For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌1-బీ వీసా బిల్లుతో ప్ర‌భావితం కానున్న సాప్ట్‌వేర్‌కంపెనీలు

విదేశీ ఉద్యోగుల నుంచి ఎదుర‌వుతున్న పోటీని తగ్గించి అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఈ దిశ‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటూ ఇదివ‌ర‌కూ అమలులో ఉన్న హె

|

విదేశీ ఉద్యోగుల నుంచి ఎదుర‌వుతున్న పోటీని తగ్గించి అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప‌లు వివాద‌స్ప‌ద నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లోకెక్కుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్థానికుల‌కే ఉద్యోగాలంటూ ప్ర‌చారం చేప‌ట్టారు. ఇప్పుడు ఆ దిశ‌లో ప‌లు చ‌ర్య‌ల‌కు అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఐటీ కంపెనీలు, ఐటీ సంస్థ‌ల ఉద్యోగులు గుబులు చెందుతున్నారు.ఈ నేప‌థ్యంలో హెచ్-1 బీ వీసా బిల్లు మార్పులు, దాని ప్ర‌భావం ఏయే కంపెనీల‌పై ఉండ‌బోతోందో తెలుసుకుందాం.

అస‌లు బిల్లుపై ఎక్క‌డ ఏం జ‌రుగుతుంది?

అస‌లు బిల్లుపై ఎక్క‌డ ఏం జ‌రుగుతుంది?

మ‌న పార్ల‌మెంటు లాగే అమెరికాలో ఎంపీలు రెండు ర‌కాలుగా ఉంటారు. హౌస్ ఆఫ్ రెప్ర‌జేంటివ్‌, కామ‌న్స్ అని రెండు స‌భ‌లు మ‌న లోక్‌స‌భ‌, రాజ్య స‌భ‌లాగా ఉంటాయి. హౌస్ ఆఫ్ రెప్ర‌జేంటివ్ స‌భ‌ల్లోఅన్ని పార్టీల నుంచి స‌భ్యులు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై ఉంటారు. మ‌న రాజ్య‌స‌భ‌లో ఒక్కో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్రాతినిధ్యం వ‌హించేలా రాజ్య‌స‌భ ఉన్నట్లు అక్క‌డ ప్ర‌తి రాష్ట్రం నుంచి ఇద్ద‌రు స‌భ్యులను సెనేట్‌కు పంపుతారు. ప్ర‌స్తుతం హౌస్ ఆఫ్ రెప్ర‌జేంటివ్ స‌భ‌లో ఆ వివాద‌స్ప‌ద బిల్లును ఆమోదించిన అనంతం అధ్య‌క్షుడి ఆమోదానికి పంపారు. అక్క‌డే మొద‌లైంది అస‌లైన వివాదం.

బిల్లులో ఏముంది?

బిల్లులో ఏముంది?

కొత్త బిల్లు ప్ర‌కారం హెచ్‌-1బీ వీసా హోల్డ‌ర్లకు ఆయా సంస్థ‌లు 1,30,000 యూఎస్ డాల‌ర్ల‌ను వేత‌నంగా చెల్లించాలి. దీంతో ఏదైనా ఐటీ సంస్థ ఇత‌ర దేశాల నుంచి అమెరికాకు ఉద్యోగుల‌ను వ‌ల‌స పంపాల‌నుకుంటే ఖ‌ర్చు ఎక్కువ‌వుతుంది. దీని ద్వారా భార‌త సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల‌పై విప‌రీత‌మైన భారం ప‌డ‌గ‌ల‌ద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తాల్లో ఆర్జిస్తున్న సంస్థ‌ల‌కు అంత‌కంటే ఎక్కువ సొమ్ము ఉద్యోగి ద్వారా సంపాదించ‌గ‌లిగితే అదేమీ పెద్ద స‌మ‌స్య కాద‌నే నెపంతో అమెరిక‌న్ ప్ర‌తినిధులు ఈ ర‌క‌మైన క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వాదిస్తున్నారు. అయితే ప‌రోక్షంగా వ‌ల‌స‌ల‌ను త‌గ్గించ‌డం ద్వారా త‌మ దేశ యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగాల‌ను క‌ల్పించాల‌నేది ప్ర‌ణాళికగా ఉంద‌ని జ‌గ‌మెరిగిన సత్యం.

