For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో ఎన్నికలు: జీఎస్పీపై తర్వాత నిర్ణయం తీసుకోండి.. ట్రంప్‌కు సెనేటర్లు

|

వాషింగ్టన్: భారత్‌కు ఉన్న వాణిజ్య ప్రాధాన్యతా హోదాపై (జీఎస్పీ - జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్) సమీక్ష నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అవి ముగిసేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) రాబర్ట్ లైథీజర్‌కు సెనేటర్లు లేఖ రాశారు. ఈ లేఖలో రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ కార్నిన్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్‌లు సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయాలు భారత్ - అమెరికా వ్యాపార సంబంధాలపై పడతాయని భావించారు. భారత్‌లో మే 23వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికలు ఉన్న విషయం మీకు తెలిసిందేనని సెనేటర్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Scrapping Indias trade privileges could hit US consumers: US Senators

జీఎస్పీ.. అమెరికాకు చెందిన అతిపెద్ద, ఎన్నో సంవత్సరాల నాటి ట్రేడ్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్. ఆర్థికంగా వెనుకబడిన దేశాల అభివృద్ధి కోసం అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య సహకార పథకమే జీఎస్పీ. ఈ పథకంలో ఉన్న దేశాలు ఎలాంటి పన్నులు లేకుండానే అమెరికాకు తమ ఎగుమతులు చేసుకోవచ్చు. అయితే ఈ పథకం నుంచి భారత్‌ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెనేటర్లు ఈ లేఖ రాశారు.

English summary

భారత్‌లో ఎన్నికలు: జీఎస్పీపై తర్వాత నిర్ణయం తీసుకోండి.. ట్రంప్‌కు సెనేటర్లు | Scrapping India's trade privileges could hit US consumers: US Senators

Two top American senators have urged the Trump administration to delay until the end of the general election its decision to terminate India's designation as a beneficiary developing country under the Generalized System of Preference due to a lack of compliance.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X