For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా వ్యతిరేక సెంటిమెంట్: షియోమీ టాప్, రెండో స్థానంలో శాంసంగ్

|

దేశవ్యాప్తంగా 2020లో పదిహేను కోట్ల యూనిట్ల స్మార్ట్ ఫోన్స్ విక్రయాలు జరిగాయి. 2019తో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ అని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. కరోనా సమయంలోను స్మార్ట్ ఫోన్స్ ఈ మేరకు అమ్ముడుపోవడం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో సేల్స్ దాదాపు లేవు. ఆ తర్వాత విక్రయాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు వంటి పలు కారణాలతో సేల్స్ పెరిగాయి. 2019 అక్టోబర్ - డిసెంబర్ కాలంతో పోలిస్తే 2020 అదే కాలంలో స్మార్ట్ ఫోన్ సేల్స్ ఏకంగా 19 శాతం పెరిగాయి.

రియల్‌మి దూసుకెళ్తోంది

రియల్‌మి దూసుకెళ్తోంది

స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో కలిపి మొత్తం మొబైల్ మార్కెట్ గత ఏడాది 9 శాతం తగ్గింది. 2019తో పోలిస్తే గత ఏడాదిలో భారత్‌లో స్మార్ట్ ఫోన్ సేల్స్ 2 శాతం తగ్గి 14.5 కోట్ల యూనిట్లుగా నమోదయినట్లు మరో రీసెర్చ్ సంస్థ కెనాలిస్ తెలిపింది.

2020లో రియల్‌మీ వేగంగా వృద్ధి నమోదు చేసిన కంపెనీ. 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు 20 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. రియల్‌మీ నార్జో, రియల్‌మీ సీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌తో భారత మొబైల్ మార్కెట్లో దూసుకెళ్లింది.

రెడ్‌మీ నోట్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ సేల్స్ రికార్డు సృష్టించాయి.

టాప్ కంపెనీలు

టాప్ కంపెనీలు

భారత మొబైల్ మార్కెట్లో షావోమీ 26 శాతం మార్కెట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా భారత మార్కెట్లో షావోమీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. రెడ్‌మీ, ఎంఐ బ్రాండ్ సేల్స్ భారీగా సేల్స్ నమోదు కావడం కలిసి వచ్చింది. కరోనా సమయంలోను 150 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు సేల్ అయ్యాయి. షావోమీ సేల్స్ చూస్తే యాంటీ-చైనా సెంటిమెంట్ తాత్కాలికంగానే కనిపించిందని అంటున్నారు.

ఇక, 21 శాతం మార్కెట్‌తో శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన షావోమీ మొదటి స్థానంలో ఉండగా, అదే దేశానికి చెందిన వివో 16 శాతం మార్కెట్‌తో మూడో స్థానంలో నిలిచింది. వివో ఆఫ్ లైన్ సేల్స్ అధికంగా ఉన్నాయి.

రియల్‌మి 13 శాతం, ఒప్పో 10 శాతం వాటాతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

డిసెంబర్ త్రైమాసికంలో ఆపిల్ మాత్రం 171 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020లో 93 శాతం వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఆపిల్ 1.5 మిలియన్ ఫోన్లు విక్రయించింది.

వన్ ప్లస్ జంప్

వన్ ప్లస్ జంప్

డిసెంబర్ త్రైమాసికంలో వన్ ప్లస్ 200 శాతం వృద్ధిని సాధించింది. నార్డ్ సిరీస్, 8టీ సిరీస్ దోహదపడింది. ట్రాన్సన్ గ్రూప్ బ్రాండ్స్ ఐటెల్, ఇన్‌ఫినిక్స్, టెక్నో నాలుగో త్రైమాసికంలో 90 లక్షల యూనిట్లను విక్రయించాయి. కాగా, కరోనా సమయంలో 15 కోట్ల స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఉండటం రికార్డ్ అంటున్నారు.

English summary

చైనా వ్యతిరేక సెంటిమెంట్: షియోమీ టాప్, రెండో స్థానంలో శాంసంగ్ | Xiaomi pips Samsung to regain top spot in Indian phone market

Chinese handset maker Xiaomi reclaimed the top spot with a 26% share of India’s smartphone market in the December quarter, after anti-China sentiments helped South Korea’s Samsung push ahead with a 24% market share in the previous quarter compared to Xiaomi’s 23%, as per Counterpoint Research. In Q4, Samsung registered 20% share of the Indian smartphone market.
Story first published: Thursday, January 28, 2021, 13:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X