For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

covid 19: బ్యాంకుకు వెళ్లకుండానే SBI ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్: ఎలా ఓపెన్ చేయాలి?

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆధార్ కార్డుతో ఆన్‌లైన్ ద్వారా ఇన్‌స్టాంట్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ని తెరిచే సదుపాయాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐకి చెందిన యోనో యాప్ ద్వారా ఆన్ లైన్ ఖాతాను తెరవాలనుకునే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం పాన్ నెంబర్, ఆధార్ నెంబర్‌ను ఉపయోగించే డిజిటల్ రూపంలో లేదా కాగితరహితంగా తక్షణ డిజిటల్ సేవింగ్ ఖాతాను తెరువవచ్చునని ఎస్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

 3 ఇండియన్ ఫార్మా కంపెనీలను కోర్టుకు లాగిన అమెరికా! అరబిందో, సన్ ఫార్మాకు చిక్కులు 3 ఇండియన్ ఫార్మా కంపెనీలను కోర్టుకు లాగిన అమెరికా! అరబిందో, సన్ ఫార్మాకు చిక్కులు

అకౌంట్ కోసం ఇలా చేస్తే చాలు

అకౌంట్ కోసం ఇలా చేస్తే చాలు

ఆన్‌లైన్ సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకునే వారు ప్లేస్టోర్ నుండి యోనో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. పాన్ నెంబర్, ఆధార్ వివరాలు ఇవ్వాలి. వివరాలు ఇచ్చాక ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేసి ఇతర వివరాలు సమర్పించాలి. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. పూర్తి KYC అప్ డేట్ కోసం ఏడాదిలో ఎప్పుడైన మీ దగ్గరలోని బ్రాంచీని సంప్రదించవచ్చు. అంటే అకౌంట్ తెరిచాక ఏడాది సమయం ఉంటుంది.

అకౌంట్ తెరిస్తే ఇవి ఇస్తారు

అకౌంట్ తెరిస్తే ఇవి ఇస్తారు

ఆన్‌లైన్‌లో అకౌంట్ తెరిచిన వారికి రూపే ఏటీఎం, డెబిట్ కార్డును జారీ చేస్తుంది ఎస్బీఐ. ఎస్బీఐ ఎస్సెమ్మెస్ అలర్ట్స్‌తో పాటు మిస్డ్ కాల్ సేవలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తికాగానే అకౌంట్ హోల్డర్ ట్రాన్సాక్షన్స్ ప్రారంభించవచ్చు. పేపర్‌లెస్‌గా తక్షణ సేవింగ్స్ బ్యాంకు ఖాతాను పాన్, ఆధార్ వివరాలతో తెరవవచ్చునని ఎస్బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపింది.

24x7 బ్యాంకింగ్ యాక్సెస్

24x7 బ్యాంకింగ్ యాక్సెస్

బ్యాంకు బ్రాంచీని సందర్శికుండానే ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చునని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌కు 24x7 బ్యాంకింగ్ యాక్సెస్ ఉంటుంది.

English summary

covid 19: బ్యాంకుకు వెళ్లకుండానే SBI ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్: ఎలా ఓపెన్ చేయాలి? | SBI relaunches Aadhaar based online savings account opening

The SBI on Friday relaunched its Aadhaar-based instant digital savings account facility for customers who want to open an online account using the Yono platform.
Story first published: Saturday, June 13, 2020, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X