న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2019. డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటారు. మరికొందరు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంటారు. నాన్ శాలరీ రిసిప్ట్స్ పైన ట్యాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. అంటే మీ ఈ-వ్యాలెట్‌లోకి స్నేహితులు లేదా ఇతర బంధువుల ద్వారా వచ్చే నగదు, ఈ-షాపింగ్స్ వంటి ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్ల ద్వారా మీకు కలిగిన లాభంపై ట్యాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఈ-వ్యాలెట్‌లోకి వచ్చే మనీ
ఇప్పుడు సాధారణంగా ఎంతోమంది ఈ-వ్యాలెట్‌లు ఉపయోగిస్తున్నారు. దీంతో స్నేహితులు, ఇతరులకు నుంచి ఈ-వ్యాలెట్ ద్వారానే డబ్బులు పంపించడం లేదా డబ్బులు రిసీవ్ చేసుకోవడం చేస్తున్నారు. ఫోన్ ద్వారా మనీ ట్రాన్సుఫర్ సులభమైంది. ఆదాయపన్ను నిబంధనల ప్రకారం బహుమతులుగా పరిగణించే వాటి విలువ రూ.50,000 లోపు ఉంటే గిఫ్ట్ ట్యాక్స్ వర్తించదు. స్నేహితులు లేదా ఎవరైనా రూ.50,000 ట్రాన్సుఫర్ మించితే మాత్రం అది ట్యాక్స్ పరిదిలోకి వస్తుంది. ఒకవేళ, మనకు ఎవరైనా మనకు ఇవ్వాల్సిన డెబ్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో దానికి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అయితే ఇందుకు సంబంధించి వారి నుంచి రాతపూర్వక పత్రం తీసుకొని, దానిని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సమర్పించాల్సి ఉంటుంది.

క్యాష్ రివార్డ్స్
ఇప్పుడు క్యాష్ రివార్డులు అనేది సాధారణంగా మారిపోయాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఆన్‍లైన్ పేమెంట్స్ యాప్స్, క్రెడిట్ కార్డ్స్ వంటి వాటిని ఉపయోగిస్తే క్యాష్ రివార్డ్స్ ఇస్తుంటారు. ఈ క్యాష్ బ్యాక్ సదరు క్రెడిట్ కార్డ్, పేమెంట్ యాప్‌కు అనుసంధానమైన వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్లోకి జమ చేయబడుతుంది. ఎలా వచ్చినా... ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్ అమౌంట్ మీకు ఆదాయం కిందకే వస్తుంది. ఇలాంటి దానిని మీరు ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో సమర్పించాలా? అంటే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తే 'ఇతర సోర్స్ ద్వారా ఇన్‌కం'గా చూపించాలి. రూ.50 వేల కంటే తక్కువగా ఉంటే మాత్రం చూపించవలసిన అవసరం లేదు.

గిఫ్ట్ వోచర్స్ ద్వారా వచ్చిన గిఫ్ట్స్ లేదా రివార్డ్స్
ఇక్కడ ట్యాక్సేషన్ యాస్పెక్ట్ మీకు బహుమతి వోచర్ ఇచ్చిన వ్యక్తితో మీకు ఎలాంటి సంబంధం ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ, మీరు మీ కంపెనీ యజమాని నుంచి రూ.5,000 విలువ కలిగిన గిఫ్ట్ ఓచర్‌ను అందుకున్నప్పుడు ఆదాయపన్ను చట్టం నిబంధన (7)(iv) ప్రకారం పన్నుకు లోబడి ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు లేదా ఇతర రిలేషన్ కలిగిన వ్యక్తి లేదా వారసులు.. వంటి వాటి నుంచి వచ్చే వాటిపై ఎలాంటి పన్ను ఇబ్బందులు లేవు. అదే సమయంలో స్నేహితులు, ఇతర గిఫ్ట్ ఓచర్ల పైన రూ.50,000 మించితే పన్ను పరిమితికి లోబడి ఉంటుంది.

1961 చట్టం ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను
బహుమతులు నిజానికి భారతదేశంలో పన్నురహితమయినవా లేదా పన్ను విధించదగినవా అనేది మనం ముందు తెలుసుకోవాలి. 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, బహుమతి విలువ రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే, అటువంటి వాటిపై స్వీకర్త చేతిలో ఉన్న ఆదాయంలో భాగంగా పన్ను విధించబడుతుంది. బహుమతి ఈ క్రింది రూపాలలో ఎదో ఒక రూపంలో నగదు, కదిలే లేదా స్థిరమైన ఆస్తి, ఆభరణాలు మొదలైనవి కావచ్చు. వ్యక్తి సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల యొక్క సోదరుడు లేదా సోదరి, వ్యక్తి భార్య సహోదరుడు, భాగస్వామి దగ్గరి వారు.. ఇలా వీటిపై పన్నురహితంగా ఆ బహుమతిని క్లెయిమ్ చేసుకోవచ్చు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications