For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ పన్ను రిటర్నులు నింపే సమయంలో పొరపాట్లు చేసారా?

ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆదాయానికి మించి సంపాదిస్తున్న మొత్తం లో నుండి కొంత భాగం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉంది.

By bharath
|

ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆదాయానికి మించి సంపాదిస్తున్న మొత్తం లో నుండి కొంత భాగం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉంది.చాలామంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు దీనికి కారణం ఇంకా వాటిపై సరైన అవగాహన లేకపోవడం.2017 జులై 1 న జిఎస్టి అమల్లోకి వచ్చింది.ఐతే ఆర్థిక సంవత్సరం 2018 మార్చ్ 31 నాటికి చెల్లించాల్సిన పన్ను పై చాల మంది పన్నుచెల్లింపుదారులు అనేక పొరపాట్లు చేసారు.మొదట్లో దీనికి ఎదురయిన సాంకేతిక ఇబ్బందులు కూడా ఒక కారణమనే చెప్పవచ్చు.

ఆదాయ పన్ను రిటర్నులు నింపే సమయంలో పొరపాట్లు చేసారా?

పొరపాట్లు ఉదాహరణకు చెప్పాలంటే:

ఇన్వాయిస్ లకు తీసుకున్న క్రెడిటీకి పొంతన లేకపోవటం,చెల్లించిన పన్నుకు మరియు జిఎస్టీఆర్-1 లో చూపిన పన్నుకు తేడా ఉండటం,కొనుగోళ్ళకు సంబందించిన ఇన్వాయిస్ మీద క్రెడిట్ తీసుకోకపోటం మరియు జారీ చేసిన ఇన్వాయిస్ లకు జిఎస్టీఆర్-1 లో చూపిన ఇన్వాయిస్ లకు తేడా వంటి పొరపాట్లు తరచూ చాల మంది వ్యాపారస్తులు చేస్తూనే ఉంటారు.

వాస్తవానికి రిటర్నులు సంబంధించి ఆఖరి గడువు 2018 అక్టోబర్ 25 ముగియగా చాల మంది ఏ గడువుకు దాఖలు చేయడం విస్మరించారు కావున ప్రభుత్వం మరోసారి గడువును పొడిగిస్తూ నిర్మాణం తీసుకుంది.

కావున రిటర్నులు దాఖలు సమయంలో ఏవైనా పొరపాట్లు చేసిఉంటే వాటిని ఈ విదంగా సరిదిద్దుకోండి

వ్యాపారస్తులు ఎవరైతే ప్రతి నెల GSTR-1 ఫైల్ ను దాఖలు చేసే వారు 2019 మార్చు వరకు చేసే సమయం ఉంటుంది అలాగే త్రైమాసిక రిటర్న్ దాఖలు చేసే వారయితే 2019 జనవరి నుండి మర్చి లోపు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

గతంలో డిసెంబర్ నుంచి 2018 మార్చ్ వరకు అన్ని వ్యాపారాలకు GSTR-3B ప్రారంభ రిజిస్ట్రేషన్ దాఖలు చేసిన గడువును పొడిగించారు. అన్ని పన్ను చెల్లింపుదారులు మార్చి, 2018 వరకు వచ్చే నెల మార్చ్ 20 వ తేదీ నాటికి పన్ను చెల్లింపుతో GSTR-3B రూపంలో తిరిగి చెల్లించవచ్చు.

గుర్తించుకోవాల్సిన ముఖ్య అంశాలు:

మీరు దాఖలు చేసే సమయంలో మీ ఇన్వాయిస్ బిల్ సరిగా ఉందో లేదో సరిచూసుకోవాలి.పొరపాట్లు ఏమైనా కనిపించినట్లయితే తరువాత దాఖలు చేయబోయే రిటర్నుల్లో ఆ వివరాలను సవరించాలి.అందులో పొందుపరిచిన వివరాలు వారి జిఎస్టీఆర్-2 ఏ తో సరిపోయేట్టు చూడాలి.ఒకవేళ పొరపాట్లు జరిగినట్టు గమనిస్తే సరఫరాదారులను సంప్రదించి తగు వివరాలు క్షున్నంగా పరిశీలించి పొందుపరచాల్సి ఉంటుంది.

English summary

ఆదాయ పన్ను రిటర్నులు నింపే సమయంలో పొరపాట్లు చేసారా? | Made A Mistake While Filing Tax Returns? Here's How You Can Rectify It

While filing these returns, there is always the possibility of an unintentional or arithmetic error or an omission of details creeping into the return
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X