For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI 3 in 1 Account: అకౌంట్ ఫీచర్స్, వివరాలు మరిన్ని...

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సరికొత్త ఎస్బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్‌ను లాంచ్ చేసింది. కస్టమర్ల సౌకర్యార్థం నిరంతరం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు జీరో బ్యాలెన్స్, జన్ ధన్, సేవింగ్స్, కరెంట్ ఇలా పలు రకాల ఖాతాలు అందిస్తుండగా, తాజాగా మరో సౌకర్యాన్ని జత చేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. ఎస్బీఐ ఎప్పటికి అప్పుడు తమ కస్టమర్ల కోసం వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. కొత్త టెక్నాలజీని కూడా ప్రయివేటురంగానికి దీటుగా అప్ డేట్ చేసుకుంటోంది.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ కోసం..

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ కోసం..

కరోనా తర్వాత స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెడుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప‌లువురు డీమాట్, ట్రేడింగ్ ఖాతాల‌ను ఓపెన్ చేయడానికి ప్రయివేటు బ్యాంకుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల కోసం ఎస్బీఐ త్రీ-ఇన్ వ‌న్ ఖాతాను ప్రారంభిస్తోంది. ఇందులో సేవింగ్స్, డీమాట్, ట్రేడింగ ఖాతాలు ఉంటాయి. త్రీ-ఇన్ వన్ ఖాతాదారులు 25 శాతం మార్జిన్‌తో ట్రేడింగ్ నిర్వహించవచ్చు. దీనిని ఈ-మార్జిన్ సౌకర్యంగా వ్యవహరిస్తారు. మార్జిన్ స్టాక్స్ రూపంలో లేదా క్యాష్ రూపంలో ఉంటుంది.

ఖాతా కోసం ఇవి అవసరం

ఖాతా కోసం ఇవి అవసరం

అకౌంట్ హోల్డర్స్ సౌకర్యం కోసం ఎస్బీఐ నిరంతరం కొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఎస్బీఐ త్రీ-ఇన్ వన్ ఫీచర్ సేవింగ్స్ ఖాతా కోసం పాన్ కార్డు లేదా ఫామ్ 60, ఫోటోలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ కార్డుల్లో ఒకటి సమర్పించాలి. డీమ్యాట్ ట్రేడింగ్ ఖాతా కోసం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, చెక్ లేదా తాజా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను సమర్పించాలి.

డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కోసం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాన్సిల్ చేసిన చెక్ లేదా తాజా బ్యాంకు స్టేట్‌మెంట్లు

లాగ్-ఇన్ ఇలా..

లాగ్-ఇన్ ఇలా..

అకౌంట్ హోల్డర్స్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వెబ్ సైట్‌కు వెళ్లి ట్రేడింగ్ అకౌంట్‌లోకి లాగ్-ఇన్ కావాలి. ఆర్డర్ ప్లేస్‌మెంట్ మెనులోకి వెళ్లాలి. ప్రొడక్ట్ టైప్‌ని ఈ-మార్జిన్‌గా ఎంపిక చేసుకొని, ఆర్డర్ ప్లేస్ చేయాలి.3 ఇన్ 1 ఫీచర్స్.. ఎస్బీఐ త్రీన్ ఇన్ వన్ అఖౌంట్ హోల్డర్స్ 25 శాతం మార్జిన్స్‌తో ట్రేడింగ్ నిర్వహించవచ్చు. మార్జిన్స్ స్టాక్స్ లేదా నగదు రూపంలో ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ముప్పై రోజుల వరకు పొజిషన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు. ట్రేడింగ్ స్టాక్స్‌ను డెలివరీగా మార్చుకోవచ్చు. ఎక్స్‌‍పైరీ లోపు స్క్వేర్ అప్ చేయవచ్చు. వీటితో పాటు సేవింగ్స్ ఖాతా ద్వారా అందే ప్రయోజనాలు వర్తిస్తాయి.

English summary

SBI 3 in 1 Account: అకౌంట్ ఫీచర్స్, వివరాలు మరిన్ని... | SBI 3 in 1 Account Facility: Key Features, Details, How to Open SBI Account

The State Bank of India has launched a 3-in-1 account facility for bank customers. As per the updates from the SBI, the facility includes a savings bank account, a Demat account, and an online trading account to provide the customers with a simple and paperless trading experience.
Story first published: Sunday, December 19, 2021, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X