బెంగళూరు (Bengaluru) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు, అందమైన వాతావరణం.. వీటన్నిటితో పాటు విసిగించే ట్రాఫిక్ కూడా! గంటల తరబడి రోడ్ల మీద వేచి చూడటం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. లండన్, సింగపూర్ వంటి దేశాల్లో అమలులో ఉన్న 'కంజెషన్ ట్యాక్స్' (Congestion Tax) విధానాన్ని బెంగళూరులో కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అసలు కంజెషన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇదెలా ఉపయోపడుతుంది? ఇప్పుడు చూద్దాం.

కంజెషన్ ట్యాక్స్.. చాలామందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు. కానీ, లండన్, సింగపూర్ వంటి పలు నగరాల్లో ఇది ఎప్పట్నుంచో అమలులో ఉంది. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా పీక్ అవర్స్ (ఉదయం, సాయంత్రం ఆఫీస్ వేళలు) లో ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి ఈ పన్ను విధిస్తారు. అంటే మీరు మీ సొంత కారు లేదా బైక్ వేసుకుని అత్యధిక రద్దీ ఉన్న రోడ్లపైకి వెళ్తే, ప్రభుత్వం కొంత రుసుము వసూలు చేస్తుంది. దీనివల్ల ప్రజలు సొంత వాహనాల కంటే మెట్రో లేదా బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థను వాడతారని ప్రభుత్వ ఆలోచన.
బెంగళూరులో ఎక్కడ అమలు చేస్తారు?
కర్ణాటక ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో ముఖ్యంగా 'ఔటర్ రింగ్ రోడ్' (ORR) , రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రధాన రహదారులపై ఈ పన్ను వేయాలని సూచించింది. మన దగ్గర ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FastTag) టెక్నాలజీని ఉపయోగించి ఈ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) లో దాదాపు 1.2 కోట్ల వాహనాలు ఉన్నాయి. ప్రతిరోజూ మరో 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇంతటి భారీ రద్దీని తట్టుకోవడం ప్రస్తుత మౌలిక సదుపాయాలతో సాధ్యం కావడం లేదు.
దీనివల్ల లాభం ఏంటి?
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. రోడ్లపై ట్రాఫిక్ , కాలుష్యాన్ని తగ్గించడం. రెండోది.. ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ బెంగళూరు అభివృద్ధి పనులకే వాడటం. ముఖ్యంగా ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, కొత్త మెట్రో లైన్లు వేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. సింగపూర్ లో 1975లోనే ఇలాంటి ట్యాక్స్ ప్రవేశపెట్టగా కేవలం కొన్ని నెలల్లోనే అక్కడ ట్రాఫిక్ 20 శాతం తగ్గిందట.
ప్రజల నుంచి వినిపిస్తున్న అభ్యంతరాలు
అయితే ఈ ప్రతిపాదనపై బెంగళూరు వాసుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "రోడ్లు సరిగ్గా లేవు, ఫుట్‌పాత్ లు ఆక్రమణకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా రవాణాను పూర్తిగా అందుబాటులోకి తీసుకురాకుండా ఇలాంటి పన్నులు వేయడం శాస్త్రీయంగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించే రింగ్ రోడ్డుపై ఈ భారం పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తుందో లేదో వేచి చూడాలి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications