For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ గర్ల్: అనిల్ అంబానీ ఐటి అకౌంట్ హ్యాక్

By Pratap
|

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఐటి అకౌంట్‌ను ఓ హైదరాబాద్ అమ్మాయి హ్యాక్ చేసినట్లు తేలింది. అనిల్ అంబానీ ఆదాయపు పన్ను రిటర్న్ ఈ ఫైలింగ్ అకౌంట్‌ను ఆమె హ్యాక్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని మనోజ్ దాగా అండ్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్టికల్‌షిప్ చేస్తున్న 21 ఏళ్ల ఆ అమ్మాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనిల్ ఆదాయం పన్ను చెల్లింపుల వివరాలను తెలుసుకునే ఉద్దేశంతో ఆమె ఆ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆమెను ఆరెస్టు చేసే అవకాశాలున్నాయి.

Anil Ambani

అనిల్ అంబానీ ఆదాయ వివరాలను, పన్ను చెల్లింపు వివరాలను తెలుసుకోవడానికి ఆణె ఈ ఫైలింగ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్ల చెబుతున్నారు. హ్యాకింగ్ చేసి అనిల్ అంబానీ ఆదాయం, పన్ను చెల్లింపు మొత్తం, పాన్ కార్డు నెంబర్ తెలుసుకుంది. అంతేకాకుండా ఐటి వెబ్‌సైట్‌లో ఈ అకౌంట్ రెండు సార్లు పాస్‌వర్డ్‌ను కూడా మార్చింది.

అనిల్ అంబానీ ఈ రిటర్న్ అకౌంట్ మార్చినట్లు ఐటి శాఖ జూన్ 26వ తేదీన ఆయన వ్యక్తిగత ఆదాయం వివరాలను సమర్పించే ముంబైలోని చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీకి ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్లు, రెండో సారి పాస్‌వర్డ్ మార్చినట్లు మరో మెయిల్ ఐటి శాఖ నుంచి జులై 12వ తేదీన మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దాంతో అనుమానం వచ్చి ఆదాగ్ గ్రూప్ ప్రతినిధి ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) హిమాంశు రాయ్‌కి ఫిర్యాదు చేశారు. దాన్ని ఆయన దర్యాప్తు నిమిత్తం సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ ముకుంద్ పవార్‌‍కు పంపించారు. మనోజ్ దాగా అండ్ కంపెనీ కంప్యూటర్ ద్వారా అది హ్యాక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. దాంతో ఓ బృందం హైదరాబాదు చేరుకుని అమ్మాయిని విచారించింది. తన తప్పును ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం.

English summary

హైదరాబాద్ గర్ల్: అనిల్ అంబానీ ఐటి అకౌంట్ హ్యాక్ | CA student hacks Anil Ambani’s IT account

A young chartered accountant student from Hyderabad has allegedly hacked into the e-filing of income tax returns account of leading industrialist Anil Ambani, with an intention to know his income and tax amount paid over a period of time, Police said today.
Story first published: Friday, September 13, 2013, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X