For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను శుభవార్త: వారికి రూ.7,00,000 బెనిఫిట్, ఏ స్లాబ్‌పై మీరు ఎంత ఆదా చేస్తారో తెలుసా?

|

న్యూఢిల్లీ: ఇటీవల మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ పన్నును తగ్గించింది. దీంతో ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో కార్పోరేట్ పన్ను తగ్గింపు వ్యాపార, వినియోగదారులకు దీపావళి పండుగ వంటిదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, పన్ను చెల్లింపుదారులు కూడా ఇలాంటి ఉపశమనాన్ని మోడీ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు. ఆదాయపు పన్ను యాక్ట్ సమగ్రతపై వేసిన అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ కూడా పన్ను స్లాబుల్లో భారీ మార్పులను సిఫార్సు చేసింది. కొత్త డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ నివేదికను ఆగస్ట్ నెలలో ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇది ఇప్పటి వరకు ఇంకా ప్రజల ముందుకు రాలేదు.

ఆదాయ పన్నులో భారీ ఊరట!? శ్లాబుల తగ్గింపు దిశగా కేంద్రం కసరత్తు?ఆదాయ పన్నులో భారీ ఊరట!? శ్లాబుల తగ్గింపు దిశగా కేంద్రం కసరత్తు?

ప్రాథమిక పన్ను మినహాయింపు ఇలా...

ప్రాథమిక పన్ను మినహాయింపు ఇలా...

న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం సాధారణ ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2.5 లక్షలుగానే ఉంచింది. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల పైబడిన వారు) ప్రాథమిక మినహాయింపును రూ.3 లక్షలు, వెరీ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లకు పైబడిన వారు) రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉండాలని సూచించింది.

అతిపెద్ద మార్పు ఇదే... కోట్లాదిమందికి సంతోషం

అతిపెద్ద మార్పు ఇదే... కోట్లాదిమందికి సంతోషం

అతిపెద్ద మార్పు స్లాబ్‌లలో సూచించింది. 10 శాతం స్లాబ్‌ను రూ.10 లక్షల ఆదాయం వరకు పెంచాలని సూచించింది. ఇదే జరిగితే మెజార్టీ ట్యాక్స్ పేయర్స్‌కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రకారం 2017-18 సంవత్సరానికి రిటర్న్స్ ఫైల్ చేసిన 5.52 కోట్ల ఇండివిడ్యువల్స్ ట్యాక్స్ పేయర్లలో 27% మంది రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారే. టాస్క్ ఫోర్స్ సిఫార్సులు అమలు చేస్తే కనుక 1.47 కోట్ల పన్ను చెల్లింపుదారులు 20 శాతం శ్లాబ్ నుంచి 10 శాతం శ్లాబ్‌కు వెళ్తారు. ఇది కోట్లాది కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరం.

ప్రస్తుత స్లాబ్‌లు... కొత్త స్లాబ్‌లు ఇలా ఉండవచ్చునని అంచనా?

ప్రస్తుత స్లాబ్‌లు... కొత్త స్లాబ్‌లు ఇలా ఉండవచ్చునని అంచనా?

- ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ట్యాక్స్ లేదు.

- రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉంది.

- రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు 20 శాతం పన్ను ఉంది.

- రూ.10 లక్షలకు పైగా ఉంటే 30 శాతం పన్ను ఉంది.

- రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 10 శాతం సర్‌చార్జ్.

- రూ.1 కోటికి పైగా ఉంటే 15 శాతం సర్‌ఛార్జ్

- రూ.2 కోట్లకు పైగా ఆదాయం ఉంటే 25 శాతం సర్‌చార్జ్.

- రూ.5 కోట్లకు పైగా ఆదాయం ఉంటే 37 శాతం సర్‌చార్జ్ ఉంది.

- కొత్తగా స్లాబ్‌లు రూ.2.5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స ఉండకపోవచ్చు.

- రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉంటే 10% ఉండొచ్చు.

- రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయం ఉంటే 20% ఉండొచ్చు.

- రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల ఆదాయం ఉంటే 30% ఉండొచ్చు.

- రూ.2 కోట్ల ఆదాయానికి పైన ఉంటే 35% ట్యాక్స్ ఉండవచ్చు.

- అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ పైవాటిని సిఫార్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

రూ.5 లేదా రూ.6 లక్షల ఆదాయం ఉంటే...

రూ.5 లేదా రూ.6 లక్షల ఆదాయం ఉంటే...

ఈ కమిటీ సిఫార్సులు తక్కువ ఆదాయం కలిగిన వారికి ప్రయోజనమే. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉన్న వారిపై పెద్దగా ప్రయోజనం కనిపించక పోవచ్చు. రూ.5 లక్షలు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 87ఏ కింద ఇచ్చే పూర్తి పన్ను తగ్గింపులు ఉంటాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం ఉంటే రూ.50,000 ఎస్టీడీ డిడక్షన్, రూ.1 లక్ష 80సీ డిడక్షన్‌గా చూపించాలి. ట్యాక్స్ రూ.12,500 ఉంటుంది. 87ఏ కింద రిబేట్ రూ.12,500. కాబట్టి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కొత్త స్లాబ్ వచ్చినా అలాగే ఉంటుంది.

రూ.9 లక్షల ఆదాయం అయితే ప్రస్తుతం...

రూ.9 లక్షల ఆదాయం అయితే ప్రస్తుతం...

ప్రస్తుతం ఉన్న స్లాబ్ ప్రకారం రూ.9 లక్షల ఆదాయం ఉంటే ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్,న్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) కింద రూ.50,000 ఉంటుంది. నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.6.5 లక్షలు.ఇందులో ట్యాక్స్ రూ.42,500, సెస్ రూ.1700. మొత్తం ట్యాక్స్ రూ.44,200 అవుతుంది.

రూ.9 లక్షల ఆదాయం అయితే ప్రస్తుతం...

రూ.9 లక్షల ఆదాయం అయితే ప్రస్తుతం...

కమిటీ సిఫార్సు చేసిన స్లాబ్ అమల్లోకి వస్తే రూ.9 లక్షల ఆదాయం కలిగి ఉంటే రూ.40,000 ట్యాక్స్ పడుతుంది. సెస్ ఉండదు. అంటే మొత్తం ట్యాక్స్ 40,000. రూ.4,200 సేవ్ చేసినట్లు అవుతుంది. అంటే 9.5 శాతం ట్యాక్స్ తగ్గింది.

రూ.12 లక్షల ఆదాయం ఉంటే..

రూ.12 లక్షల ఆదాయం ఉంటే..

రూ.12 లక్షల ఆదాయం ఉంటే ప్రస్తుత స్లాబ్ రేట్ ప్రకారం ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్షన్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) రూ.50,000, నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.6.5 లక్షలు. అప్పుడు ట్యాక్స్ రూ.1,02,500, 4 శాతం సెస్ రూ.4,100 అవుతుంది. మొత్తం ట్యాక్స్ రూ.1,06,600 అవుతుంది.కమిటీ సిఫార్స్ చేసిన స్లాబ్ (20%) అమల్లోకి వస్తే ట్యాక్స్ రూ.70,000 మాత్రమే అవుతుంది. అంటే రూ.36,600 లేదా 34.3 శాతం ఆదా చేసినట్లు.

రూ.24 లక్షల ఆదాయం ఉంటే..

రూ.24 లక్షల ఆదాయం ఉంటే..

రూ.24 లక్షల ఆదాయం ఉంటే ప్రస్తుత స్లాబ్ రేట్ ప్రకారం ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్షన్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) రూ.50,000, నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.21.5 లక్షలు. అప్పుడు ట్యాక్స్ రూ.4,57,500, 4 శాతం సెస్ రూ.18,300 అవుతుంది. మొత్తం ట్యాక్స్ రూ.4,75,800 అవుతుంది.కమిటీ సిఫార్స్ చేసిన స్లాబ్ (30%) అమల్లోకి వస్తే మొత్తంగా ట్యాక్స్ రూ.3,05,000 అవుతుంది. అంటే రూ.1,70,800 లేదా 35.9 శాతం ఆదా చేసినట్లు.

రూ.60 లక్షల ఆదాయం ఉంటే..

రూ.60 లక్షల ఆదాయం ఉంటే..

రూ.24 లక్షల ఆదాయం ఉంటే ప్రస్తుత స్లాబ్ రేట్ ప్రకారం ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్షన్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) రూ.50,000, నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.57.5 లక్షలు. అప్పుడు ట్యాక్స్ రూ.15,37,500, 4 శాతం సెస్ రూ.67,650. ఇది కాకుండా 10% సర్‌ఛార్జ్ రూ.1,53,750 ఉంటుంది. మొత్తం ట్యాక్స్ రూ.17,58,900 అవుతుంది.

కమిటీ సిఫార్స్ చేసిన స్లాబ్ (30%) అమల్లోకి వస్తే మొత్తంగా ట్యాక్స్ రూ.14,00,000 అవుతుంది. అంటే రూ.3,58,900 లేదా 20.4 శాతం ఆదా చేసినట్లు.

రూ.1.2 కోట్ల ఆదాయం ఉంటే..

రూ.1.2 కోట్ల ఆదాయం ఉంటే..

రూ.1.2 కోట్ల ఆదాయం ఉంటే ప్రస్తుత స్లాబ్ రేట్ ప్రకారం ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్షన్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) రూ.50,000, నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.1.175 కోట్లు. అప్పుడు ట్యాక్స్ రూ.33,37,500, 4 శాతం సెస్ రూ.1,53,525. ఇది కాకుండా 15% సర్‌ఛార్జ్ రూ.5,00,625 ఉంటుంది. మొత్తం ట్యాక్స్ రూ.39,91,650 అవుతుంది.

కమిటీ సిఫార్స్ చేసిన స్లాబ్ (30%) అమల్లోకి వస్తే మొత్తంగా ట్యాక్స్ రూ.32,00,000 అవుతుంది. అంటే రూ.7,91,650 లేదా 19.8 శాతం ఆదా చేసినట్లు.

రూ.2.5 కోట్ల ఆదాయం ఉంటే..

రూ.2.5 కోట్ల ఆదాయం ఉంటే..

రూ.2.5 కోట్ల ఆదాయం ఉంటే ప్రస్తుత స్లాబ్ రేట్ ప్రకారం ఎస్టీడీ డిడక్షన్ రూ.50,000, 80సీ డిడక్షన్ రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ (80సీసీడీ 1బీ) రూ.50,000, నెట్ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.2.475 కోట్లు. అప్పుడు ట్యాక్స్ రూ.72,37,500, 4 శాతం సెస్ రూ.3,61,875. ఇది కాకుండా 25% సర్‌ఛార్జ్ రూ.18,09,375 ఉంటుంది. మొత్తం ట్యాక్స్ రూ.94,08,750 అవుతుంది.

కమిటీ సిఫార్స్ చేసిన స్లాబ్ (35%) అమల్లోకి వస్తే మొత్తంగా ట్యాక్స్ రూ.73,37,500 అవుతుంది. అంటే రూ.20,08,750 లేదా 22 శాతం ఆదా చేసినట్లు.

English summary

ఆదాయపు పన్ను శుభవార్త: వారికి రూ.7,00,000 బెనిఫిట్, ఏ స్లాబ్‌పై మీరు ఎంత ఆదా చేస్తారో తెలుసా? | How the proposed new Direct Tax Code could cut your income tax

According to newsreports, the taskforce has retained the basic exemption level at Rs 2.5 lakh for general income taxpayers. For senior citizens (above 60 years) the basic exemption stays at Rs 3 lakh and for very senior citizens (above 80 years) it stays at Rs 5 lakh.
Story first published: Monday, October 21, 2019, 14:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X