బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..
ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయంగా పరిస్థితుల ఆందోళనకరంగా మారాయి. ఈ యధ్ధం వారాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పెట్టుబడిదారులు యుద్ధ భయాలతో తమ ఆస్తులను కాపాడుకోవడానికి బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు.దీంతో భారీగా ధరలు పెరిగి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం ధరల పెరుగుదలపై SBI రీసెర్చ్ నివేదిక షాక్ ఇస్తోంది.
సెంట్రల్ బ్యాంకులు డాలర్ కాని నిల్వల్లో వైవిధ్యభరితంగా మారుతున్నందున.. బంగారం ధరలు మరింత పెరుగుతాయని SBI రీసెర్చ్ అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పునఃమూల్యాంకనం చేయడం ద్వారా జాతీయ రుణ భారం తక్కువగా ఉండేలా చేయవచ్చని నివేదిక తెలిపింది. 2025 ఆగస్టు చివరి నుండి అంతర్జాతీయ బంగారం ధరలు 47.6 శాతం పెరిగి మార్చి 6, 2026న ఔన్స్‌కు 5,092 డాలర్లకి చేరాయి, ఇది ఆగస్టు 29, 2025న 3,448 డాలర్లుగా ఉండేది. SBI ఆర్థికవేత్తలు తెలిపినట్లు.. కేంద్ర బ్యాంకులు ట్రెజరీల నుండి బంగారు నిల్వలకోసం మారడం 1996 తర్వాత మొదటిసారిగా జూన్ 2025లో జరిగింది.

సెంట్రల్ బ్యాంకుల మొత్తం నిల్వల్లో బంగారం శాతం అమెరికా, జర్మనీలో 80.4 శాతం, ఇటలీలో 79.4 శాతానికి చేరగా.. భారతదేశంలో దాదాపు 17.6 శాతంగా ఉంది. ఫెడరల్ ప్రభుత్వం వద్ద ఉన్న 261.5 మిలియన్ ట్రాయ్ ఔన్సుల బంగారు నిల్వలను ప్రస్తుత మార్కెట్ ధరలకు తిరిగి అంచనా వేయడం US GDPలో దాదాపు 4 శాతం పెరుగుదలను, బడ్జెట్ లోటులో 70 శాతం తగ్గింపును సృష్టించవచ్చని SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. ఇది US యొక్క 38.8 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుందన్నారు.
బంగారం నిల్వల పునఃమూల్యాంకనం కేంద్ర బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌లో నిల్వల విలువను నాటకీయంగా పెంచుతుంది. పెరిగిన విలువ ఆస్తిగా ప్రతిబింబించబడుతుంది. అప్పులను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను సరసమైన విలువలో నివేదించినప్పుడు.. వాల్యుయేషన్ మార్పుల వల్ల ఏర్పడిన లాభాలు లేదా నష్టాలు "పునఃమూల్యాంకన ఖాతాల్లో నమోదు చేసి, అవసరమైతే ఇతర విభాగాలకు బదిలీ చేయవచ్చు.
SBI రీసెర్చ్ ప్రకారం.. ఫెడ్ బంగారు నిల్వలను తిరిగి అంచనా వేయడం వల్ల ఆస్తులు పెరుగుతాయి. ఇది రుణాన్ని నేరుగా తగ్గించకపోయినా, ఆర్థిక సరళత, విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అమెరికాకు భారీ రుణ భారాన్ని నిర్వహించడంలో సులభతరం చేస్తుంది. అయితే పెరుగుతున్న ఆస్తులను సమతుల్యం చేయడానికి బాధ్యతలు పెరగడం ద్రవ్యోల్బణ ఒత్తిడిని కలిగించవచ్చు, దీని వల్ల GDPని బలహీనపరచే అవకాశం ఉంది.
క్తుప్లంగా చెప్పాలంటే కేంద్ర బ్యాంకుల డాలర్ కాని నిల్వల వైవిధ్యభరణం, Gold నిల్వల పునఃమూల్యాంకనం, ఫెడరల్ రీపోర్టింగ్ విధానాలు అంతర్జాతీయ బంగారు ధరలను మరింత పెంచుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావాన్ని చూపవచ్చు. ఈ పరిణామాలు పెట్టుబడిదారులు, ముడి సరుకు మార్కెట్లు, కేంద్ర బ్యాంకుల ఆర్థిక వ్యూహాలపై గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications