For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ: చైనీస్ హువావేపై నేరుగా యుద్ధం

|

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. నేషనల్ ఎమర్జెన్సీ విధించడంతో పాటు చైనా ఫోన్ దిగ్గజం హువావేపై కఠిన ఆంక్షళు విధించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎలాంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదని అమెరికా తెలిపింది. ఇప్పటికే అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్ ఈ నిర్ణయంతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినేలా ఉన్నాయని భావిస్తున్నారు.

ట్రంప్ నిర్ణయంపై హువావే స్పందన

ట్రంప్ నిర్ణయంపై హువావే స్పందన

చైనాకు చెందిన అతిపెద్ద టెలి కమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ కంపెనీ హువావే. దీనిని ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నాడు. గత కొంతకాలంగా అమెరికాకు, హువావే కంపెనీకి మధ్య పలు వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు హువావేపై ఆంక్షలు విధించింది. దీనిపై హువావే స్పందించింది. వ్యాపారాలు చేయడంపై ఇలాంటి నియంత్రణలు విధిస్తే అది అమెరికాకు సరికాదని అభిప్రాయపడింది. ఇలాంటి నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని బలవంతం లేదా సురక్షిత వ్యాపార దేశంగా చేయవని పేర్కొంది. తాము వ్యాపారం చేయకుండా అడ్డుకుంటే వినియోగదారులు, అమెరికా కంపెనీలే ఇబ్బందులు పడతాయని తెలిపింది. తాము ఏ ప్రభుత్వానికి లోబడి పని చేయడం లేదని స్పష్టం చేసింది. తమతో వ్యాపారం వదులుకొని ఖరీదైన ప్రత్యామ్నాయాలవైపు అమెరికా మళ్లుతోందని, అందుకే అర్థం లేని ఆంక్షలు విధిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

కంప్యూటర్ నెట్ వర్క్‌కు ప్రమాదం ఉందని...

కంప్యూటర్ నెట్ వర్క్‌కు ప్రమాదం ఉందని...

విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్ నెట్ వర్క్‌కు ముప్పు ఉందని చెబుతూ ట్రంప్.. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికం సేవలను వినియోగించకుండా అడ్డకట్ట వేసింది. ఇందులో ఏ దేశం, ఏ కంపెనీని లక్ష్యంగా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలపలేదు. అయితే ఈ నిర్ణయం నేపథ్యంలో అమెరికా నెట్ వర్క్స్ కంపెనీలు ఇతర దేశాల నుంచి టెలికం, కమ్యూనికేషన్స్ పరికరాల కొనుగోలుకు అడ్డుగా మారింది. అలాగే విదేశీ కంపెనీలు కూడా అమెరికా కంపెనీల నుంచి నెట్ వర్క్ పరికరాలు కొనాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. హువావే అంశంపై అమెరికా తన మిత్రదేశాలపై కూడా ఒత్తిడి తీసుకు వస్తోంది.

ఆ లిస్ట్‌లో హువావే

ఆ లిస్ట్‌లో హువావే

తొలుత ఏ దేశం, ఏ కంపెనీ పేరును పేర్కొననప్పటికీ, ఆ తర్వాత అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏ కంపెనీలపై అనాసక్తిగా ఉన్నామో తెలుపుతూ ఓ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో చైనా దిగ్గజం హువావే పేరు మాత్రమే ఉంది. హువావే, దాని అనుబంధ కంపెనీలకు పై నిబంధనలు వర్తిస్తాయి. చైనా సప్లయర్ల వద్ద నుంచి కొనుగోలు చేసే ఉపకరణాల వల్ల అమెరికా ఇంటర్నెట్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. హువావే చైనాకు గూఢచర్యం చేస్తోందని అనుమానిస్తోంది. అయితే దీనిని హువావే కొట్టిపారేసింది.

English summary

ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ: చైనీస్ హువావేపై నేరుగా యుద్ధం | Donald Trump puts Huawei on exports blacklist

America president Donald Trump stepped up his battle against Huawei Wednesday, effectively barring the china telecom giant from the US market and adding it to a blacklist restricting US sales to the firm amid an escalating trade war with China.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X