బిల్లు క‌స‌ర‌త్తు

బిల్లు క‌స‌ర‌త్తు

ప్ర‌పంచ దేశాల‌న్ని వ్య‌తిరేకిస్తున్న‌ ఆ బిల్లు పేరు ‘హై స్కిల్‌డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్ ఆప్ 2017(హై స్కిల్‌డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్‌2017)' బిల్లు రూప‌క‌ల్ప‌న జ‌రిగేందుకు కృషి చేసిన స‌భ్యురాలి పేరు జోయి లోఫ్గ్రెన్ ప్ర‌యారిటిజైస్‌. ఆమె కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ స‌భ్యురాలు. ఏ కంపెనీలైతే ప్ర‌స్తుతం ఉన్న వేత‌నానికి రెండింత‌లు చెల్లిస్తాయో వాటికే వీసాలివ్వాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం 1989 నిర్ణ‌యించిన రేట్ల ప్ర‌కార‌మే అన్ని సంస్థ‌లు వేత‌నాలు చెల్లిస్తూ వ‌స్తున్నాయి. అప్ప‌టి నిర్ణ‌యం ప్ర‌కారం 60 వేల అమెరిక‌న్ డాల‌ర్లుగా వేత‌నం ఉంది. కొత్త బిల్లు ప్ర‌వేశ‌పెడితే అది కాస్తా 1,30,000 డాల‌ర్లు కాగ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇక్క‌డ ఒక సానుకూలాంశం ఉంది. ఇదివ‌ర‌కూ ప్ర‌తిదేశానికి ఇన్ని వీసాలు అని చెప్పి ప‌రిమితి ఉంది. కొత్త హెచ్‌-1బీ బిల్లు దాన్ని తొల‌గిస్తుంది. ఇది ఒక ర‌కంగా ఐటీ సంస్థ‌ల‌కు లాభించిదే.

ఏమ‌వుతుంది?

ఏమ‌వుతుంది?

డిపెండెంట్ వీసాలకు, దంపతుల వీసాలకు ఇక తావు ఉండక పోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్ 1 బీ వీసా చట్ట సవరణ ప్రకారం ఐటీ కంపెనీలు తొలుత అమెరికన్ ఇంజినీర్‌ను నియమించుకోవాలి. ఒకవేళ విదేశీ సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తే అత్యంత అధిక వేతనం చెల్లించాలి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ప్రతిభావంతులైన ఉద్యోగుల నియామక విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీలు పూర్తిగా నియామక పద్ధతులే మార్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం సంస్థ‌ల‌పై ప‌డే ప్ర‌భావంలో పెద్ద కంపెనీలే ఎక్కువ భారం వ‌హించాల్సి వ‌స్తుంది. ఇది ప‌రోక్షంగా ఉద్యోగుల‌పై ప‌డుతుంద‌ని ఆయా కంపెనీలు భయ‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొత్త బిల్లు కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప‌ది భార‌త ఐటీ కంపెనీలేవో తెలుసుకుందాం. (కింద ఇస్తున్న వేత‌నాన్ని డాల‌ర్ల‌లోనే ప‌రిగ‌ణించ‌గ‌లరు)

ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్

ద‌రఖాస్తుల సంఖ్య‌: 25,405

స‌గ‌టు వేత‌నం : 81,705

టీసీఎస్‌

టీసీఎస్‌

ద‌రఖాస్తుల సంఖ్య‌: 13,134

స‌గ‌టు వేత‌నం : 76,099

క్యాప్‌జెమిని:

క్యాప్‌జెమిని:

ద‌రఖాస్తుల సంఖ్య‌: 17,479

స‌గ‌టు వేత‌నం : 93,213

విప్రో

విప్రో

ద‌రఖాస్తుల సంఖ్య‌: 10,607

స‌గ‌టు వేత‌నం : 72,720

ఎల్ అండ్ టీ

ఎల్ అండ్ టీ

ద‌రఖాస్తుల సంఖ్య‌: 3092

స‌గ‌టు వేత‌నం : 76,755

యాక్సెంచ‌ర్‌(Accenture)

యాక్సెంచ‌ర్‌(Accenture)

