English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

దీర్ఘ‌కాలిక పొదుపు కోసం పీపీఎఫ్ ఖాతాను ఎలా ఉప‌యోగించుకోవాలి?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

సంఘ‌టిత రంగాల్లోని కార్మికుల‌కు ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఉంటుంది. అదే రీతిన అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు దీర్ఘ‌కాలంలో ఆర్థిక ర‌క్ష‌ణ కోసం ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్‌) స‌దుపాయాన్ని క‌ల్పించారు. ఇందులో సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం భాగ‌స్వాములుగా చేర‌వ‌చ్చు. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా దీనిని ప‌న్ను మిన‌హాయింపు సాధ‌నంగానే భావిస్తున్నారు. అయితే వీటిపై వ‌డ్డీని ప్ర‌భుత్వాలే నిర్ణ‌యిస్తాయి. ప్ర‌స్తుతం చాలా పెట్టుబ‌డి సాధ‌నాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ పీపీఎఫ్ ఆక‌ర్ష‌ణీయంగానే ఉంది. ఈ క్ర‌మంలో పీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

నెలవారీ పొదుపు:

నెలవారీ పొదుపు:

ప్ర‌తి నెలా రూ.1000 చొప్పున పొదుపు చేస్తూ పోతే 20 ఏళ్ల త‌ర్వాత క‌నీసం 8 శాతం వ‌డ్డీ వ‌స్తుంద‌ని భావిస్తే ఆ సొమ్ము చివ‌ర‌కు దాదాపు రూ.6 ల‌క్ష‌లు అవుతుంది. నెల‌వారీ ఖాతా నుంచి ఆటో డెబిట్ అయ్యే ఆప్ష‌న్ ఎంచుకుంటే మంచిది. మొద‌ట పొదుపు, త‌ర్వాతే ఖ‌ర్చులు అనే సూత్రానికి ఇది బాగుంటుంది.

ఎంత పెట్టుబ‌డి పెట్టొచ్చు?

ఎంత పెట్టుబ‌డి పెట్టొచ్చు?

మీరు మొద‌ట రూ.100తోనే పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నిష్ట పెట్టుబ‌డి రూ.500, గ‌రిష్ట పెట్టుబ‌డి రూ. 1ల‌క్షా యాభై వేలు. వ్యాపార వ‌ర్గాల వారు పెద్ద మొత్తంలో ఏడాదికి ఒక‌సారి పెట్టుబ‌డి పెడితే మంచిది. ఎక్కువ రాబ‌డుల కోసం ఏప్రిల్ 1 నుంచి పొదుపు ప్రారంభించాలి.

పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు

పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు

దేశంలో నివ‌సించే ఏ వ్య‌క్తులైనా త‌మ పేరుతో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. మైన‌ర్ పేరిట కావాలంటే తండ్రి లేదా త‌ల్లి పీపీఎఫ్ ఖాతాను తెర‌వొచ్చు. ఒక వ్య‌క్తి జీవిత కాలంలో ఒక ఖాతాను మాత్ర‌మే తెరిచే వీలుంది. బ్యాంకు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతా తెరిచే సౌల‌భ్యం ఉంది.

ఖాతా బ‌దిలీ

ఖాతా బ‌దిలీ

స్టేట్ బ్యాంకుల్లోని మెజారిటీ బ్రాంచీలు, దాదాపు అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్ర‌ధాన పోస్టాఫీసు కార్యాల‌యాల్లో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించే స‌దుపాయం ఉంది. ఒక బ్యాంకు శాఖ‌ నుంచి మ‌రో శాఖ‌కు లేదా పోస్టాఫీసుకు పీపీఎఫ్ ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న బ్యాంకులు

ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న బ్యాంకులు

ఎస్‌బీఐ, కెన‌రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆప్ ఇండియా. ప్రైవేటులో హెచ్‌డీఎప్‌సీ, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు పీపీఎప్ స‌దుపాయాన్ని అందించ‌డం లేదు.

ఎలా డిపాజిట్ చేయాలి?

ఎలా డిపాజిట్ చేయాలి?

పీపీఎఫ్‌లో పెట్టుబ‌డికి న‌గ‌దు, చెక్కు, డీడీ ద్వారా చేసే స‌దుపాయాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా పీపీఎఫ్ ఖాతాకు బ‌దిలీ చేసే స‌దుపాయాన్ని సైతం అందిస్తున్నాయి. మీరు పెట్టుబ‌డుల‌ను 12 వాయిదాల్లో కానీ లేదా ఒకేసారి మొత్తాన్ని కానీ డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ముంద‌స్తు ఖాతా ముగింపు(ప్రీమెచ్యూర్ క్లోజ‌ర్‌)

ముంద‌స్తు ఖాతా ముగింపు(ప్రీమెచ్యూర్ క్లోజ‌ర్‌)

గ‌తేడాది నుంచి పీపీఎఫ్‌ను ముందే క్లోజ్ చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఆర్థిక శాఖ స‌ర్కుల‌ర్ ప్ర‌కారం ఖాతా తెరిచిన ఐదేళ్ల త‌ర్వాత నుంచి పీపీఎఫ్ ఖాతాను మూసివేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఉన్న‌త విద్య, ఆరోగ్య ఖ‌ర్చుల నిమిత్తం మాత్ర‌మే దీన్ని తీసుకోవ‌చ్చు.

