For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీఆర్ నుండి బంగారం కొనుగోలు వరకు.. పాన్‌కార్డు ఎలాంటి సందర్భాల్లో అవసరం?

|

ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు వలె పాన్ కార్డు కూడా ముఖ్యమైన పత్రాలలో ఒకటి. పాన్ కార్డు ఇప్పుడు చాలామందికి ఉంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ తప్పనిసరి. పన్ను చెల్లింపుదారులకు లేదా ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పది అంకెల సంఖ్యను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దేశంలో పన్ను చెల్లించాల్సిన వారంతా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్లు, విదేశీయులకు పాన్ అవసరమే. పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్స్, ఆదాయం, ట్రాన్సాక్షన్స్ వంటివి పాన్ ద్వారా ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందేందుకు, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇలాంటి పాన్ కార్డు ఏఏ సందర్భాల్లో అవసరమంటే...

వోటర్ కార్డు, ఆధార్ కార్డు వలె పాన్ కార్డు కూడా గుర్తింపు కార్డులా పని చేస్తుంది. వివిధ ఆర్థిక ట్రాన్సాక్షన్స్ కోసం పాన్ కార్డు అవసరం.

From ITR to loan: When is a PAN Card Used?

ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు లేదా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి.

బిజినెస్ లేదా శాలరైడ్ ఉద్యోగం ఏడాదికి రూ.5 లక్షలు దాటితే పాన్ కార్డు అవసరం.

కారు అమ్మడం లేదా కొనుగోలు చేసే సమయంలో పాన్ కార్డు ఉండాలి.

బ్యాంకు ఖాతా లేదా డీమ్యాట్ ఖాతాను తెరిచే సమయంలో కూడా పాన్ అవసరం.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే పాన్ సమర్పించాలి.

హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ.50,000 దాటితే పాన్ కార్డును చెప్పవలసి ఉంటుంది.

విదేశీ కరెన్సీ లేదా మ్యూచువల్స్ కొనుగోలు సమయంలో పాన్ అవసరం.

ప్రాపర్టీని కొనుగోలు చేసే సమయంలో లేదా విక్రయించే సమయంలో పాన్ కార్డు అవసరం.

రుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో పాన్ కార్డు అవసరం ఏర్పడుతుంది.

రూ.50,000కు మించి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంకు FD వడ్డీ మొత్తం పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది.

టెలిఫోన్ కనెక్షన్ కోసం పాన్ అవసరం.

నిర్ణీత జ్యువెల్లరీ కొనుగోలుకు పాన్ తప్పనిసరి.

English summary

ఐటీఆర్ నుండి బంగారం కొనుగోలు వరకు.. పాన్‌కార్డు ఎలాంటి సందర్భాల్లో అవసరం? | From ITR to loan: When is a PAN Card Used?

You can use a PAN card as proof of identity apart from an AADHAR card, voter ID card. PAN cards are accepted for several different kinds of financial transactions.
Story first published: Sunday, January 16, 2022, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X