For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ ఆధార్ అనుసంధానం మాన్యువ‌ల్‌గా ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆఫ్ లైన్ విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకే పేజీలో కొన్ని వివ‌రాల‌ను నింపి దాన్ని పోస్ట్‌లో పంప‌డం ద్వారా ఆధార్‌-పాన్ అనుసంధానాన్ని పూర్తిచేయ‌వ‌చ్చు. ఇప్పుడున్న ఆన్‌

|

జులై 1 నుంచి ఆధార్ సంఖ్య‌ను పాన్‌తో అనుసంధానించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. ఇందుకోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌, యూఐడీఏఐ క‌లిసి ప‌నిచేస్తున్నాయి. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్లో దీని కోసం ప్ర‌త్యేక లింక్ ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆన్‌లైన్ విధానంలో అంద‌రూ చేయ‌లేక‌పోతున్నారు. దీన్ని గుర్తించిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆఫ్ లైన్ విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకే పేజీలో కొన్ని వివ‌రాల‌ను నింపి దాన్ని పోస్ట్‌లో పంప‌డం ద్వారా ఆధార్‌-పాన్ అనుసంధానాన్ని పూర్తిచేయ‌వ‌చ్చు. ఇప్పుడున్న ఆన్‌లైన్‌, ఎస్ఎంఎస్ విధానానికి అద‌నంగా దీన్ని ప్రారంభించారు. ఆఫ్‌లైన్‌లో మాన్యువ‌ల్‌గా ఎలా చేయాలో తెలుసుకుందాం.

 పాన్‌-ఆధార్ అనుసంధానం

ఈ పేజీలో వివరాల‌ను అక్ష‌రాలు ఏ కార్డులో ఎలా ఉన్నాయో అలానే నింపాలి. అంతే కాకుండా ఇదివ‌ర‌కే ఏ పాన్ కార్డుతోనూ ఆధార్‌ను లింక్ చేయ‌లేద‌నే స్వ‌యం ధ్రువీక‌ర‌ణ‌ను ఇవ్వాలి. ఆఫ్లైన్ విధానం ద్వారా లింక్ చేయ‌డం సులువైన‌ప్ప‌టికీ స‌మ‌యం ప‌డుతుంది. ఇది కాకుండా పేర్ల‌లో వివ‌రాలు స‌రిపోలేవారు ఎస్ఎంఎస్ స‌దుపాయాన్ని సైతం ఉప‌యోగించ‌వ‌చ్చు.
"UIDPAN space 12 digit Aadhaar Space 10 digit PAN" 'యూఐడీపాన్‌ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి 12 అంకెల ఆధార్‌ సంఖ్యను టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి 10 అంకెల పాన్‌ నంబరును టైప్‌ చేసి 567678 లేదా 56161కు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డుల‌లో పేరు ఒకేలా ఉన్న‌వారు మాత్ర‌మే ఈ సదుపాయాన్ని ఉప‌యోగించుకోగ‌ల‌రని ఐటీ శాఖ చెప్పింది.

Read more about: pan aadhaar aadhar taxes tax income tax
English summary

పాన్ ఆధార్ అనుసంధానం మాన్యువ‌ల్‌గా ఎలా? | how to link aadhar card with pan manually

he Income Tax Department has introduced a one-page form for taxpayers to manually apply for linking their Aadhaar with Permanent Account Number (PAN), apart from the available online and SMS facilities.
Story first published: Tuesday, July 4, 2017, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X