For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JIoతో సంబరపడుతున్నారా?: మొబైల్ ఇంటర్నెట్‌లో పాకిస్తాన్ కంటే మనమే దారుణం!

|

రిలయన్స్ జియో వచ్చాక టెలికం సర్వీస్ ప్రొవైడర్ల మధ్య డేటా యుద్ధం జరుగుతోంది. ఒకరి కంటే మరొకరు తక్కువ ధరకు, మరింత స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ ఉండేలా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జియో వచ్చాక ధరలు తగ్గడంతో పాటు, డేటా స్పీడ్‌లోను మార్పు ఉంది. జియో, ఎయిర్‌టెల్ వంటివి VOWIFI వంటి సేవలతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇంత పోటీలోను మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఇతర ఆసియా దేశాల కంటే భారత్‌లో తక్కువగా ఉందనే విషయం తెలుసా?

హెచ్చరిక!: మే 31వ తేదీలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండాలిహెచ్చరిక!: మే 31వ తేదీలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండాలి

ఆసియా దేశాల్లో పాకిస్తాన్ కంటే దారుణం

ఆసియా దేశాల్లో పాకిస్తాన్ కంటే దారుణం

ఇది నిజం. పలు ఆసియా దేశాల కంటే మొబైల్ ఇంటర్నెట్ భారత్‌లో స్లోగా ఉంది. పాకిస్తాన్ కూడా మనకంటే ముందు ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ ఈ ఏప్రిల్ నాటికి 121వ స్థానానికి పడిపోయింది. అంతకుముందు నెల ఇది 120వ స్థానంలో ఉంది. సియాటెల్‌కు చెందిన అనలటిక్స్ ఫర్మ్ ఊక్లా (Ookla) 138 దేశాల ఇంటర్నెట్ స్పీడ్‌పై మంత్లీ ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఇందులో భారత్ 121వ స్థానంలో నిలిచింది. రిలయన్స్ జియో ఎంట్రీతో మొబైల్ డేటా వేగం బాగా పెరిగిందని మనం భావిస్తున్నాం. కానీ మిగతా దేశాలతో పోలిస్తే స్పీడ్‌లో వెనుకే ఉన్నాం.

గ్లోబల్ యావరేజ్‌లో సగం కూడా లేదు

గ్లోబల్ యావరేజ్‌లో సగం కూడా లేదు

భారతదేశంలో గత ఏడాది (2018)డిసెంబర్‌లో యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 10.06 Mbps. ఈ ఏప్రిల్ (2019) నాటికి ఇది 10.71 Mbpsగా ఉంది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఇతర దేశాలతో పోలిస్తే అంతగా పెరగలేదు. పైగా, ఇతర దేశాల్లో స్పీడ్ పెరగగా, మన దేశం ఓ స్థానం దిగజారింది. మన కంటే మయన్మార్, శ్రీలంక, చైనా, పాకిస్తాన్‌లు ముందున్నాయి. ప్రపంచ యావరేజ్ 26.96గా ఉంది. ప్రపంచ యావరేజ్‌లో మనది కనీసం సగం కూడా లేదు.

ఏ దేశంలో మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఎంత అంటే?

ఏ దేశంలో మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఎంత అంటే?

చైనా 30.47 Mbps, శ్రీలంక 24.04 Mbps, మయన్మార్ 23 Mbps, మాల్దీవులు Mbps 23.6, పాకిస్తాన్ 13.39 Mbps, భారత్ 10.71 Mbps, నేపాల్ 10.33 Mbps, బంగ్లాదేశ్ 9.97 Mbps, ఆఫ్గనిస్తాన్ 7.78 Mbps, సౌత్ కొరియా 63.81 Mbps, ఇరాక్ 6.61 Mbpsగా ఉంది. ప్రపంచంలోనే సౌత్ కొరియా మొబైల్ డేటా ఇంటర్నెట్ స్పీడ్ అత్యధికం. 63.81 Mbps వేగం ఇది. అంటే మనకంటే ఆరు రెట్లు ఎక్కువ. అత్యంత దిగువస్థాయిలో ఇరాక్ (6.61 Mbps) ఉంది.

బ్రాడ్‌బాండ్‌లో మాత్రం రెండో స్థానం

బ్రాడ్‌బాండ్‌లో మాత్రం రెండో స్థానం

అదే సమయంలో ఫిక్స్డ్ బ్రాడ్ బాండ్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఇండియా మాత్రం బాగానే ఉంది. Ookla మంత్లీ (ఏప్రిల్) గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. 179 దేశాల్లో భారత్ 68వ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో మాత్రం మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

చైనా 89.56 Mbps, ఇండియా 29.35 Mbps, శ్రీలంక 23.3 Mbps, బంగ్లాదేశ్ 20.46 Mbps, నేపాల్ 18.74 Mbps, భూటాన్ 14.46 Mbps, మయన్మార్ 12.81 Mbps, మాల్దీవులు 12.07 Mbps, పాకిస్తాన్ 8.96 Mbps ఆఫ్గనిస్తాన్ 7.22 Mbps, సింగపూర్ 197.5, తుర్కెమినిస్తాన్ 3.11 Mbpsగా ఉంది. బ్రాడ్ బాండ్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో సింగపూర్ (197.5)తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే, తుర్కెమినిస్తాన్ (3.11 Mbps) చివరి స్థానంలో ఉంది. గ్లోబల్ యావరేజ్ 58.66గా ఉంది.

English summary

JIoతో సంబరపడుతున్నారా?: మొబైల్ ఇంటర్నెట్‌లో పాకిస్తాన్ కంటే మనమే దారుణం! | Mobile internet in India is slower than Pakistan

The India's ranking on the Speedtest Global index for mobile internet speeds, slipped to 121 in April this year, compared with 120 in the previous month.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X