For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ రేట్ కట్ నా చేతుల్లో లేదు: నిర్మలా సీతారామన్

|

న్యూఢిల్లీ: జీఎస్ట తగ్గింపు తన చేతుల్లో లేదని, దానిపై నిర్ణయం జీఎస్టీ మండలి తీసుకుంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు తన చేతుల్లో లేదని, ఈ అంశంపై నిర్ణయాన్ని జీఎస్టీ మండలి తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

వివిధ బ్యాంకులను విలీనం చేయడంతో చాలామంది ఉద్యోగాలపై అభద్రతా భావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై నిర్మల స్పందించారు. ఏ బ్యాంకులు కూడా తమ ఉద్యోగులను తప్పుకోవాలని అడగలేదని, ఏ బ్యాంకును మూసివేయబోమని, ఉద్యోగుల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు. 'ఏ బ్యాంకును మూసివేయడం లేదు. ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలు మినహా అందుకు భిన్నంగా చేయాలని ఏ బ్యాంకూ ఉద్యోగులను అడగడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం వారికి ఎక్కువ మూలధనం ఇస్తోంద'న్నారు.

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు సంస్థలుగా విలీనం చేయడాన్ని నిరసిస్తూ చెన్నైలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శనివారం నిరసన తెలిపింది. భోపాల్, కోల్‌కత్తా పోటు ఇతర ప్రాంతాల్లోను నిరసనలు చోటు చేసుకున్నాయి. బ్యాంకుల్లోకి పెద్ద ఎత్తున మూలధనం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన అనంతరం బ్యాంకుల విలీనం జరిగింది. ఉద్యోగుల నిరసనపై ఆమె స్పందించారు.

మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటిమీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటి

GST Rate Cut Not in My Hands, Says Sitharaman

నిర్మలా సీతారామన్‌ను ఆర్థిక మందగమనంపై కూడా ఆమెకు ప్రశ్న ఎదురైంది. జూన్ క్వార్టర్‌లో కేవలం 5 శాతం మాత్రమే ఉండటంపై ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలో తెలుసుకునేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశమవుతున్నట్లు ఆమె చెప్పారు.
'ప్రభుత్వం వివిధ రంగాల వారితో సంప్రదింపులు జరిపింది. కొన్ని రంగాల నుంచి వారు ఏం ఆశిస్తున్నారో వివరాలు వస్తున్నాయి. నేను ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తున్నాను. ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాను. వారు ఏం కోరుకుంటున్నారు... ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తీసుకుంటున్నాను. ఇప్పటికే రెండుసార్లు కలిశాను. మళ్లీ కలుస్తాను' అని చెప్పారు.

English summary

జీఎస్టీ రేట్ కట్ నా చేతుల్లో లేదు: నిర్మలా సీతారామన్ | GST Rate Cut Not in My Hands, Says Sitharaman

Finance Minister Nirmala Sitharaman on Sunday said GST rate cut was not in her hands and it was the GST Council that would take a decision on the same.
Story first published: Monday, September 2, 2019, 9:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X