For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్‌ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!

|

కరోనా వైరస్ నేపథ్యంలో ఐటీ రంగ కంపెనీలు తమ ఉద్యోగుల్లో 90 శాతం అంతకంటే ఎక్కువమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఇచ్చాయి. దీంతో ఐటీ రంగం ఎక్కువగా ఉన్న నగరాలు ఇప్పుడు బోసిపోతున్నాయి. ఇండియన్ ఐటీ సిటీ బెంగళూరులోని ఐటీ క్లస్టర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఐటీ పార్క్స్ కేవలం 5 శాతం నుండి 15 శాతం ఉద్యోగులతో పని చేస్తున్నాయి. ఇతర ఉద్యోగులు కార్యాలయాలకు ఎప్పటి నుండి వస్తారో అప్పుడే చెప్పలేని పరిస్థితి.

ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!

ఐటీ క్లస్టర్‌లో ఆఫీస్‌లకు అతి తక్కువమంది

ఐటీ క్లస్టర్‌లో ఆఫీస్‌లకు అతి తక్కువమంది

వైట్‌ఫీల్డ్‌లోని 69 ఎకరాల అంతర్జాతీయ టెక్ పార్క్ ఉంది. ఈ ఐటీ హబ్‌లో భారత దిగ్గజ టెక్ సంస్థ టీసీఎస్‌కు భారీ కార్యాలయం ఉంది. ఇక్కడ పని చేసే 55,000 ఉద్యోగుల్లో కేవలం 5 శాతం నుండి 7 శాతం మంది ఉద్యోగులు వస్తున్నారు. మన్యతా ఎంబసీ పార్కులో ఐబీఎం, కాగ్నిజెంట్ ఉద్యోగులు లక్ష మది వరకు ఉంటారు. ఇందులో 15,000 మంది కార్యాలయాలకు వస్తున్నారు. పరిమితులు సడలించినప్పటికీ సిస్కో ఉద్యోగుల్లో 80 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇన్పోసిస్, విప్రో కంపెనీల ఉద్యోగులు90 శాతం మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. తమ ఉద్యోగుల్లో 93 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, ప్రోడక్టివిటీలో ఎలాంటి అంతరాయం లేదన్నారు.

వచ్చే జూన్ వరకు ఇంటికే గూగుల్ ఇండియా ఉద్యోగులు!

వచ్చే జూన్ వరకు ఇంటికే గూగుల్ ఇండియా ఉద్యోగులు!

గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు. గూగుల్ ఇండియా ఉద్యోగులు కూడా ఇంటి నుండే పని చేస్తారు. అలాగే, 20 నుండి 30 మంది లేదా కాస్త అటుఇటుగా ఉద్యోగులు కలిగిన స్టార్టప్స్ లేదా చిన్న కంపెనీలు ఆఫీస్ అవసరమా అని ఆలోచిస్తున్నాయి. వేలల్లో ఉద్యోగులు కలిగిన కంపెనీలు కార్యాలయం నుండి పని చేయడంలో అర్థం ఉందని, స్టార్టప్స్‌కు అవసరమా అని ఐటీ నిపుణులు అంటున్నారు. ఇలాంటి సంస్థలు 20 శాతం నుండి 30 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా చూడాలని సూచిస్తున్నారు.

56 శాతం క్షీణత

56 శాతం క్షీణత

ఓ రిపోర్ట్ ప్రకారం ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే బెంగళూరులో కార్యాలయాల అవసరం 56 శాతం తగ్గినట్లు క్షీణించింది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇతర రంగాల కంటే ఐటీ సెక్టార్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఈజీ. లాక్ డౌన్ సమయంలోను ఐటీ పరిశ్రమ కార్యకలాపాలపై మిగతా రంగాలతో పోలిస్తే ప్రభావం అతి తక్కువగా కనిపించింది. ఇటీవలి క్వార్టర్ ఆదాయాలు కూడా ఇందుకు నిదర్శనం. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఇప్పటికే రానున్న కాలంలో ఎక్కువమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని భావిస్తున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు, చిన్న స్టార్టప్స్ కార్యాలయం నుండి పని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంలో తర్జన భర్జన పడుతున్నట్లుగా భావిస్తున్నారు.

రియల్ బూమ్

రియల్ బూమ్

గత రెండు దశాబ్దాల్లో బెంగళూరు ఐటీ నగరంగా ఎదిగింది. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోను డిమాండ్ వచ్చింది. ట్రాఫిక్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యకు కూడా దారి తీసింది. ఎంబసీ మన్యతా బిజినెస్ పార్క్ ముందు ఉన్న స్కైవాక్‌ను 22,000 మంది ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో వివిధ ఐటీ సంస్థలు, స్టార్టప్స్ కలిగి ఉన్నాయి. లీజుకు తీసుకోవడంలో ఇక్కడి వాటా కూడా ఎక్కువే.

అప్పుడు ఆఫీస్ స్పేస్ మరింత అవసరం

అప్పుడు ఆఫీస్ స్పేస్ మరింత అవసరం

చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయిస్తున్నాయని, అయితే కంపెనీలు ఇప్పటికీ తమ లీజును రద్దు చేయలేదని మల్టీపుల్ బిజినెస్ పార్క్స్ కలిగిన ఎంబసీ గ్రూప్ ఎండీ, చైర్మన్ జితు విర్వానీ అన్నారు. ఉద్యోగులు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చినప్పుడు సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో ఆఫీస్ స్పేస్ మరింత ఎక్కువ అవసరమన్నారు.

English summary

రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్‌ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్! | Work from home transforms Bengaluru's IT clusters

The bustling information technology corridors of Bengaluru may well be a thing of the past as the covid-19-led work from home (WFH) regime negates the need for large office spaces, prompting a wave of change in how India's technology capital operates.
Story first published: Monday, August 3, 2020, 21:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X