For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PAN card alert: ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు పాన్‌కార్డు తప్పనిసరి

|

పాన్-ఆధార్ కార్డు లింక్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా సహా వివిధ కారణాల వల్ల పాన్-ఆధార్ లింక్ తేదీని పలుమార్లు పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్ ద్వారా పారదర్శకత, రిస్క్‌లేకుండా ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ ద్వారా ప్రభుత్వం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ను ఈజీగా ట్రాక్ చేయగలదు.

అలాగే, ఫ్రాడ్, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకోగలదు. ఇప్పటికే పాన్ - ఆధార్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పాన్ -ఆధార్ కార్డును లింక్ చేయాలని ఇటీవల ఎస్బీఐ కూడా తన కస్టమర్లకు సూచించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు దీనిని పూర్తి చేయాలని కోరింది. గడువులోగా లింకింగ్ పూర్తి చేయకుంటే బ్యాంకు సేవల్లో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఎస్బీఐ హెచ్చరిక

ఎస్బీఐ హెచ్చరిక

పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని మేం మా కస్టమర్లకు సూచిస్తున్నాము. బ్యాంకింగ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కోకూడదంటే లింకింగ్ తప్పనిసరి అని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పాన్-ఆధార్‌ను లింక్ చేయకుంటే పాన్ ఇన్-ఆపరేటివ్‌గా మారిపోతుందని హెచ్చరించింది. పాన్ ఆధార్ లింక్ గడువు మార్చి 31, 2021 వరకు ఉండగా, గడువును జూలై 30 వరకు, ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.

ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్‌కు తప్పనిసరి

ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్‌కు తప్పనిసరి

దేశంలోని పలు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్‌కు పాన్ తప్పనిసరి. పాన్ అంటే పది అంకెల ఏకీకృత అల్పా న్యూమరిక్ నెంబర్. దీనిని ఐటీ శాఖ జారీ చేస్తుంది. ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ను ఐటీ శాఖ తెలుసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగిస్తుంది. పన్ను చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్స్ తదితర చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్, ఉత్తర, ప్రత్యుత్తరాలకు పాన్ అవసరం. పన్ను చెల్లింపుదారల వివిధ రకాల పెట్టుబడులు, అప్పులు, ఇతర బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సమాచారం సులభంగా తెలుసుకోవడానికి పాన్ ఉపయోగపడుతుంది. పన్ను ఎగవేత, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ విషయం కూడా వెల్లడవుతుంది.

ఇలాంటి సందర్భాల్లో..

ఇలాంటి సందర్భాల్లో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాన్సులేట్ కార్యాలయాలు మినహా ప్రతి ఒక్కరు పాన్ నెంబర్ పేర్కొనాన్ని ఐటీ చట్టంలోని 114 బీ నిబంధన తప్పనిసరి చేస్తుంది. వివిధ సందర్భాల్లో పాన్ తప్పనిసరి...

- ద్విచక్ర వాహనం మినహా మోటార్ వెహికిల్ లేదా వాహన క్రయ విక్రయాలు.

- బ్యాంకు లేదా కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్.

- క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి.

- డీమ్యాట్ ఖాతా తెరవడానికి.

- రెస్టారెంట్ లేదా హోటల్లో ఒకసారికి రూ.50వేల బిల్లు దాటితే.

- ఒకసారి విదేశీ ప్రయాణానికి, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు రూ.50వేల ఖర్చు దాటినప్పుడు.

- మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు రూ.50వేలు దాటితే.

- డిబెంచర్స్ లేదా బాండ్స్ కొనుగోలుకు రూ.50వేలు ఖర్చు చేస్తే.

- రూ.50వేల పై చిలుకుతో ఆర్బీఐ బాండ్స్ కొనుగోలు చేస్తే.

- కోఆపరేటివ్ బ్యాంకులో ఒకరోజు రూ.50వేలు దాటిన డిపాజిట్స్.

- 2016 నవంబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు రూ.2.50 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే.

- రూ.50వేల పైచిలుకు బ్యాంకు డ్రాఫ్ట్స్, పేఆర్డర్స్ కొనుగోలు లేదా బ్యాంకు చెక్స్ జారీ చేస్తే.

- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల కంటే ఎక్కువ బీమా ప్రీమియం చెల్లింపు.

- రూ.10 లక్షలు దాటిన స్థిరాస్తుల విక్రయం లేదా కొనుగోలుపై.

- వస్తు, సేవల క్రయ, విక్రయాల ద్వారా రూ.2 లక్షల పై చిలుకు ఖర్చు చేస్తే.

English summary

PAN card alert: ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు పాన్‌కార్డు తప్పనిసరి | PAN is mandatory for these financial transactions

The SBI has urged its customers to seed PAN card with Aadhaar. The Bank has informed its account holders to link their PAN-Aadhaar card by September 30.
Story first published: Monday, August 2, 2021, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X