For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల్లో రుణమాఫీ జమ, రైతులకు ప్రభుత్వం శుభవార్త

|

ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం సోమవారం నాడు శుభవార్త తెలిపింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు ఈ రోజు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనిని విడతలవారీగా నెరవేర్చుతున్నారు.

జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎలా బుక్ చేయాలంటే: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండిజియోఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎలా బుక్ చేయాలంటే: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండి

రైతులకు ఇప్పటికి మూడు విడతలుగా రుణమాఫీ చేసారు. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడత నిధులను విడుదల చేశారు. రూ.3,900 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. 30 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.39వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు.

Good news to AP farmers from government

రైతులు రుణ అర్హత పత్రం, గుర్తింపు పత్రాలతో బ్యాంకుకు వెళ్లాలన్నారు. రుణ అర్హత పత్రాన్ని బ్యాంకులో నమోదు చేస్తే వడ్డీతో సహా ఇస్తారని తెలిపారు. ఏడాదికి 10 శాతం వడ్డీతో రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.

మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో 23.76 లక్షల మందికి తొలి విడతలో రుణమాఫీ చేస్తామన్నారు. ఖరీఫ్‌లోగా అన్నదాత సుఖీభవ క్లియర్ చేస్తామని చెప్పారు. పసుపు కుంకుమ కింద మూడో విడత చెక్కును బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

English summary

బ్యాంకుల్లో రుణమాఫీ జమ, రైతులకు ప్రభుత్వం శుభవార్త | Good news to AP farmers from government

Good news to Andhra Pradesh farmers from government on Monday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X