For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోన్ తీసుకున్నారా.. వచ్చే ప్రభుత్వం బంపరాఫర్!: రూ.60వేల రుణమాఫీ, కండిషన్స్ ఇవే

|

వ్యక్తిగత లోన్ తీసుకొని, దానిని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారా? మీరు తీసుకున్న లోన్ మొత్తం రూ.60,000 ఉందా? అయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదేమో! ఎందుకంటే, రూ.60,000 వరకు ఇండివిడ్యుయల్ రుణమాఫీ పథకం వచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు రైతులకు రుణమాఫీ పథకాలు తెచ్చిన విషయం తెలిసిందే. రైతులతో పాటు భిన్న వర్గాలకు రుణభారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్నాయి.

ఇలాగే ఇండివిడ్యుయల్స్‌కు రుణ బాధ నుంచి విముక్తి కల్పించే పథకానికి తుదిరూపు ఇస్తున్నారట. రూ.60వేల లేపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందిపడే వ్యక్తులు, రుణమాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించనుందట. అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ కొత్త రుణమాఫీ పథకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఇన్‌సాల్వెన్సీ లా కమిటీ (ఐఎల్‌సీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందట. ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. రానున్న కొత్త ప్రభుత్వానికి ఇది సిఫార్స్ చేయనుందని తెలుస్తోంది.

రాబోయే ప్రభుత్వానికి ప్రతిపాదనలు

రాబోయే ప్రభుత్వానికి ప్రతిపాదనలు

లోకసభ ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి ఐఎల్‌సీ తన ప్రతిపాదనలను సమర్పించనుంది. ప్రస్తుతం కార్పోరేట్ కంపెనీలకే దివాళా చట్టం వర్తిస్తుండటంతో మలిదశలో ఈ ప్రక్రియను భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులకు వర్తింప చేయనున్నారు. కార్పోరేట్ దిగ్గజాలకు ఇచ్చిన రుణాలను హెయిర్ కట్ పేరుతో లక్షల కోట్లకు కుదిస్తున్న క్రమంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడే వ్యక్తులకూ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. ఇండివిడ్యుయల్స్‌కు గరిష్టంగా రూ.60,000 వరకు రుణమాఫీ వర్తింప చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన రుణం రూ.60వేలకు మించినా, వార్షికాదాయం మెరుగ్గా ఉన్నా అలాంటి వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే ఇది తిరస్కరించబడుతుంది. రుణం తీసుకొని, దానిని చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఈ రిలీఫ్ స్కీం ఊరట కలిగించనుంది.

ఇది న్యాయ్ స్కీం వంటిదే!

ఇది న్యాయ్ స్కీం వంటిదే!

కార్పోరేట్ కంపెనీలకు ఇస్తున్న ఊరట సామాన్యులకు కూడా ఇవ్వాలని, ఇందులో భాగంగానే ఈ ప్రతిపాదన అని, ఇది కూడా న్యాయ్ స్కీం వంటిది అని అధికారులు చెబుతున్నారు. ఈ రుణమాఫీకి మాగ్జిమం లిమిట్ రూ.60 వేలు అని, ఎవరి ఆదాయమైన ఏడాదికి మంచి ఆధాయం ఉంటే వారి అప్లికేషన్ తిరస్కరించబడుతుందని అధికారులు అంటున్నారు. వారు ఈ రిలీఫ్ స్కీంలోకి రాలేరని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్గనైజ్డ్ లోన్ మార్కెట్‌కే వర్తిస్తుందని, కానీ వడ్డీ వ్యాపారుల వంటి నాన్ ఫార్మల్ సోర్సెస్‌కు వర్తించదని చెబుతున్నారు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఈ రిలీఫ్ చట్టం ఆర్గనైజ్డ్ మార్కెట్‌కే వర్తిస్తుంది. వడ్డీ వ్యాపారుల వంటి వారికి వర్తించదు. ఈ పథకం కిందకు రైతులు, ఆర్టిసియన్స్, ఇల్లు కొనుగోలుదారులు తదితర ఇండివిడ్యువల్స్ ఈ పథకం కిందకు వస్తారు. చిన్న మొత్తంలో రుణాలు తీసుకొని చెల్లించలేక ఒత్తిడికి లోనయ్యే వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గ్రాడ్యుయేట్స్‌ను నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎవరైనా రుణమాఫీకి అనర్హులు అయితే కనుక అతడు లేదా ఆమె దివాళా తీర్మానం కోరుతూ పిటిషన్ వేయవచ్చు.

English summary

లోన్ తీసుకున్నారా.. వచ్చే ప్రభుత్వం బంపరాఫర్!: రూ.60వేల రుణమాఫీ, కండిషన్స్ ఇవే | Individuals may get Rs 60,000 debt waiver, like farmers

The government's Insolvency Law Committee (ILC), set up to review the implementation of Insolvency and Bankruptcy Code (IBC), is likely to propose a new debt relief scheme under the personal bankruptcy law framework for individuals in low-income category. The recommendations in this regard are likely to be presented to the new government after the parliamentary elections are over.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X