For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డు వివరాలు ఇవ్వలేదా... అయితే, 20% పన్ను బాదుడే!

|

ఎప్పటిలాగే మరో ఆర్థిక సంవత్సరం ముగియ వస్తోంది. కొందరికి సంతోషాన్ని, మరికొందరికి విచారాన్ని మిగిల్చిన 2019-20 ఆర్థిక సంవత్సరం త్వరలోనే మనకు గుడ్ బై చెప్పబోతోంది. ఈ సందర్భంగా కంపెనీలు ఉద్యోగుల పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు వంటి వన్నీ కూడా అడుగుతారు. అదే సమయంలో మన పాన్ కార్డు వివరాలు, అలాగే ఆధార్ కార్డు వివరాలు కూడా పేర్కొనమంటారు. వారికి అన్ని వివరాలు అందించి, కంపెనీ అధికారులకు సహకరించండి. లేదంటే మీకు అధిక పన్ను కోత పడొచ్చు. గత బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక నిబంధన వల్ల కొత్త చిక్కొచ్చి పడింది. దానిని సరిగ్గా అర్థం చేసుకోక పోతే... మీకు పన్ను బాదుడే మిగులుతుందని టాక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని వివరాలతో పాటు... పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు అందజేయండి. నిశ్చింతగా ఉండండని వారు సూచిస్తున్నారు.

ఇవ్వకపోతే ఏం జరుగుతుంది...

ఇవ్వకపోతే ఏం జరుగుతుంది...

ఆ... చెప్పే వాళ్ళు వంద చెబుతారు. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది లే అని తేలిగ్గా తీసుకోకండి. మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ కి పాన్ కార్డు వివరాలతో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా తప్పనిసరిగా ఇవ్వండి. లేదంటే ఏం జరుగుతుందంటే... మీకు 20% పన్ను పోటు పడుతుంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ అటు సోర్స్) తెలుసు కదా... ? ఆ పద్దులో మీరు పన్ను బ్రాకెట్ లో ఉన్నా లేకున్నా మీకు 20% టీడీఎస్ కట్ అవుతుంది. అందుకే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు చెబుతున్నారు టాక్స్ నిపుణులు. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది ప్రొసీజర్ కు కాబట్టి, అలాగే జరుగుతుందని ఒక ప్రభుత్వ పన్ను వసూలు అధికారి వ్యాఖ్యానించారు.

ఎందుకిలా...

ఎందుకిలా...

అసలు దీనికి ఎందుకింత ప్రాధాన్యం లభించిందంటే... గత బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక ప్రకటన చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఎదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది అని చెప్పారు. పాన్ కార్డు లేని వారిని ఉద్దేశించి ఇలాంటి ప్రకటన చేశారు. కానీ, సాక్షాత్తూ ఆర్థిక మంత్రి చెప్పారు కదాని మీరు పాన్ కార్డు వివరాలు ఇవ్వకపోతే మాత్రం పైన వివరించిన విధంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఈ విషయంలో జరా భద్రంగా ఉండండి. అధిక పన్ను పోటు ప్రమాదం నుంచి బయటపడండి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర అంశాలపైనా ...

ఇతర అంశాలపైనా ...

ఎలాగూ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం ఆసన్నం ఐంది. కాబట్టి మీరు చేసిన పెట్టుబడులకు సంబంధించిన ప్రూఫ్ మరోసారి సరిచూసుకోండి. ఇంకా ఇంటి అద్దెలకు సంబంధించిన రశీదులు తీసుకోండి. ఎల్ ఐ సి పాలిసీలు ఉంటే వాటి ప్రీమియం చెల్లించిన రశీదులు కూడా అందుబాటులో ఉంచుకోండి. అలాగే పిల్లల స్కూల్ ఫీజుల రశీదులు, హోమ్ లోన్ కు చెల్లించిన ఇంటరెస్ట్ పేడ్ సర్టిఫికెట్ సహా అన్ని రకాల ఇన్ కమ్ ప్రూఫ్స్ అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే డిసెంబర్ లో మీరు ఇచ్చిన ఎస్టిమేషన్ కు ఫిబ్రవరి లేదా మార్చిలో మీ కంపెనీ వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు కనీస పన్ను రేటు నుంచి గరిష్ట పన్ను స్లాబులోకి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ మేరకు మీ వేతనం నుంచి టీడీఎస్ కట్ చేసి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు. మళ్ళీ మీరు రిటర్న్ లు దాఖలు చేసి ప్రూఫ్స్ సమర్థిపిస్తేనే... రిఫండ్ వస్తుంది. లేదంటే అంతే సంగతులు. సో .. బహు పరాక్.

English summary

20% TDS if employee doesn’t share PAN or Aadhaar

The government has made it mandatory for employees, who are subjected to tax deducted at source (TDS), to share their permanent account number or Aadhaar, or face the prospect of a mandatory 20% deduction from their salary.
Story first published: Sunday, January 26, 2020, 12:48 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more