For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షియోమీ సూపర్ ఆఫర్: రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్, ఎలా తీసుకోవాలంటే?

|

చైనీస్ హ్యాండ్‌సెట్ మేకర్ షియోమీ తన MI క్రెడిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పర్సనల్ లోన్స్ ఇవ్వనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి పునఃప్రారంభించనుంది. షియోమీ గత ఏడాది మే నెలలో Mi Credit ప్లాట్ ఫాంను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ కొత్త వర్షన్‌ను తీసుకు వస్తోంది. ఈ కొత్త వర్షన్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలోనే గూగుల్ ప్లే స్టోర్‌లో Mi Credit యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

IRCTC ఏజెంట్: నెలకు రూ.80,000 కూడా <strong>సంపాదించవచ్చు</strong>! ఎలాగంటే?IRCTC ఏజెంట్: నెలకు రూ.80,000 కూడా సంపాదించవచ్చు! ఎలాగంటే?

తక్షణ రుణ సాయం

తక్షణ రుణ సాయం

Mi Credit క్రెడిట్ ప్లాట్ ఫాం లాంచ్‌కు సంబంధించి ఆహ్వానాలు పంపించింది. షియోమీ ఈ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లకు తక్షణ రుణ సాయం అందించనుంది. గతంలో కంపెనీ KreditBee అనే సంస్థతో జతకట్టింది. ఇది బెంగళూరుకు చెందిన స్టార్టప్.

10 నిమిషాల్లో రుణం

10 నిమిషాల్లో రుణం

షియోమీ ప్రకారం.. ఈ లోన్ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకోవచ్చు. ఇందుకు సింపుల్ KYC వెరిఫికేషన్ ఉంటుంది. షియోమీ తన కంపెనీ అమ్మకాలు పెంచుకునేందుకు ఈ రుణ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు Mi Credit సర్వీస్‌కు పెద్దగా ఆదరణ లేదు. అయితే రీలాంచ్‌తో ఈ విభాగంలో పుంజుకోవాలని చూస్తోంది.

రూ.1,00,000 వరకు రుణం

రూ.1,00,000 వరకు రుణం

షియోమీ Mi Credit ద్వారా ఎంఐ యూజర్లకు రుణాన్ని ఇవ్వదు. ఇది వినియోగదారులకు తక్షణ రుణాలు ప్రారంభించేందుకు అనుమతించే ఇంటర్‌ఫేస్‌గా పని చేస్తుంది. అంటే రుణం అవసరమైన వినియోగదారుడిని ఓ సేవకు అనుసంధానిస్తుంది. దీని ద్వారా రూ.1,000 నుంచి రూ.1,00,000 వరకు రుణం అందుతుంది. MI యూజర్లు నిర్ణీత వ్యవధిలో సులభ నెలసరి వాయిదాల్లో లోన్ మొత్తం చెల్లించవచ్చు.

ఈ రుణ సౌకర్యం ఎలా పొందాలి?

ఈ రుణ సౌకర్యం ఎలా పొందాలి?

షియోమీ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో Mi Credit యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఇక్కడి నుంచి యూజర్లు ఇన్‌స్టాంట్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Mi Credit యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఫోన్ నెంబర్ కేవైసీ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా ఇవ్వాలి. లోన్ మొత్తం అకౌంట్లోకి వస్తాయి.

ఎవరు తీసుకోవచ్చు.. వడ్డీ ఎంత?

ఎవరు తీసుకోవచ్చు.. వడ్డీ ఎంత?

18 ఏళ్లు నిండిన ఏ యూజర్ అయినా రూ.1 లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. ఈఎంఐ కాల పరిమితి 91 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వడ్డీ రేటు నెలకు 1.35 శాతం ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.20,000 రుణం తీసుకుంటే వడ్డీ రేటు 16.2 శాతంగా ఉంటుంది. ఈ లోన్‌ను ఆరు ఈఎంఐలలో చెల్లించాలి. వడ్డీ రేటు మొత్తం రూ.937 అవుతుంది. నెలకు EMI రూ.3,423.

English summary

షియోమీ సూపర్ ఆఫర్: రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్, ఎలా తీసుకోవాలంటే? | Xiaomi to relaunch Mi Credit for personal loans in India on December 3

Chinese handset maker Xiaomi will launch its Mi Credit platform for personal loans in India on 3 December. It is likely that the company will now unveil a revamped version of Mi Credit in the country.
Story first published: Sunday, December 1, 2019, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X