For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమిషానికి 76 రీఫండ్స్: మీకు ఐటీ రీఫండ్స్ రాలేదా.. దానికి త్వరగా సమాధానం ఇవ్వండి!

|

ఆదాయపు పన్ను విభాగం (ఐటీ శాఖ) ఏప్రిల్ 8వ తేదీ నుండి జూన్ 30వ తేదీ మధ్య 20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.62,361 కోట్లను రీఫండ్ చేసింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్ వ్యాల్యూ రూ.23,453.57 కోట్లు కాగా, కార్పోరేట్ పన్ను రీఫండ్స్ రూ.38,908.37 కోట్లుగా ఉంది. ఐటీ రీఫండ్స్ పొందినవాళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 19.07 లక్షలు కాగా, కార్పోరేట్ పన్ను చెల్లింపుదారులు 1.36 లక్షలమంది. ఈ మేరకు సీబీడీటీ ఓ ప్రకటన చేసింది.

EPF డబ్బు తీసుకుంటున్నారా?: ట్యాక్స్ మినహాయింపుకు ఇలా చేయండి!EPF డబ్బు తీసుకుంటున్నారా?: ట్యాక్స్ మినహాయింపుకు ఇలా చేయండి!

నిమిషానికి 76 కేసులు

నిమిషానికి 76 కేసులు

ఐటీ డిపార్టుమెంట్ ఏప్రిల్ 8వ తేదీ నుండి జూన్ 30వ తేదీ మధ్య ఈ మొత్తాన్ని రీఫండ్ చేసింది. ఐటీ శాఖ నిమిషానికి 76 రీఫండ్స్ కేసులను పరిష్కరించినట్లు తెలిపింది. ప్రతి నిమిషం ఈ వేగంతో ఐటీ శాఖ పని చేసి మొత్తం 20.44 కోట్ల రీఫండ్స్‌ను పరిష్కరించినట్లు పేర్కొంది. 56 రోజుల్లో భారీ స్థాయిలో రీఫండ్స్ చేసినట్లు తెలిపింది.

వారు ఎంత తొందరగా సమాధానం ఇస్తే.. సూచన

వారు ఎంత తొందరగా సమాధానం ఇస్తే.. సూచన

కొన్ని కేసుల్లో వివరాలు అడుగుతూ ఐటీ శాఖ.. ఈ మెయిల్ సందేశాలు పంపిందని, వారు దానికి ఎంత తొందరగా సమాధానం ఇస్తే అంత త్వరగా రీఫండ్ ప్రాసెస్ చేస్తామని తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో ఈ రిఫండ్ జమ చేస్తున్నామని, ఈ రిఫండ్ గురించి ఎవరు డిపార్టుమెంటును సంప్రదించాల్సిన అవసరం లేదని, తెలిపింది. రిఫండ్ కోసం సంబంధించి ఆదాయపన్ను శాఖ పంపిన ఈ మెయిల్స్‌కు వెంటనే స్పందించాలని ట్యాక్స్ పేయర్స్‌కు సూచించింది.

ఈ వివరాలు అడుగుతున్నారు.. ఇవ్వండి

ఈ వివరాలు అడుగుతున్నారు.. ఇవ్వండి

రీఫండ్ ఎంత రావాలి, బ్యాంకు ఖాతా వివరాలు ఏమిటి వంటి విషయాలపై స్పష్టత కోసం పన్ను చెల్లింపుదారుల విభాగం ఈ మెయిల్స్ పంపించిందని తెలిపింది. వెంటనే బుదిలిస్తే రీఫండ్ జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని వెల్లడించింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా వ్యక్తులు, వ్యాపార సంస్థలకు తక్షణ ఉపశమనాన్ని అందించే ఉద్దేశ్యంతో రూ.5 లక్షల వరకు పెండింగులో ఉన్న రీఫండ్స్ సతర్వర జారీకి ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది.

English summary

నిమిషానికి 76 రీఫండ్స్: మీకు ఐటీ రీఫండ్స్ రాలేదా.. దానికి త్వరగా సమాధానం ఇవ్వండి! | Rs 62,361 crore IT refunds issued to over 2 million subscribers

The Income Tax (IT) department has issued tax refunds worth over Rs 62,361 crore at a speed of 76 cases per minute between April 8 and June 30 this year to over 2 million taxpayers, the finance ministry said on Friday.
Story first published: Saturday, July 4, 2020, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X