English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

క్రెడిట్ కార్డు - వివిధ రుసుముల సంగ‌తిలా...

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

క్రెడిట్ కార్డుకు మొద‌ట్లో వార్షిక నిర్వ‌హ‌ణ రుసుము ఉండ‌ద‌ని చెబుతారు. ఒక ఏడాది కాగానే బాదుడు మొద‌లుపెడ‌తారు. మీరు గ‌ట్టిగా అడిగేస‌రికి నిబంధ‌న‌ల‌ను చ‌దువుకోమ‌ని చెబుతారు. ఆ ప‌రిస్థితుల్లో మీరు చేయ‌గ‌లిగిందేమీ లేదు. కార్డుతో బాగా ఖ‌ర్చుల‌న్నా చేయాలి లేదా ఆ కార్డు తీసేసి ఇంకో కొత్త దాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కార్డుకు సంబంధించి ఫ్రీ ఫ్రీ అంటూనే క్రెడిట్ కార్డు కంపెనీలు విధించే పలు రుసుములను ఇక్క‌డ తెలుసుకోండి.

1. రెండు ర‌కాల రుసుములుంటాయి

1. రెండు ర‌కాల రుసుములుంటాయి

క్రెడిట్ కార్డు తీసుకుని వాడ‌దాం అనుకోగానే ఎక్కు మంది ఆలోచించేది వార్షిక నిర్వ‌హ‌ణ రుసుము, ప‌రిమితి గురించి. చాలా బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డు అంటూ ఉంటాయి కదా దాన‌ర్థం ఏంటంటే ఏడాది మపాటు జాయినింగ్ ఫీజు, వార్షిక నిర్వ‌హ‌ణ రుసుములు లేకుండా కార్డు ఇస్తారు. త‌ర్వాత రెండో సంవ‌త్స‌రం నుంచి వార్షిక నిర్వ‌హ‌ణ రుసుము క‌ట్టాల్సిందే. కొన్ని బ్యాంకులు మాత్ర‌మే జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డుల‌ను ఇస్తున్నాయి.

2. వ‌డ్డీ రుసుములు

2. వ‌డ్డీ రుసుములు

క్రెడిట్ కార్డు బిల్లులో స్ప‌ష్టంగా ఎంత అప్పు తీర్చాలో ఉంటుంది. అయితే మొద‌ట్లో ఈ బిల్లు అంద‌రికీ అర్థం కాక‌పోవ‌చ్చు. క్రెడిట్ కార్డు నెల‌వారీ బిల్లులో రెండు ర‌కాల వివ‌రాలు ఉంటాయి. ఒక‌టి మొత్తం క‌ట్టాల్సిన అప్పు కాగా రెండోది క‌నీసం చెల్లించాల్సింది(మినిమ‌మ్ డ్యూ). మిగిలింది త‌ర్వాత కూడా కట్టేందుకు వీలుంది క‌దా అనే ఉద్దేశంతో చాలా మంది క‌నీస మొత్తం చెల్లించి ఊరుకుంటారు. కానీ ఆ మిగ‌తా మొత్తం మీద దాదాపు 2 నుంచి 4 శాతం మేర నెల‌వారీగా వ‌డ్డీ విధిస్తార‌న్న సంగ‌తి తెలియ‌క‌పోవ‌చ్చు. అయితే కొన్ని బ్యాంకులు ప్ర‌త్యేక కార్డుల‌కు ఆ మిగిలిన క్రెడిట్ కార్డు అప్పుపై అధిక చార్జీలు విధించ‌ట్లేదు. సాధార‌ణంగా నెల‌వారీ వ‌డ్డీ రేటును ఏడాది మొత్తానికి అన్వ‌యించి సంవ‌త్స‌ర ప్రాతిప‌దిక‌న ప‌ర్సంటెజీని నిర్ణయిస్తారు. ఇది ఏకంగా 36-38% స్థాయిలో కూడా ఉండొచ్చు.

3. ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్ చార్జీలు(క్యాష్ విత్‌డ్రాయ‌ల్)

3. ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్ చార్జీలు(క్యాష్ విత్‌డ్రాయ‌ల్)

క్రెడిట్ కార్డుతో కేవ‌లం బిల్లులు చెల్లించ‌డ‌మే కాకుండా ఇంకా చాలా చేయొచ్చు. అందులో ఒక‌టి ఏటీఎమ్ యంత్రంలో డ‌బ్బులు విత్‌డ్రా చ‌య‌డం. సాధార‌ణంగా ఇలాంటి న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్ విష‌యంలో లావాదేవీల మీద క‌నీస చార్జీలు విధిస్తారు. ఇవి తీసుకున్న మొత్తం మీద 2.5% వ‌ర‌కూ ఉండొచ్చు. ఈ వ‌డ్డీ వార్షిక ప్రాతిప‌దిక‌న చూస్తే 24-46 శాతం మ‌ధ్య ఉంటుంది. క‌నుక న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్ అవ‌స‌రాల కోసం క్రెడిట్ కార్డు ఉప‌యోగించ‌కుండా నియంత్రించుకోవాలి. దానికి బ‌దులు డెబిట్ కార్డు వాడ‌టం మేలు. గత్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఎక్క‌డా డ‌బ్బు పుట్ట‌క‌పోతే అప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకోవాలి.

4. ప‌రిమితి దాటి ఉప‌యోగిస్తే

4. ప‌రిమితి దాటి ఉప‌యోగిస్తే

సాధార‌ణంగా ఉద్యోగుల‌కు అయితే బేసిక్‌, డీఏ,హెచ్ఆర్‌ఏ అన్నింటిని క‌లిపితే వచ్చే దానిపై 3 రెట్ల వ‌ర‌కూ క్రెడిట్ కార్డు ప‌రిమితిని నిర్ణ‌యిస్తారు. ఈ ప‌రిమితికి మించి రూ.1 ఎక్కువ వాడినా, మినిమ‌మ్ ఓవ‌ర్ లిమిట్ రూపంలో రూ.500 లేదా 2.5% రుసుము విధిస్తారు.

5.ఆల‌స్య చెల్లింపు రుసుము

5.ఆల‌స్య చెల్లింపు రుసుము

గ‌డువు లోపు క్రెడిట్ కార్డు అప్పు క‌ట్ట‌లేన‌ప్పుడు అద‌నంగా ఆల‌స్య చెల్లింపు రుసుముతో స‌హా క‌ట్టాలి. వ‌డ్డీచార్జీల‌తో సంబంధం లేకుండా ఇది ఫ్లాట్ ఫీజు రూపంలో ఉంటుంది. రూ.500 నుంచి రూ.20 వేల మ‌ధ్య‌యితే అద‌నంగా ఆల‌స్య చెల్లింపు రుసుముల రూపంలో రూ.100 నుంచి రూ.600 క‌ట్టాల్సి వ‌స్తుంది. అదే రూ.20 వేలు దాటిన సంద‌ర్భంలో రూ.700-800 వ‌ర‌కూ రుసుము క‌ట్టాల్సిందే.

6. డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీ

6. డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీ

మొద‌ట్లో మీరు ఎంచుకునే దాన్ని బ‌ట్టి మీరు ఇచ్చిన చిరునామాకు లేదా మెయిల్ ఐడీకి స్టేట్మెంట్ల‌ను నెల‌వారీ పంపుతారు. పోస్ట‌ల్ అడ్ర‌స్‌కు ఒక‌సారే ఉచితంగా స్టేట్‌మెంట్ పంపుతారు. అది కాకుండా అద‌నంగా డూప్లికేట్ స్టేట్మెంట్ ఫీ అడిగితే డ‌బ్బు క‌ట్టాలి. డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీ రూ.50 నుంచి రూ.100 వ‌ర‌కూ ఉంటుంది.

7. కార్డు రీప్లేస్‌మెంట్ ఫీ

7. కార్డు రీప్లేస్‌మెంట్ ఫీ

కంపెనీల్లో ఐడీ కార్డులు పోగొట్టుకుంటేనే కొత్త కార్డు ఇవ్వ‌డానికి కంపెనీలు జీతంలో కోత వేస్తాయి. అలాంటిది క్రెడిట్ కార్డు పోగొట్టుకుపోతే చాలా క‌ష్టం. కార్డు పోగొట్టుకుని మ‌ళ్లీ కార్డు కోసం అభ్య‌ర్థించేందుకు కార్డు రీప్లేస్‌మెంట్ ఫీ క‌ట్టాలి. ఒక‌వేళ కార్డు పాడైపోయి సరిగా ప‌నిచేయ‌క‌పోతే కొత్త కార్డు తీసుకునేందుకు సైతం డ‌బ్బు చెల్లించాలి. ఇందుకోసం రూ.250 నుంచి రూ.300 వ‌రకూ రుసుము ఉంటుంది.

8. చెక్కు బౌన్స్ లేదా ఈసీఎస్ డెబిట్ ఫెయిల్ అవ్వ‌డం

8. చెక్కు బౌన్స్ లేదా ఈసీఎస్ డెబిట్ ఫెయిల్ అవ్వ‌డం

ఒక‌వేళ క్రెడిట్‌కార్డు బ‌కాయిల చెల్లింపున‌కు జారీ చేసిన చెక్కు బౌన్స‌యినా లేదా డిస్‌హాన‌ర్ అయినా.. అద‌నంగా చార్జీల బాదుడు ఉంటుంది. మీ బ్యాంకు కార్డు తీసుకునే స‌మ‌యంలోనే వీటిని వివ‌రించి ఉంటుంది. ఒక నిర్ణీత రుసుము లేదా రూ.300 నుంచి రూ.350 వ‌ర‌కూ ఈ పెనాల్టీ ఉండొచ్చు. బ్యాంకు చెక్కు లేదా న‌గ‌దు రూపంలో మీ ద‌గ్గ‌ర నుంచి సేక‌రించేందుకు ఒక వ్య‌క్తిని పంపితే వ‌చ్చే నెల స్టేట్‌మెంట్లో అద‌నంగా రూ.100 క‌ట్టాలి.

9. స‌ర్‌చార్జీలు

9. స‌ర్‌చార్జీలు

బ్యాంకుల‌న్నింటికీ మామూలుగా పెట్రోలు కొనుగోలు స‌మ‌యంలో అద‌నంగా లావాదేవీ చార్జీ ప‌డుతుంది. ఇది 2.5% లేదా రూ.10 నుంచి రూ.25 వ‌ర‌కూ ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా బ్యాంకులు ఒక ప‌రిమితిని దాటి ఇంధ‌నం కొనుగోలు చేస్తే ఈ స‌ర్‌చార్జీలు ఎత్తేస్తున్నాయి. రూ.399 నుంచి రూ.4000 వ‌రకూ ఉండే దానికి చాలా బ్యాంకులు స‌ర్‌చార్జీలు తీసుకోవు.

10. సేవా ప‌న్ను

10. సేవా ప‌న్ను

నువ్వు బిల్లు చెల్లించేట‌ప్పుడు క్రెడిట్ కార్డు ఉప‌యోగించుకున్నందుకు ఒక‌సారి, మ‌ళ్లీ క్రెడిట్ కార్డు అప్పు తీర్చేట‌ప్పుడు మ‌రోసారి రెండు సార్లు సేవా ప‌న్ను రూపంలో చేతి చ‌మురు వ‌దిలించుకోవాలి. కానీ జీఎస్టీ వ‌చ్చిన త‌ర్వాత 18% జీఎస్టీ ఒక్క‌సారి విధిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు క్రెడిట్ కార్డు బిల్లును ఆల‌స్యంగా చెల్లిస్తే దానికి సంబంధించి 18% జీఎస్టీ ప‌డుతుంది. ఇంకా రుణ ప్రాసెసింగ్ రుసుము, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు చార్జీలు, బీమా ప్రీమియంల‌కు సైతం 18% జీఎస్టీ విధించ‌డం బాధాక‌రం.

Read more about: credit card, charges, fee
English summary

different charges related to credit cards as we doesn't know

The lure of a credit card is hard to keep away from, especially when a sales representative from a bank or a retail outlet makes a convincing pitch about you getting a ‘free’ credit card. But did you know that the credit card you are being promised is anything but free?
Story first published: Saturday, July 29, 2017, 15:09 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC