నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల లబ్దిదారులు లేదా ఖాతాదారులు సైతం ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించి ముఖ్యమైన గడువులను తెలుసుకు
ప్రస్తుతం కొన్ని సంక్షేమ పథకాలకు, మరికొన్ని కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించే విధంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ రిటర్నులు, పాన్ కార్డులు, సిమ్ కార్డులు వంటి వాటి విషయంలో కేంద్రం దూకుడుగా ముందుకెళుతోంది. అదే విధంగా నకిలీ బ్యాంకు ఖాతాల ఏరివేతకు, నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల లబ్దిదారులు లేదా ఖాతాదారులు సైతం ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించి ముఖ్యమైన గడువులను తెలుసుకుందాం.

ఆధార్ సంఖ్యతో పాన్‌కార్డు లింకింగ్
పన్ను ఎగవేతదార్లను అడ్డుకునేందుకు, నల్లధనాన్ని నివారించేందుకు కేంద్ర సంస్థ సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులందరూ, అదే విధంగా పాన్ కార్డు కలిగిన వారంతా డిసెంబరు 31,2017 లోపు పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే తర్వాత కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకునే వారు దరఖాస్తు సమయంలో ఐటీ శాఖకు ఆధార్ నంబరు ఇవ్వడం తప్పనిసరి.

సిమ్ కార్డులకు ఆధార్
మొబైల్ సిమ్ కలిగిన వారంతా వారి వారి మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించడాన్ని టెలికాం శాఖ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం జనవరి 31,2018 లోపు సిమ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించాలి.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆధార్ ఇచ్చే గడువు
డిసెంబరు 31,2017 లోపు బ్యాంకులు, పెట్టుబడులకు సంబంధించిన ఇతర ఆర్థిక సంస్థల్లో పౌరులు, ఖాతాదారులు అందరూ తమ ఆధార్ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. గడువు లోగా బ్యాంకు ఖాతాల్లో ఆధార్ నంబరు అప్‌డేట్ కాని వారి ఖాతాలను బ్యాంకులు స్తంభింప చేసే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాలను ఆధార్‌తో అనుసంధానించాలి
కేంద్రం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాల లబ్ది పొందాలంటే కూడా ఆధార్ ఇవ్వాల్సిందే. పింఛను, ఎల్‌పీజీ సిలిండర్లు, ప్రభుత్వ ఉపకార వేతనాలు వంటి వాటికి సంబంధించి ఆధార్ సంఖ్యను డిసెంబరు 31,2017 లోపు అనుసంధానించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరో వైపు డ్రైవింగ్ లైసెన్సుకు సైతం ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసే పనిలో కేంద్రం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications