For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాతో ట్రేడ్‌వార్ దెబ్బ: 1992 తర్వాత తొలిసారి పడిపోయిన చైనా GDP

|

బీజింగ్: అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు మూడు దశాబ్దాల్లో మొదటిసారి దారుణంగా పడిపోయిందట. 1992లో క్వార్టర్లీ డేటా ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెకండ్ క్వార్టర్‌లో మందగించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం వంటివి ఇందుకు కారణాలు. గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ గ్రోత్ 1990ల తర్వాత తొలిసారి వీక్‌గా కనిపించింది.

కొత్త అద్దె చట్టం: ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్కొత్త అద్దె చట్టం: ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్

గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్స్

గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్స్

నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా (NBS) వివరాల ప్రకారం.. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్స్ గత ఏడాది కంటే 6.2 శాతం పెరిగాయి. అయితే ఇది అంతకుముందు క్వార్టర్‌లో అంటే Q1లో 6.4 శాతంగా ఉంది. జూన్‌లో ఫ్యాక్టరీ అవుట్‌పుట్, రిటైల్ సేల్స్ గ్రోత్ అంచనాలను మించింది. జీడీపీ వృద్ధి రేటు 2018లో 6.6 శాతంగా ఉండగా, ప్రభుత్వం ఏడాదికి ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ 6.0 నుంచి 6.05 శాతంగా ఉంది. అంటే గత ఏడాది కంటే తగ్గింది.

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేసినా...

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేసినా...

ఇంటాబయటా ఆర్థిక పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించిందని, దీనికి తోడు బయటి ఒత్తిళ్లు, అనిశ్చితులు పెరుగుతున్నాయని NBS అధికార ప్రతినిధి మావో షెంగ్‌యాంగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోకి వెళ్లిపోయిందన్నారు. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేందుకు చైనా పలు చర్యలు చేపట్టింది. కానీ దేశీయ మందగమనాన్ని, ఓవర్సీస్ డిమాండ్‌ను బ్యాలెన్స్ చేసేందుకు సరిపోలేదు. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ వార్ కారణంగా మరింత దెబ్బతిన్నది.

ఎగుమతులు...

ఎగుమతులు...

మొదటి ఆరు నెలల్లో ఎగుమతులు కేవలం 0.1 శాతం మాత్రమే పెరిగాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేందుకు చైనా మరిన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. అయితే, కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మేలో ఇండస్ట్రియల్ ఔట్ పుట్ 5.0 శాతంగా ఉండగా, జూన్‌లో 6.3 శాతానికి పెరిగింది. అయితే 2002 తర్వాత ఇంత నెమ్మదించడం ఇదే మొదటిసారి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ మాత్రం బాగుంది. అర్బన్ అన్‌ఎంప్లాయిమెంట్ మే నెలలో 5.0గా ఉండగా, జూన్‌లో 5.1 శాతంగా ఉంది. చైనాలోని 1.3 బిలియన్ కన్స్యూమర్ల డిమాండ్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఉంటోంది.

English summary

అమెరికాతో ట్రేడ్‌వార్ దెబ్బ: 1992 తర్వాత తొలిసారి పడిపోయిన చైనా GDP | US trade war: China's growth slides to weakest pace in almost three decades

China's growth slowed to its weakest pace in almost three decades in the second quarter, with the US-China trade war and weakening global demand weighing on the world's number-two economy, official data showed Monday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X