగా 7.1 శాతం దిగజారింది. నిఫ్టీ ఇదే పరిస్థితి కొనసాగితే వరస్ట్ రికార్డ్‌కు చేరుకుంటుంది.

స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే..

స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే..

బ్యాంకు నిఫ్టీ అక్టోబర్ 2012 కనిష్టానికి దిగజారింది. సెన్సెక్స్, నిఫ్టీలు మార్కెట్లను వణికిస్తున్నాయి. ఏకంగా ఈ రెండు 20 శాతం కంటే పైకి పడిపోయాయి. స్టాక్స్‌లలో కేవలం 150 నుండి 165 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. కానీ రెండువేలకు పైగా స్టాక్స్ నష్టాలను చవిచూస్తున్నాయి.

English summary

జనవరి రికార్డ్ హైనుండి సెన్సెక్స్ ఆకాశం నుండి పాతాళానికి.., నిఫ్టీ 8ఏళ్ల కనిష్టానికి.. | analysis: Sensex drops above 9,000 since Jan 20, Corona pandemic wipes out 2,500 points

All the sectoral indices are trading at 52-week low. BSE Midcap and smallcap indices shed over 9 percent each. Drop of 9000 points since Jan 20, 2020 or a huge 21% from peak levels.
Story first published: Thursday, March 12, 2020, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X