For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

By Nageswara Rao
|

ఇప్పుడు చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల కొంతమేరకే ప్రయోజనం ఉండటంతో చాలా మంది క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. సాధారణ బీమా పాలసీకి, క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీకి చాలా తేడా ఉంది.

సాధారణ బీమా పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడే ఖర్చులను భరిస్తుంది. కానీ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ మాత్రం ఆసుపత్రిలో చేరక ముందు 30 రోజులు, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక 30 రోజుల వరకూ అయ్యే చికిత్స ఖర్చులనూ భరిస్తుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

అంతేకాదు క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ తీసుకుంటే పాలసీ పత్రంలో ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తించిన వెంటనే పాలసీ మొత్తాన్ని అందిస్తుంది. కొన్ని బీమా సంస్థలు అందించే పాలసీల్లో 12-15 రకాల వ్యాధులకు పరహారం అందుతుంది. మరికొన్ని పాలసీలు 38 రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆర్ధిక రక్షణ కల్పిస్తున్నాయి.

 క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

కుటుంబంలో ఆర్జించే వ్యక్తి ఒక్కరే ఉన్నప్పుడు ఈ క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ తీసుకోవడం ఎంతో ఉత్తమం. ముందుగా ఏ వ్యాధులకు బీమా రక్షణ ఉంటుందో, వేటికి ఉండదో స్పష్టంగా తెలుసుకోవాలి. ఉదాహారణకు క్యాన్సర్‌కు పరిహారం లభిస్తుందంటే ఏయే క్యాన్సర్లకు పరిహారం లభిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

 క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పాలసీలో పేర్కొన్న వ్యాధిని గుర్తించిన తర్వాత పరిహారం ఇవ్వగానే ఈ పాలసీ రద్దుఅవుతుంది. సాధారణంగా బీమా పాలసీకి వేచి ఉండే సమయం ఉంటుంది. ఇందులో అలా ఉండదు.

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

ఈ పాలసీ ప్రస్తుతం రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి ఇప్పటికే ఉన్న బీమా పాలసీలకు అనుబంధ పాలసీగా ఎంచుకోవడం, మరొకటి కేవలం క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీనే. ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ తీసుకునే వారు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే మీకే మంచిది.

 క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ?

ముఖ్యంగా పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారుడు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని దాచకండి. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే పాలసీని క్లెయిం చేసుకునేటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడు సరైన సమాచారాన్ని మాత్రమే పేర్కొనండి.

English summary

క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ అంటే ఏమిటీ? | How to choose the best critical illness insurance plan

Do you need extra insurance for life-threatening ailments when you have a comprehensive health plan and, maybe, a group cover from your employer? In such a case, why buy another insurance policy and clutter the portfolio?
Story first published: Friday, November 27, 2015, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X