ద‌రఖాస్తుల సంఖ్య‌:9479

స‌గ‌టు వేత‌నం : 81,585

డెలాయిట్‌

డెలాయిట్‌

ద‌రఖాస్తుల సంఖ్య‌: 1646

స‌గ‌టు వేత‌నం : 75,705

 సీటీఎస్‌(కాగ్నిజెంట్)

సీటీఎస్‌(కాగ్నిజెంట్)

ద‌రఖాస్తుల సంఖ్య‌: 5370

స‌గ‌టు వేత‌నం : 74,628

యాపిల్

యాపిల్

ద‌రఖాస్తుల సంఖ్య‌: 1660

స‌గ‌టు వేత‌నం : 1,41,294

ఐబీఎమ్‌

ఐబీఎమ్‌

ద‌రఖాస్తుల సంఖ్య‌: 12,381

స‌గ‌టు వేత‌నం : 87,378

హెచ్‌-1బీ వీసాల‌పై నారాయ‌ణ మూర్తి ఏమ‌న్నారు?

హెచ్‌-1బీ వీసాల‌పై నారాయ‌ణ మూర్తి ఏమ‌న్నారు?

హెచ్‌-1బీ వీసాలకు సంబందించి డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇన్ ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఒక రకంగా సమర్దించారనుకోవాలి. భారతీయ కంపెనీలు హెచ్ 1 బి వీసాల వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. అమెరికాలో అమెరికా నివాసితులనే తీసుకోవాలి, కెనడాలో కెనడియన్లను, బ్రిటన్‌లో బ్రిటన్ వారిని నియమించుకోవాలి. అలా చేస్తేనే మనం నిజమైన బహుళ జాతీయ కంపెనీలగా పేరులోకి వస్తాం. హెచ్-1బీ వీసాల వాడకం తగ్గించేయండి. భారీగా భారతీయులను ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం కూడా తగ్గించాలని నారాయణ మూర్తి ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబిప్రాయపడ్డారు.ట్రంప్ నిర్ణయాలు అమల్లోకి వస్తే, మన కంపెనీలు మరింత బహుళ సాంస్కృతిక కంపెనీలుగా పేరులోకి రావడానికి ఎంతో సహకరించనున్నాయని ఆయన అబిప్రాయపడ్డారు.

ముగింపు-ఇప్పుడు ఏం జ‌రిగింది, మామూలుగా ఏం జ‌రుగుతోంది?

ముగింపు-ఇప్పుడు ఏం జ‌రిగింది, మామూలుగా ఏం జ‌రుగుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను సియాటల్ కోర్టు అడ్డుకుంది. ఇమ్మిగ్రేషన్‌ అర్డర్‌పై సియాటిల్‌ కోర్టు స్టే విధించింది. ఏడు దేశాల ప్రజలపై నిషేధాన్ని కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ముస్లిం దేశాల నుంచి శ‌ర‌ణార్థుల‌ ప్రవేశాన్ని రద్దు చేస్తూ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలపై ఫెడరల్‌ జడ్జి జేమ్స్‌రాబర్ట్స్‌ స్టే విధించారు.

అమెరికా దేశం ఎంత‌గా వీసా ఫీజులు పెంచుతున్నా అక్క‌డికి వెళ్లే భార‌తీయుల సంఖ్య మాత్రం త‌గ్గ‌ట్లేదు. మొత్తం వీసా ద‌ర‌ఖాస్తుదారుల్లో హెచ్‌1బీలో 72 శాతం, ఎల్‌1 వీసాల్లో 30 శాతం మంది భార‌తీయులు ఉన్నారు. గ‌త‌ ఏడాది ప్రారంభంలో అమెరికా ప‌లు ర‌కాల వీసా ఫీజుల‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే.

English summary

హెచ్‌1-బీ వీసా బిల్లుతో ప్ర‌భావితం కానున్న సాప్ట్‌వేర్‌కంపెనీలు | Top 10 companies that will be adversely affected on US new H1B visa bill

Top 10 companies that will be adversely affected on US new H1B visa bill. with new bill these will have to shell more money for visas. This is more than double of the current H-1B minimum wage of USD 60,000 which was established in 1989 and since then has remained unchanged
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X