For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీ ఆస్తుల కోసం ముఖేష్ అంబానీ కంపెనీ బిడ్

|

ముంబై: రుణ భారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) ఆస్తులను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ దాఖలు చేసిన సంస్థల్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కూడా ఉన్నాయి. RCom, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్.. ఈ మూడు సంస్థల ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఈ బిడ్స్ వచ్చాయి.

బిడ్స్‌ను సోమవారం ఖరారు చేయాల్సి ఉంది. అయితే దీనిని శుక్రవారానికి వాయిదా వేశారు. RCom సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ.33,000 కోట్ల మేర ఉన్నాయి. దాదాపు రూ.49,000 కోట్ల రుణాలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. ఈ రుణాల చెల్లింపుల కోసం అసెట్స్ విక్రయించేందుకు గతంలోను ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

మార్కెట్ సరికొత్త రికార్డ్, రూ.1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే!మార్కెట్ సరికొత్త రికార్డ్, రూ.1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే!

Airtel, Jio bid for RCom telecom assets

స్పెక్ట్రం ఛార్జీలు,లైసెన్స్ ఫీజు రుణాల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మరోవైపు కంపెనీ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (NCLT)కు చేరుకుంది. NCLTఆదేశాల మేరకు పరిష్కార నిపుణుడు 2020 జనవరి 10లోగా దీనిని పరిష్కరించాలి.

English summary

అనిల్ అంబానీ ఆస్తుల కోసం ముఖేష్ అంబానీ కంపెనీ బిడ్ | Airtel, Jio bid for RCom telecom assets

Reliance Jio Infocomm, Bharti Airtel, UV Asset Reconstruction Company and private equity firm Varde Partners have bid for the assets of bankrupt Reliance Communicationsand its two units, people familiar with the matter said.
Story first published: Tuesday, November 26, 2019, 8:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X