For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత పని చేసింది ఉల్లి .. ఏమవుతోందో తెలుసా?

|

ఉల్లి ట్రెండింగ్గా మారిపోయింది. ఏ న్యూస్ ఛానల్ చూసినా ఉల్లి గురించే చర్చోపచర్చలు. పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఎందులో నైనా ఉల్లి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కొంత మంది ఉల్లిపై సెటైర్లు వేస్తుంటే.. మరికొంతమంది ఉల్లి తెచ్చిన ఇబ్బందుల గురించి, తమ బాధలను వెళ్లగక్కుతున్నారు. ప్రతి ఇంటిలోనూ ఉల్లి బాంబు పేలుతోంది. ఉల్లి కొనాలంటేనే గుండె ధైర్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇంతకు ముందు ఉల్లిని కిలోల చొప్పున కొనే వాళ్ళు. ఇప్పుడు గ్రాములకే పరిమితం అవుతున్నారు. ఉల్లి ధర ఎప్పుడు తగ్గుతుందా అని వినియోగదారులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

బడ్జెట్ తారుమారు...

బడ్జెట్ తారుమారు...

* ఇంతకు ముందు ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం కొంప ముంచింది ఉల్లి. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ధరలు పెరిగి ప్రభుత్వాలను నానా కష్టాల పలు చేసింది. ఉల్లి ధర పెరిగిందంటే ప్రతి పక్షాలు పండగ చేసుకుంటాయి. రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తాయి. ఉల్లి ధరలు తగ్గించాలి ప్రభుత్వం ఎందుకు అధికారంలో ఉండటం... వెంటనే దిగిపోవాలని పీకల మీద కూర్చుంటాయి. ధరలు దిగివచ్చే దాకా అటు ప్రభుత్వానికి ఇటు వినియోగదారులకు కష్టాలు తప్పవు మరి. ఉల్లి మూలంగా సామాన్య ప్రజల వంటింటి బడ్జెట్ తారుమారు అవుతోంది.

* ఉల్లి కొస్తే కన్నీరు వస్తుంది.. కానీ ఇప్పుడు కొనాలంటేనే కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఉంది.

అక్కడ ఉల్లి మాట లేదు...

అక్కడ ఉల్లి మాట లేదు...

* హోటల్లోకి వెళ్లి ఉల్లి దోషకు ఆర్దరు ఇచ్చే రోజులకు కాలం చెల్లిపోయింది. ఉల్లి దోష అన్న పేరు వినిపించడం లేదు.

* పానీ పూరీలో ఉల్లి లేనిదే గొంతు దిగదు. ఇప్పుడు కాస్త ఉల్లి పాయ వేయమని అడిగితే ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు.

* చికెన్ బిర్యానీకి ఆర్దరు ఇచ్చినా గుండ్రంగా కోసిన ఉల్లి ముక్క ఒక్కటి కనిపిస్తే అదే మహా ప్రసాదంగా భావించి కళ్ళకు అడ్డుకుంటున్నారు చాలా మంది.

కిలో ఉల్లికి ఏమొస్తుంది?

కిలో ఉల్లికి ఏమొస్తుంది?

* కిలో ఉల్లి కొనాలంటే లెక్కలు వేసుకుంటున్నారు జనాలు. కిలో ఉల్లికి ఏమొస్తుందని పోల్చి చూస్తున్నారు. ఉల్లి ధర దేశవ్యాప్తంగా చూస్తే ఉల్లి రకాన్ని బట్టి 150 నుంచి నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.

* కిలో ఉల్లి = కిలో చికెన్

* కిలో ఉల్లి = ఒక బీర్

* కిలో ఉల్లి = 2.5 లీటర్ల పెట్రోల్

* కిలో ఉల్లి = 5 కిలోల గోధుమ పిండి

* కిలో ఉల్లి = ఒక నెల డిష్ బిల్లు

అని జనాలు లెక్కలు వేసుకుంటున్నారు.

ఉల్లి ధర ఎందుకు పెరిగింది?

ఉల్లి ధర ఎందుకు పెరిగింది?

* ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరుగుతాయని ఎవరు ఉహించి ఉండరు. 15-20 రూపాయల్లో చాలా రోజుల పాటు ఉన్న ఉల్లి ధర క్రమంగా పెరగడం మొదలయింది. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. అవేమిటంటే...

* ఈసారి ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలో వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బ తిన్నది.

* ఉల్లి సాగు తగ్గిపోయింది. అంతే కాకుండా ఉల్లి నాట్లు లేటు కావడం వల్ల పంట చేతికి రావడానికి ఇంకా సమయం పడుతోంది.

* మన మార్కెట్లో ఉల్లి తక్కువగా ఉన్నప్పుడు విదేశీ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటాం. అయితే ఈ దిగుమతుల్లో జాప్యం వల్ల ధరలు పెరుగుతున్నాయి.

* ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్న వ్యాపారాలు ఉల్లి నిల్వలను దాచిపెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ధరలు ఇంకా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయన్న వార్తలు కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయి.

English summary

Why onion prices rising? what are the reasons?

High onion prices across the country are putting pressure on consumers and governments. low productivity in some states is the reason behind the price rise.
Story first published: Thursday, December 12, 2019, 19:40 [IST]
Company Search