FDపై ఆకర్షణీయ వడ్డీ రేటు, ఈ బ్యాంకులు 6.50 శాతం వడ్డీ రేటు
చిన్న ప్రయివేటురంగ బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పైన వడ్డీ రేట్లను తగ్గించాయి. వివిధ బ్యాంకులు 25 పాయింట్ల నుండి 50 పాయింట్ల మేర తగ్గించాయి. ఉదాహరణకు డీసీబీ బ్యాంకు, యస్ బ్యాంకులు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75 శాతం నుండి 6.50 శాతానికి తగ్గించింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటును 6.5 శాతానికి 6 శాతానికి తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్లపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ పలు బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

డీసీబీ బ్యాంకు వడ్డీ రేటు 6.50 శాతం, యస్ బ్యాంకు వడ్డీ రేటు 6.50 శాతం, ఆర్బీఎల్ బ్యాంకు వడ్డీ రేటు 6.50 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటు 6.00 శాతం, కరూర్ వైశ్య బ్యాంకు వడ్డీ రేటు 6.00 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంకు 5.55 శాతం, కెనరా బ్యాంకు 5.00 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5.40 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.30 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 5.30 శాతంగా ఉంది.