For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌వాసులకు శుభవార్త!: MI మొబైల్ రెండో ప్లాంట్, జగన్‌తో భేటీ

|

అమరావతి: ప్రస్తుతం తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ ఏది అంటే ఎవరైనా చెప్పేది షియోమీ.. ఎంఐ ఫోన్. భారత్‌కు వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే ఇది భారత మార్కెట్లో లీడర్‌గా నిలిచింది. స్మార్ట్ ఫోన్ మొబైల్ అమ్మకాల్లో ప్రస్తుతం ఇదే నెంబర్‌వన్‌గా ఉంది.

షియోమీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఏపీలో తన రెండో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ పేర్కొంది. షియోమీ బృందం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిందని, ఏపీలో మరో ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.

రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు, ఎలా చేరాలి, లాభాలేమిటి?రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు, ఎలా చేరాలి, లాభాలేమిటి?

ఏపీలో మరో ప్లాంటుపై షియోమీ ఆసక్తి

ఏపీలో మరో ప్లాంటుపై షియోమీ ఆసక్తి

'ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్లాంటుకు షావొమి ఆసక్తి. మఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసిన షావొమి బృందం. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ సహా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ప్రణాళికలు' అని ట్వీట్ చేసింది.

మనుకుమార్ జైన్ ట్వీట్

ఈ ట్వీట్‌ను షియోమీ ఇండియా హెడ్, షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ రీట్వీట్ చేస్తూ, ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించాడు. జగన్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని పేర్కొన్నారు. నేటి యువతకు మీరు (జగన్) ఆదర్శమని, రాష్ట్రానికి సంబంధించి మీ విజన్ ఏమిటో విన్న తర్వాత నాలో ప్రేరణ కలిగిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ చాలా సింపుల్ కానీ..

మరో ట్వీట్‌లో.. జగన్‌తో మీటింగ్ బాగా జరిగిందని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు. జగన్ చాలా సింపుల్‌గా కనిపిస్తారని, కానీ ఆత్మవిశ్వాసం ఎంతో ఉందని, అతని నుంచి ఎంతో నేర్చుకున్నామని, ఉత్తేజం పొందామని పేర్కొన్నారు. తాము మేకిన్ ఇండియా ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నామని, ఇప్పటికే తమ కంపెనీకి చెందిన ఎక్కువ ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయన్నారు. జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల తన విజన్‌ను తెలియజేశారన్నారు.

Read more about: xiaomi andhra pradesh company mobile
English summary

ఆంధ్రప్రదేశ్‌వాసులకు శుభవార్త!: MI మొబైల్ రెండో ప్లాంట్, జగన్‌తో భేటీ | Xiaomi to up Second Manufacturing unit in Andhra Pradesh

Representatives of Xiaomi met Chief Minister YS Jagan in Tadepalli and expressed interest over setting up a second manufacturing unit in Andhra Pradesh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X