For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్కమ్ టాక్స్ సేవింగ్స్ ఎలా చేయాలో తెలుసా?ఐతే ఇది చూడండి?

పన్ను ప్రయోజనాలు పొందేందుకు సెక్షన్ 80సి కింద టాక్స్ సేవింగ్స్ పథకాలు చాలా ఉన్నాయి. సాధారణంగా మనం పన్ను ప్రయోజనాలు పొందేందుకు హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ బిల్లులను జత చేస్తూ ఉంటాం.

By bharath
|

పన్ను ప్రయోజనాలు పొందేందుకు సెక్షన్ 80సి కింద టాక్స్ సేవింగ్స్ పథకాలు చాలా ఉన్నాయి. సాధారణంగా మనం పన్ను ప్రయోజనాలు పొందేందుకు హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ బిల్లులను జత చేస్తూ ఉంటాం. ఇవి మాత్రమే కాకుండా మనకు తెలియనివి చాలా సెక్షన్ 80సి కిందకు వచ్చేవి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మీ తల్లిదండ్రులకు అద్దె మీరే చెల్లిస్తున్నట్లైతే అది పన్ను ప్రయోజనం పొందే వీలుంటుంది. మూలధన లాభాలకు వ్యతిరేకంగా మూలధన నష్టాలు వచ్చినట్లైతే వాటిని కూడా ఇక్కడే చూపించవచ్చు. మనదేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు, ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ లాంటి వాటికి పన్ను మినహాయింపు ఉంది.

తల్లిదండ్రుల ఇంటికి అద్దె చెల్లించడం:

తల్లిదండ్రుల ఇంటికి అద్దె చెల్లించడం:

మీరు గనుక మీ తండ్రి ఇంట్లో ఉంటున్నట్లైతే వారికి అద్దె చెల్లించడం మంచింది. తద్వారా మీరు హౌస్ అలవెన్సు కింద పన్ను ప్రయోజం పొందే వీలుంది. ఇలా చేయడం వల్ల మీ తల్లి దండ్రులకు కొంత సంపాదన వచ్చినట్లు మీకు పన్ను ప్రయోజనం ఉంటుంది.

మూలధన లాభాలకు వ్యతిరేకంగా మూలధన నష్టాలు:

మూలధన లాభాలకు వ్యతిరేకంగా మూలధన నష్టాలు:

తక్కువ కాలంలో మీకు మూలధన నష్టాలు వచ్చాయనుకోండి. అదే సంవత్సరంలో ఈ మూలధన నష్టాలను మీ రిటర్న్స్‌గా చూపించవచ్చు. లాభాలు వస్తే తర్వాతి సంవత్సరాల్లో మీరు వాటిని ఫైల్ చేయవచ్చు.

రాజకీయ పార్టీలకు విరాళాలు:

రాజకీయ పార్టీలకు విరాళాలు:

మన దేశంలో రాజకీయ పార్టీకి విరాళాలు ఇస్తే.. అది సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనం పొందే వీలుంది. మీరు సంపాందించే నికర మొత్తంలో 10 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు వీలుంది.

ఇంటి కోనుగోలుపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్:

ఇంటి కోనుగోలుపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్:

ఇన్‌కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఇంటి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు పన్ను ప్రయోజం ఉంది. చాలా మందికి దీని గురించి తెలిసి ఉండదు.

ఉమ్మడి యాజమాన్యం:

ఉమ్మడి యాజమాన్యం:

ఏదైనా కంపెనీకి ఉమ్మడి యాజమాన్యంగా పెట్టుబడులు పెట్టినట్లైతే వాటి నుంచి మీరు పన్ను ప్రయోజం పొందేందుకు అవకాశం ఉంది.

పన్ను ప్రయోజన చిట్కాలు:

పన్ను ప్రయోజన చిట్కాలు:

మీరు గనుక లోన్ తీసుకుని చదువుకున్నట్లేతే... బ్యాంకుకి మీరు కట్టిన వడ్డీపై కూడా పన్ను ప్రయోజం పొందవచ్చు. ఇన్ కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఎడ్యుకేషన్ కోసం కట్టిన వడ్డీ సెక్షన్ 80సి కిందకు వర్తిస్తుంది.

Read more about: tax income tax
English summary

ఇన్కమ్ టాక్స్ సేవింగ్స్ ఎలా చేయాలో తెలుసా?ఐతే ఇది చూడండి? | Best Ways To Save Income Tax Savings

There are a lot of tax savings schemes under Section 80C to get tax benefits. Usually we will add HRA and medical bills to get tax benefits.
Story first published: Thursday, November 8, 2018, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X