వాషింగ్టన్: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ హువావేపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలాగే, అమెరికాకు చెందిన కంపెనీలు తమ టెక్నాలజీని చైనీస్ మొబైల్ సంస్థలకు విక్రయించవచ్చునని చెప్పారు. ఇటీవల హువావేపై నిషేధం నేపథ్యంలో ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు తమ టెక్నాలజీని నిలిపేస్తామని చెప్పాయి. ఇప్పుడు వాటికి ట్రంప్ అనుమతి ఇచ్చారు.
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఆయన ఈ నిర్ణయాన్ని ట్రంప్ వెల్లడించారు. దీని ప్రకారం కంపెనీలు హువావేకు పరికరాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం అమెరికా-చైనా చర్చల్లో హువావే ఓ భాగమన్నారు. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనంతకాలం దీనిని కొనసాగిస్తారు.

జీ20 సమ్మిట్ నేపథ్యంలో చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ట్రేడ్ వార్ అంశంపై చర్చించుకొన్నారు. దీనిపై హువావే ట్విటర్‌లో స్పందించింది. తాను హువావేకు అనుమతిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారని, మరోసారి హువావే అమెరికా టెక్నాలజీని కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది. మే నెలలో అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ హువావేకు టెక్నాలజీ విక్రయంపై నిషేధం విధించింది. అమెరికా జాతీయభద్రతకు హువావే ముప్పుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.
ఒసాకాలో ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... హువావేకు అనుమతిస్తున్నామని, ట్రేడ్ అగ్రిమెంట్ ఏమవుతుందో చూడాలన్నారు. అలాగే, ప్రస్తుతానికి 300 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై టారిఫ్ విధించమని కూడా చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని, అలాగే, చైనా నుంచి కూడా అవసరమైన ఉత్పత్తులను వాషింగ్టన్ దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ చెప్పారు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications