For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎకానమీ ఎఫెక్ట్: అదే లేకుంటే ట్రంప్ చాలా ఈజీగా గెలిచేవారా?

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ 270 మ్యాజిక్ మార్క్‌కు సమీపంలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వెనుకబడ్డారు. తొలుత బిడెన్ సునాయాస గెలుపు అని అందరూ భావించారు. కానీ ట్రంప్ అనూహ్యంగా దూసుకొచ్చారు. 214 ఎలక్టోరల్ ఓట్ల వద్ద ట్రంప్ నిలిచిపోయారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2020లో కరోనా మహమ్మారి లేకపోతే డొనాల్డ్ ట్రంప్ సులభంగా గెలిచే వారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఓటర్లు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, ప్రధానంగా మెజార్టీ అమెరికన్లు ఎకానమీ, కరోనా ఆధారంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు.

ఎకానమీ.. ట్రంప్, కరోనా బిడెన్

ఎకానమీ.. ట్రంప్, కరోనా బిడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ఎకానమీ పరంగా డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపారు. కరోనా వైరస్‌ను ప్రధాన అంశంగా భావించిన వారు జోబిడెన్‌కు ఓటు వేశారు. దశాబ్దాలతో పోలిస్తే ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింతగా ముందుకు తీసుకు వెళ్లారని చాలామంది అభిప్రాయం. కరోనా సమయంలో అన్ని దేశాలు పతనమయ్యాయి. అన్ని దేశాల కంటే అమెరికాలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అయితే ఆమెరికా ఎకానమీ అందరూ భయపడినంతగా ఇబ్బందిపడలేదు. ఇందుకు కరోనాకు ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత హెల్తీగా తీర్చిదిద్దడమే కారణంగా చెబుతున్నారు. రిపబ్లికన్లు ఎకానమీని, డెమోక్రాట్లు కరోనాను చూశారు. ఎకానమీకి సంబంధించి అమెరికా విధానాన్ని ట్రంప్ మార్చారని చెబుతున్నారు.

అలా అయితే ట్రంప్ సులభంగా గెలిచేవారు!

అలా అయితే ట్రంప్ సులభంగా గెలిచేవారు!

ఎకానమీని ప్రధాన అంశంగా తీసుకున్నవారిలో మెజార్టీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పగా, కరోనాను చూసిన వారు బిడెన్ వైపు మొగ్గు చూపారు. ఒకవేళ 2020 కరోనా మహమ్మారి కనుక రాకపోయి ఉంటే ట్రంప్ చాలా సులభంగా నెగ్గి ఉండేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మొదటి నుండి అమెరికా ఫస్ట్ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. ఆయన పాలనలోను అదే కనిపించింది.

కరోనా ప్రచారాస్త్రం

కరోనా ప్రచారాస్త్రం

2020 ప్రారంభం నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రచారం చేశారు. ట్రంప్ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. తాను లేకుంటే మరింత ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగేదని ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా కేసులు, మరణాలు అమెరికాలో ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,419,595 కేసులు ఉంటే, 9,801,355 కేసులు అమెరికాలోనే ఉన్నాయి. అంటే దాదాపు 20 శాతం కేసులు అగ్రరాజ్యంలోనే ఉన్నాయి. మరణాలు 1,230,746 ఉండగా, అమెరికాలోనే 239,829 ఉన్నాయి. ఇది కూడా దాదాపు 20 శాతం ఉంది.

English summary

ఎకానమీ ఎఫెక్ట్: అదే లేకుంటే ట్రంప్ చాలా ఈజీగా గెలిచేవారా? | Voters favor Joe Biden on Corona, Donald Trump on economy

Voters in the US presidential election faced a public health crisis and a wounded economy, but neither candidate emerged as the clear choice to handle both of those issues, according to AP VoteCast.
Story first published: Thursday, November 5, 2020, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X