For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి, లేకపోతే ఇబ్బందే

|

డిసెంబర్ 31... మరో రెండు రోజులే మిగిలి వుంది. చాలా మంది కొత్త సంవత్సరం వస్తోంది.. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మూడు రోజుల్లో మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికీ వీటిని పూర్తి చేసి ఉంటే మీకు ఇబ్బంది లేదు. ఒకవేళ చేయకపోయి ఉంటే మీకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వాటిని పూర్తిచేయండి లేకపోతే మీకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఉద్యోగం చేస్తూ ఆదాయం పొందుతున్నవారు, ఉద్యోగం చేయకున్నా ఇతర వ్యాపారాలు చేస్తున్న వారు, సాధారణ వ్యక్తులు కూడా వీటిని చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే...

ఏటీఎం కార్డు మార్పిడి

ఏటీఎం కార్డు మార్పిడి

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయి ఉండి మీరు ఇంకా పాత డెబిట్ లేదా ఏటీఎం కార్డును ఉపయోగిస్తుంటే దాన్ని వెంటనే మార్చుకోండి. బ్యాంకుకు వెళితే మీకు కొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డును ఇస్తారు. ఇందులో భద్రత ఫీచర్లను పెంచారు. ఒకవేళ మీరు కార్డు మార్చుకోకుంటే అది ఈ నెల 31 తర్వాత పని చేయదు. కాబట్టి మీకు ఇబ్బందులు ఎదురు కావచ్చు. అందుకే ముందు ఈ పని పూర్తి చేసుకోండి.

ATM నుంచి డబ్బు తీస్తున్నారా? జనవరి 1 నుంచి SBI కొత్త సేవలుATM నుంచి డబ్బు తీస్తున్నారా? జనవరి 1 నుంచి SBI కొత్త సేవలు

పాన్, ఆధార్ అనుసంధానం

పాన్, ఆధార్ అనుసంధానం

పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) తో ఆధార్ ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31. ఆదాయ పన్ను శాఖా వెబ్ సైట్ కు వెళితే ఎడమవైపు పాన్- ఆధార్ లింక్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ పై ఉన్న పేరు ను ఎంటర్ చేసి లింక్ ఆధార్ అని ఉన్న బటన్ ను ప్రెస్ చేస్తే చాలు. వెంటనే లింక్ అయిపోతుంది. 31 లోపు ఆధార్ ను అనుసందానం చేయకపోతే మీ పాన్ నెంబర్ డీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్ ఆధార్ అనుసంధాన గడువును పొడిగిస్తూ వచ్చారు. ఇంకా పొడిగిస్తారని వేచి చూస్తే ఇబ్బంది తప్పకపోవచ్చు.

పాన్-ఆధార్ లింక్‌కు 3 రోజులే గడువు: లింక్ చేయకుంటే ఏమౌతుంది.. సమస్యలెన్నో?పాన్-ఆధార్ లింక్‌కు 3 రోజులే గడువు: లింక్ చేయకుంటే ఏమౌతుంది.. సమస్యలెన్నో?

ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్

ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్

ఇప్పటికే మీరు మీకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)ను ఫైల్ చేయకపోయి ఉంటే మీరు డిసెంబర్ 31 వరకు దీన్ని ఫైల్ చేయవచ్చు. ఆ తర్వాత ఫైల్ చేస్తాను అని ఉరుకుంటే మీకు భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 31 కన్నా ముందు మీరు మీ ఐటీఆర్ ను ఫైల్ చేస్తే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ తేదీ దాటి మార్చి లోపు ఫైల్ చేస్తే జరిమానా 10,000కు పెరుగుతుంది. ఆదాయపన్ను రిటర్న్ లు సమర్పించే వారు తప్పనిసరిగా ఆధార్, పాన్ ను అనుసంధానించి ఉండాలి.

ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్

ఈ వివరాలు మీకు తెలుసా...

ఈ వివరాలు మీకు తెలుసా...

* ఆదాయ పన్ను శాఖా ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లో ఇప్పటిదాకా 8,54,08,564 మంది వ్యక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.

* రిజిస్టర్ అయి ఆధార్ ను అనుసందానం చేసిన వారు 6,87,83,710 మంది.

* రిజిస్టర్ కాకుండా ఆధార్ ను అనుసంధానం చేసిన వారు 2,89,36,709 మంది.

* 2019-20 సంవత్సరానికి తమ ఐటీఆర్ లను ఈ-వెరిఫై చేసిన వారు 3,58,75,185 మంది.

English summary

డిసెంబర్ 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి, లేకపోతే ఇబ్బందే | December 31 deadline: you must do these things

New year just three days away. Many people preparing to celebrate. But you have three days to complete there important things. If you forget you may face some difficult situations.
Story first published: Monday, December 30, 2019, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X