For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైలు ఛార్జీలు పెరుగుతాయా? భారీగా తగ్గిన ఆదాయం.. ఏంతంటే?

|

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వే ప్రతి రూ.100లో రూ.98.44 ఖర్చు చేసింది. గత పదేళ్లలో ఇది అత్యంత వరస్ట్ ఆపరేటింగ్ రేషియోగా ఇటీవల కాగ్ పార్లమెంటుకు నివేదించింది. రైల్వే ఆదాయం త్వరలో ఛార్జీలు పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఈ దిశగా రైల్వే బోర్డు అడుగులు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల తర్వాత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. వార్తలు వస్తున్నాయి.. కానీ దీనిపై స్పష్టత లేదు.

<strong>రైల్వేలో రూ.100కు రూ.98.44 ఖర్చే, ఆ ఆదాయం లేకుంటే 102.66%</strong>రైల్వేలో రూ.100కు రూ.98.44 ఖర్చే, ఆ ఆదాయం లేకుంటే 102.66%

5 శాతం నుంచి 10 శాతం పెరిగే ఛాన్స్

5 శాతం నుంచి 10 శాతం పెరిగే ఛాన్స్

మీడియాలో వస్తున్న వార్తల మేరకు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 5 శాతం నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచవచ్చునని రైల్వే వర్గాలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం ఛార్జీల పెంపు ప్రకటన ఉండవచ్చునని అంటున్నారు.

పెరిగితే రెండోసారి

పెరిగితే రెండోసారి

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి 2014 జూన్ 25వ తేదీన చార్జీలను స్వల్పంగా పెంచారు. అప్పట్లో ప్రయాణికుల చార్జీలు 14.2 శాతం పెరగగా, రవాణా చార్జీలను 6.5 శాతానికి పెంచారు. ఇప్పుడు పెంచితో ఐదున్నరేళ్లలో రెండోసారి అవుతుంది.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు...

ఇంకా నిర్ణయం తీసుకోలేదు...

పెరిగిన ఇన్‌పుట్ ఖర్చు సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఛార్జీలను హేతుబద్దీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే పెంపు పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు చెప్పాయని వార్తలు వస్తున్నాయి.

పెరిగిన ఖర్చు

పెరిగిన ఖర్చు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20)లో అక్టోబర్ చివరి నాటికి భారతీయ రైల్వే 19,000 కోట్ల షార్ట్ ఫాల్‌ను నమోదు చేసింది. అదే సమయంలో ఖర్చులు రూ.4,000కు మించి పోయి ఖర్చు లక్ష్యాన్ని అధిగమించాయి. పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లను ఎక్కువ సంఖ్యలో నడిపినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రయాణికేతర ఆదాయమైన వాణిజ్య ప్రకటనలు, స్టేషన్ల పునరాభివృద్ధఇ నుంచి ఆశించిన రాబడి లేదు.

లక్ష్యం.. రాబడి

లక్ష్యం.. రాబడి

ఏప్రిల్ - అక్టోబర్.. ఏడు నెలల కాలంలో రాబడి లక్ష్యాన్ని రూ.1,18,634.69 కోట్లుగా పెట్టుకోగా, రూ.99,222.72 కోట్లు వచ్చాయి. అంటే రూ.19,411.97 తక్కువ నమోదు అయింది. గత ఏడాదితో పోలిస్తే రూ.571 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.99,794 కోట్లుగా ఉంది. అలాగే వర్కింగ్ ఖర్చులు రూ.97,264.73 కోట్ల నుంచి రూ.1,01,363.90 కోట్లకు పెరిగాయి. అంటే రూ.4,099 కోట్లు పెరిగింది. ప్యాసింజర్ సెగ్మెంట్ టార్గెట్ రూ.32,681.10 కాగా, రూ.30,715.10 కోట్లు వచ్చాయి. లక్ష్యాని కంటే రూ.1966.33 కోట్లు తగ్గింది. గూడ్స్ ఎర్నింగ్ ద్వారా రూ.77,615.89 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.62,733.17 కోట్లు మాత్రమే వచ్చింది. లక్ష్యాని కంటే రూ.14,882.72 కోట్లు తగ్గింది.

English summary

రైలు ఛార్జీలు పెరుగుతాయా? భారీగా తగ్గిన ఆదాయం.. ఏంతంటే? | Will train fare hike on cards?

Facing a drastic fall in earnings, Indian Railways is actively considering hiking passenger fares in the near future to shore up its revenues.
Story first published: Wednesday, December 4, 2019, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X