పశ్చిమ ఆసియాలో ఫిబ్రవరి28 నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు..దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరలపై చేస్తున్న డ్రోన్ల దాడులతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ యుధ్దంలో ఎవరికి వారు తగ్గేదేలే అని దూసుకుపోతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు సంక్షోభం నెలకొంది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ తన మిత్ర బేధాన్ని చైనాతో పాటిస్తోంది. తమ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరాన్ సుమారు 11.7 మిలియన్ బారెల్స్ ముడి చమురును హర్మూజ్ జలసంధి ద్వారా చైనాకు విజయవంతంగా తరలించింది. అంతర్జాతీయంగా అమెరికా విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలను ధిక్కరించడం ఇరాన్ ప్రత్యేకతగా నిలిచిందని చెప్పవచ్చు.
ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ నియంత్రణలో ఉండటంతో.. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ కోసం వ్యూహాత్మక సాధనం అయింది. ఇజ్రాయేల్, అమెరికా మధ్య తమకు ఉగ్రవాతావరణం నెలకొన్నప్పటికీ.. ఇరాన్ తన నౌకల ద్వారా చైనాకు నిరంతరాయంగా చమురును సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ ధరకే ఇరాన్ చమురును China కొనుగోలు చేయడం, రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలపరిచింది. శాటిలైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 11.7-12 మిలియన్ బార్లుల క్రూడ్ ఆయిల్ చైనా వైపు రవాణా అయింది.
ఈ చమురు విక్రయాల ద్వారా పొందే భారీ రాబడి, యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు ఆర్థిక మద్దతుగా మారింది. ఒకవైపు ఇరాన్.. హర్మూజ్ జలసంధిలో సీమ్స్ అమర్చి ఇతర దేశాల నౌకలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు చైనాకు నిరంతరం సరఫరా కొనసాగించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమై ఉంది. విశ్లేషకులు చెబుతున్నట్లే, చైనాకు అందుతున్న ఈ చమురు సరఫరా, ఇరాన్ తన యుద్ధ ఖర్చులను తట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైన వనరుగా మారిందంటున్నారు.

హార్ముజ్ మార్గంలో ఇతర దేశాల ట్యాంకర్లు ఆపరేషన్‌ను తగ్గించడం వలన.. ఇరాన్‌కు ఇతర ఎగుమతిదారులు దూరంగా ఉన్నప్పటికీ తమ ఆయిల్ సరఫరా కొనసాగుతోంది. ఇరాన్ జాస్క్ ఆయిల్ టెర్మినల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తోంది. కానీ అది ప్రస్తుతానికి పూర్తిగా ప్రభావవంతంగా ఉపయోగపడలేదు. ఈ ఉగ్రభూభాగ ఉద్రిక్తతల కారణంగా ట్యాంకర్ల రూట్లు మార్చడం, బీమా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని గల్ఫ్ దేశాలు తమ ఆయిల్‌ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపడం మొదలెట్టాయి.
ఇక భారత్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం వేళ ఇరాన్ నుంచి తీపి కబురు లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధి (Strait Of Hormuz) మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఉపశమనం లభించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
కేంద్ర వర్గాల ప్రకారం, పుష్పక్, పరిమళ్ అనే రెండు ఇండియన్ నౌకలు (India-flagged ships) హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇజ్రాయేల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి.. జైశంకర్, అరాగ్చీ మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. మంగళవారం జరగిన ఫోన్‌కాల్ కూడా ఆ చర్చలలో ఒకటి జరిగింది.
ప్రధానంగా, హర్మూజ్ మార్గం ద్వారా ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడం ఎలా సాధించాలో వారు మాట్లాడారు. అలాగే, జైశంకర్ బుధవారం రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ సంప్రదింపులు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల సంక్షోభం పై ప్రభావాలు, పరిష్కార మార్గాలు చర్చించబడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. పిచ్చెక్కిపోతున్న ట్రంప్.. ఈ రోజు రాత్రే అసలు కథ..

రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!



Click it and Unblock the Notifications