For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్న్స్‌కు ఫేస్‌బుక్ ఎన్ని లక్షలిస్తుందో తెలుసా: ఊహించేరు.. నమ్మలేరు! టాప్ 25 ఇవే

|

విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు పెంచేందుకు ఫేస్‌బుక్, అమెజాన్ గూగుల్ వంటి ఎన్నో కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు ఫేస్‌బుక్ ఎంత స్టైఫండ్ ఇస్తుందో తెలిస్తే నమ్మలేరు. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఇస్తోంది. ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు. ప్రముఖ గ్లాస్ డోర్ సంస్థ రిపోర్ట్ ప్రకారం అందరికంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్ ఇచ్చే సంస్థ ఫేస్‌బుక్.

రెండేళ్లలో ఏ సంస్థ ఎంత స్టైఫండ్ పెంచిందంటే

రెండేళ్లలో ఏ సంస్థ ఎంత స్టైఫండ్ పెంచిందంటే

ఫేస్‌బుక్ తర్వాత ఇంటర్న్‌షిప్ ఎక్కువ ఇచ్చే సంస్థల్లో అమెజాన్ ఉంది. నెలకు అమెజాన్ 7,725 డాలర్లు (దాదాపు రూ.5,41,000) ఇస్తోంది. సేల్స్‌ఫోర్స్ సంస్థ 7,667 డాలర్లు (దాదాపు రూ.5,37,000), గూగుల్ 7,500 డాలర్లు (దాదాపు రూ.5,25,000) ఇస్తున్నాయి. అమెరికాలోని టెక్ కంపెనీల్లో స్టైఫండ్లు ఇవ్వడంలో ఫేస్‌బుక్ తొలి స్థానంలో ఉంది. గత రెండేళ్లుగా ఫేస్‌బుక్‌లో స్టైఫండ్ ఇలాగే ఉంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ మాత్రం పెంచాయి. అమెజాన్ 2017లో 6,400 డాలర్లు ఇవ్వగా, 2019లో 7,725 డాలర్లు ఇస్తోంది. గూగుల్ 6,000 నుంచి(దాదాపు రూ.4,20,000) నుంచి 7,500 డాలర్లు (దాదాపు రూ. 5,25,000), మైక్రోసాఫ్ట్ 7,100 డాలర్లు (దాదాపు రూ.4,97,000 ) నుంచి 7,250 డాలర్లు (దాదాపు రూ.5,00,000)కు పెంచింది. యాపిల్ మీడియన్ మంత్లీ స్టైఫండ్ 6,400 డాలర్లు (దాదాపు రూ.4,48,000) నుంచి 6,667 డాలర్లు (దాదాపు రూ.4,67,000)కు పెంచింది. ఫేస్‌బుక్ మధ్యంతర నెలసరి స్టైఫండ్ అమెరికాలోని టెక్ ఇండస్ట్రీలోనే అతి ఎక్కువ.

టాప్ 25 స్టైఫండ్స్, సంస్థలు

టాప్ 25 స్టైఫండ్స్, సంస్థలు

Facebook $8,000

Amazon $7,725

Salesforce $7,667

Google $7,500

Microsoft $7,250

Uber $7,167

Bloomberg $7,000

Capital One $7,000

Apple $6,667

Bank of America $5,833

JP Morgan $5,667

Goldman Sachs $5,367

Viasat $5,333

Visa $5,167

Intel $5,000

SAP $4,833

EY $4,825

Tesla $4,667

Deloitte $4,667

Cisco Systems $4,667

PwC $4,500

KPMG $4,500

Genentech $4,500

Dell $4,333

Boeing $4,167

ఫేస్‌బుక్‌లో ఏడాదికి 68 లక్షల స్టైఫండ్

ఫేస్‌బుక్‌లో ఏడాదికి 68 లక్షల స్టైఫండ్

ఫేస్‌బుక్‌లో ఇంటర్న్‌షిప్ పొందుతున్న వారికి నెలకు 8,000 డాలర్లను స్టైఫండ్‌గా ఇస్తోంది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.5,61,000. అంటే ఫేస్‌బుక్‌లో ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేస్తే అక్షరాలా 96,000 డాలర్లు వస్తాయి. అంటే మన రూపాయల్లో రూ.67,37,000. అమెరికాలో సగటు ఉద్యోగి వార్థిస వేతనం కంటే ఇది దాదాపు రెండింతలు. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 52,807 డాలర్లు (రూ.37,00,000).

ఫేస్‌బుక్ ఉద్యోగుల సరాసరి వేతనం ఏడాదికి 2,28,651 డాలర్లు. నెలకు సరాసరి 20,000 డాలర్లు. అంటే మన రూపాయల్లో సరాసరి రూ.14,00,000. ఇది కాకుండా ఇటీవల తమ కాంట్రాక్టువల్ వర్కర్స్‌కు గంటకు 15 డాలర్లు (దాదాపు రూ.1000) నుంచి 18 డాలర్లు (రూ.1,200), మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 20 డాలర్ల (దాదాపు రూ.1,400) నుంచి 22 డాలర్లు (దాదాపు రూ.1,500) పెంచుతున్నట్లు తెలిపింది.

English summary

ఇంటర్న్స్‌కు ఫేస్‌బుక్ ఎన్ని లక్షలిస్తుందో తెలుసా: ఊహించేరు.. నమ్మలేరు! టాప్ 25 ఇవే | Facebook pays its interns nearly double what the typical American makes

A new report by Glassdoor has revealed that Facebook, on an average, pays a monthly stipend of $8,000 (Rs 5,61,000 approx) to its paid interns.
Story first published: Thursday, May 16, 2019, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X