నామినీ

నామినీ

ఖాతా తెరిచిన స‌మ‌యంలో కానీ త‌ర్వాత అయినా మ‌న ఖాతాకు నామినీని నియ‌మించుకోవ‌చ్చు. పెద్ద‌ల‌(మేజ‌ర్‌) ఖాతాల విష‌యంలో ఒక‌రి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనవ‌చ్చు. ఎవ‌రికి ఎంత వాటా చెందాలో కూడా ముందుగానే నిర్ణ‌యించి అందులో పొందుప‌రుచుకోవ‌చ్చు.

భ‌ద్ర‌త‌:

భ‌ద్ర‌త‌:

పీపీఎఫ్ ఒక సామాజిక భద్ర‌తా ప‌థ‌కం. పీపీఎఫ్ ఖాతా క‌లిగిన వ్య‌క్తి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా ఎవ‌రైనా అత‌డి ఆస్తులు జ‌ప్తు చేయాల్సి వ‌స్తే అది పీపీఎఫ్‌లో పెట్టిన సొమ్ముకు వ‌ర్తించ‌కుండా చ‌ట్టం ఉంది. కాబ‌ట్టి మీ ఆస్తుల‌న్నీ జ‌ప్తు అయిన‌ప్ప‌టికీ ఈ సొమ్ము మిగిలే ఉంటుంది.

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా

పీపీఎఫ్ అనేది దీర్ఘ‌కాల ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగం. ఇక్క‌డ డిపాజిట్‌ చేసే సొమ్ముకు సుదీర్ఘ కాల‌వ్య‌వ‌ధితో పాటు చ‌క్ర‌వ‌డ్డీ వ‌స్తుంది. ప్ర‌భుత్వ గ్యారెంటీ మూలంగా న‌ష్ట భ‌యం ఉండ‌దు. దీంతో ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌లో దీన్ని భాగం చేసుకోవ‌చ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మ‌ధ్య‌స్థ స్థాయి రాబ‌డులు కావాల‌నుకునేవారు దీన్ని ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

పీపీఎఫ్‌లో అన్నిటికంటే ఉత్త‌మ‌మైన విష‌యం ఏంటంటే మీ పెట్టుబ‌డిపై ఆర్జించిన వ‌డ్డీకి ప‌న్ను ఉండ‌దు. విత్‌డ్రాయ‌ల్స్‌ను సంప‌ద ప‌న్ను నుంచి మిన‌హాయంచారు. సంపాద‌న‌ప‌ప‌రుడి వైపు నుంచే కాకుండా జీవిత భాగ‌స్వామి లేదా పిల్ల‌ల పీపీఎఫ్ ఖాతాల్లో పెట్టిన పెట్టుబ‌డులు సైతం ప‌న్ను మిన‌హాయింపుల కోసం అర్హ‌త సాధిస్తాయి.

ఇత‌ర అంశాలు:

ఇత‌ర అంశాలు:

ఉమ్మ‌డి ఖాతా తెరిచేందుకు అవ‌కాశం లేదు.

3వ ఏట నుంచి 6వ సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కూ పీపీఎఫ్‌పై రుణాన్ని పొందొచ్చు.

మైన‌ర్ పేరిట సైతం ఖాతాను తెర‌వొచ్చు. ప్ర‌స్తుతం పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.0%

ముగింపు:

ముగింపు:

ఎటువంటి రిస్క్‌(న‌ష్ట భ‌యం) లేకుండా స్థిర‌మైన ఆదాయం కావాల‌ని భావించే వారికి పీపీఎఫ్ ఎంతో అనుకూల‌మైన పెట్టుబ‌డి మార్గం. ఇది 15 ఏళ్ల దీర్ఘ‌కాలిక మ‌దుపు సాధ‌నం. 15 సంవ‌త్స‌రాల గ‌డువు పూర్త‌యిన త‌ర్వాత సైతం కావాల‌నుకుంటే మ‌రో 5 ఏళ్లు పొడిగించుకోవ‌చ్చు.

Read more about: ppf, investments, provident fund
English summary

Important things to know about ppf account

PPF or Public Provident Fund is most popular tax saving tool. One of the main reason behind its popularity is that PPF is most tax efficient savings instrument therefore real returns are high. Moreover being a long term investment, it is very useful for Retirement Planning or achieving long term objectives like Child’s marriage or Education.
Story first published: Wednesday, April 5, 2017, 12:39 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC