English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఈ పెట్టుబ‌డుల ద్వారా ప‌న్ను ఉండ‌కుండా చూసుకోవ‌చ్చు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

మీరు ఇది చ‌దువుతున్నారంటే మీ ఆదాయం దాదాపు 2.5 ల‌క్ష‌ల రూపాయ‌ల మించే ఉండాలి. చ‌ట్టం అనుమ‌తించిన విధంగానే మీరు ప‌న్నులు క‌ట్ట‌కుండా పొదుపు చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా మీ సంప‌ద పెరుగుతూ పోతుంది కూడా. అయితే టాక్స్ సేవింగ్ ఆప్ష‌న్లలో చాలా వాటికి లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంది. మీరు ఎంచుకునే మార్గం, సొమ్ము ప‌రిమితిని బ‌ట్టి లాక్‌-ఇన్ పీరియ‌డ్ మారుతుంది. మీరు ఒక విష‌యం గుర్తుంచుకోవాలి ఇక్క‌డ ఇచ్చేవ‌న్నీ కేవ‌లం ప‌న్ను త‌ప్పించుకునేందుకు మాత్ర‌మే కాదు వాటికి నిర్దిష్ట‌మైన ల‌క్ష్యాలు ఉంటాయి. దాని ద్వారా మీరు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. ఒక‌సారి వివిధ ఆప్ష‌న్ల‌పై లుక్కేయండి.

80సీ లో భాగంగా

80సీ లో భాగంగా

80సీ ద్వారా ప‌న్ను ఆదాచేసి పెట్టుబ‌డి పెట్టే వాటిలో వేటిని మ‌నం ఎంచుకోవ‌చ్చు, ఏవి క‌చ్చితం అనేది ప్ర‌ధానం. ఈపీఎఫ్‌, గృహ రుణం(హోంలోన్) తిరిగి చెల్లింపు, పిల్ల‌ల చ‌దువు రుసుములు(ట్యూష‌న్ ఫీజులు) ముందుగానే మీ ప‌రిధిలో ఉన్న అంశాలు. వీట‌న్నింటి క‌లిపి లెక్కిస్తే రూ. 1.50 ల‌క్ష‌లో ఎంత వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొందారో చూసుకోవాలి. త‌ర్వాత మిగిలిన దాన్ని ఎంత మొత్త‌మో అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత త‌గిన పెట్టుబ‌డి మార్గాన్ని చూసుకోవాలి. మీ న‌ష్ట‌భ‌యం (రిస్క్ కెపాసిటీ) సామ‌ర్థ్యాన్ని, ఆశించే రాబ‌డిని బ‌ట్టి పెట్టుబ‌డిని ఎంచుకోవాలి.

ఎవ‌రికి, ఏంటి?

ఎవ‌రికి, ఏంటి?

ఈఎల్ఎస్ఎస్ - అత్య‌ధిక‌ రాబ‌డుల‌ను ఆశిస్తూ రిస్క్ ఎక్కువ తీసుకోగ‌ల‌వారికి

పీపీఎఫ్ - ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకునే రాబ‌డుల‌ను ఆశిస్తూ, త‌క్కువ రిస్క్ తీసుకునే వారికి

పెన్ష‌న్ ఫండ్లు- స్థిర‌మైన ఆదాయం లేని వారికి (అంటే వేత‌న జీవులు కాకుండా ఏదో వ్యాపారం చేసుకునే వారికి

ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల లాగే ఈఎల్ఎస్ఎస్ లేదా ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు ఉంటాయి. అవి ఈక్విటీ లేదా షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మూలంగా అధిక రాబడులు సాధ్య‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలంలో 14 నుంచి 16% వ‌ర‌కూ రిట‌ర్నుల‌ను రాబ‌ట్టుకోవ‌చ్చు. ద్ర‌వ్యోల్బ‌ణం 6 నుంచి 8 వ‌ర‌కూ అనుకుంటే దానికి రెండింత‌లుగా రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా ఇలా అంచ‌నా వేస్తున్నా రాబ‌డుల‌కు ఎవ‌రూ క‌చ్చిత‌మైన హామీ ఇవ్వ‌లేరు.

అయితే దీర్ఘ‌కాలంలో ఎప్పుడూ మంచి రాబ‌డులు వ‌స్తుంటాయ‌ని ఆర్థిక‌ ప్ర‌ణాళిక నిపుణులు చెబుతారు. ఈఎల్ఎస్ఎస్‌కు 3 ఏళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. రూ. 1ల‌క్షా యాభై వేల వ‌ర‌కూ ఈఎల్ఎస్ఎస్‌లో మ‌దుపు చేసేందుకు వీలుంది.

పీపీఎఫ్‌

పీపీఎఫ్‌

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకుంటూ స్థిర‌మైన రాబ‌డి కావాల‌ని భావించే వారికి పీపీఎఫ్‌(ప్ర‌జా భ‌విష్య నిధి) బాగుంటుంది. పీపీఎఫ్ వ‌డ్డీ రేటును ఏటా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుతం ఇది 8 శాతానికి పైనే ఉంది. పీపీఎఫ్ అకౌంట్ కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. దాని త‌ర్వాత కావాల‌నుకుంటే మ‌రో ఐదేళ్లు పొడిగించుకోవ‌చ్చు. ఖాతా ప్రారంభించిన త‌ర్వాత ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ సాధార‌ణ ప‌రిస్థితుల్లో విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశ‌ముండ‌దు. పీపీఎఫ్ ఖాతాను బ్యాంకులో లేదా పోస్టాఫీసులో తెర‌వొచ్చు. ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ సౌక‌ర్యం సైతం ఉంటుంది.

Financial Year Interest Rate

2012-2013 8.80%

2013-2014 8.70%

2014-2015 8.70%

2015-2016 8.70%

2016-2017 8.10%

ఐదు సంవ‌త్స‌రాల ఎఫ్‌డీలు

ఐదు సంవ‌త్స‌రాల ఎఫ్‌డీలు

ఇది ఐదు సంవ‌త్స‌రాల బ్యాంకు ఎఫ్‌డీ. సాధార‌ణ ఎఫ్‌డీల‌తో పోలిస్తే వీటిల్లో 0.25% నుంచి 0.50% వ‌ర‌కూ అధిక వ‌డ్డీ వ‌స్తుంది. అయితే ముందే వీటిని విత్‌డ్రా చేయ‌లేం. పెనాల్టీ విధించి అయినా వీటిని వెన‌క్కు తీసుకోవ‌డం సాధ్యం కాదు. రూ. 1.50 ల‌క్ష వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చు. 10% టీడీఎస్‌ను బ్యాంకులు మిన‌హాయిస్తాయి. పాన్ నంబ‌రు స‌మ‌ర్పించ‌క‌పోతే 20% టీడీఎస్ అమ‌ల‌వుతుంది. 20, 30% ప‌న్ను శ్లాబులో ఉన్న‌వారికి ఇవి అంతగా న‌ప్ప‌వు.

జాతీయ పొదుపు ప‌త్రాలు

జాతీయ పొదుపు ప‌త్రాలు

ఇత‌ర పోస్టాఫీసు ప‌థ‌కాల్లాగే జాతీయ పొదుపు పత్రాలు బ్యాంకుల కంటే ఎక్కువ వ‌డ్డీని అందిస్తున్నాయి. ప్ర‌స్తుతం 8.1 శాతం వ‌డ్డీ రేటు అంటే బ్యాంకుల కంటే క‌నీసం 0.5% శాతం అద‌న‌పు వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. ఇంతే కాకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు అద‌నం. మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న పోస్టాఫీసుల్లో వీటిని పొంద‌వ‌చ్చు.

జీవిత బీమా ప్రీమియం

జీవిత బీమా ప్రీమియం

ఎన్నో ఏళ్ల నుంచి ప‌న్ను ఆదా చేసుకునే వారికి క‌నిపించే మొట్ట‌మొద‌టి మార్గం జీవిత బీమా. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఇందులో ఉండే సానుకూల‌త‌ను తెలివైన పెట్టుబ‌డిదారులు వినియోగించుకుంటున్నారు. జీవిత బీమా పాల‌సీల్లో కేవ‌లం రిస్క్ క‌వ‌ర్ చేసేవి, రిస్క్‌తో పాటు పెట్టుబడి కోణాన్ని క‌లిగి ఉండేవి అని రెండు ర‌కాలు ఉంటాయి. రూ. 10 వేల క‌నీస ప్రీమియంతో మీరు రూ. 1 కోటి క‌వ‌రేజీ క‌లిగిన ట‌ర్మ్ ఇన్సూరెన్సును తీసుకోవ‌చ్చు. మీరు చెల్లించిన ప్రీమియానికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ఎన్‌పీఎస్‌

ఎన్‌పీఎస్‌

సామాజిక భ‌ద్ర‌త‌లో భాగంగా అంద‌రికీ పింఛ‌ను సౌక‌ర్యం ఉండాల‌నే ఉద్దేశంతో కేంద్రం న్యూ పెన్ష‌న్ స్కీంను ప్ర‌వేశ‌పెట్టింది. చిరునామా, కేవైసీ గుర్తింపుల‌ను ఆధార్ ఆధారంగా చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఈఎన్‌పీఎస్ వెబ్‌సైట్లో అప్‌డేట్ పైన క్లిక్ చేసి త‌దుప‌రి ప్ర‌క్రియ‌ను పూర్తిచేయొచ్చు. రూ.1.50 ల‌క్ష వ‌ర‌కూ 80 సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఇందులో ఉన్న ష‌ర‌తుల‌ను బ‌ట్టి చాలా మంది పెట్టుబ‌డి కోసం దీన్ని సూచించ‌డం లేదు.

సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కాలు

సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కాలు

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా 8.6 శాతం వ‌డ్డీ వ‌స్తోంది. ఇది మారుతూ ఉంటుంది. ఈ ప‌థ‌కం కూడా 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉంది. ఈ పెట్టుబ‌డి కాల‌ప‌రిమితి 5 ఏళ్లు. ఈ ఖాతాను ఒక పోస్టాఫీసు, బ్యాంకు నుంచి మ‌రోచోట‌కి మార్చుకునే స‌దుపాయం ఉంది. వ‌డ్డీ సంవ‌త్స‌రానికి 10 వేల‌ను మించితే టీడీఎస్ క‌ట్ చేస్తారు.

పెన్ష‌న్ ఫండ్లు(పింఛ‌ను ఫండ్లు)

పెన్ష‌న్ ఫండ్లు(పింఛ‌ను ఫండ్లు)

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత డ‌బ్బు స‌మ‌కూర్చుకునే దానికోసం ఈ ఫండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

ఇవి డిఫ‌ర్డ్ యాన్యుటీ, ఇమ్మిడీయ‌ట్ యాన్యుటీ అని రెండు ర‌కాలుగా ఉంటాయి.

డిఫర్డ్ యాన్యుటీల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కూ ప్ర‌తి సంవ‌త్స‌రం పెట్టుబ‌డి పెడుతూ ఉంటారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును చేరుకున్న త‌ర్వాత మొత్తంలో నుంచి 60% తీసుకోవ‌చ్చు. మిగిలిన దాన్ని యాన్యుటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.

అదే ఇమ్మిడీయ‌ట్ యాన్యుటీల్లో అయితే ఒకేసారి మొత్తం పెట్టుబ‌డిని పెట్ట‌వ‌చ్చు. దాని త‌ర్వాత నెల‌వారీ పింఛ‌ను రూపంలో ఖాతాలోకి డ‌బ్బును పొంద‌వ‌చ్చు.

గృహ రుణానికి క‌ట్టే అస‌లుపై, స్టాంపు డ్యూటీ / రిజిస్ట్రేషన్ చార్జీలపై ప‌న్ను మిన‌హాయింపు

గృహ రుణానికి క‌ట్టే అస‌లుపై, స్టాంపు డ్యూటీ / రిజిస్ట్రేషన్ చార్జీలపై ప‌న్ను మిన‌హాయింపు

అసలు చెల్లింపుపై: గృహ రుణం రీపేమెంట్‌లో అసలు భాగానికి 80సీ సెక్షన్ వర్తిస్తుంది. దీనికింద ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల మేర మినహాయింపు పొందవచ్చు. ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. నిర్మాణం పూర్తయి, కంప్లీషన్ సర్టిఫికెట్ లభించాక మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే నిర్మాణ దశలో కట్టిన వడ్డీకి సంబంధించి ఆ తర్వాత వ‌రుస‌గా ఐదేళ్ల పాటు క‌ట్టే ఈఎంఐల‌కు మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు.

స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్ చార్జీలపై: ప్రాపర్టీని కొనేటప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితికి లోబడి దీన్ని అనుమతిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టిన ఏడాదే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.

Read more about: tax, save tax, tax savings
English summary

Tax saving options under 80C for the year 2016

Here are some best tax saving instruments you could consider for this financial year which can help you in saving tax as well as provide you with better returns.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC