For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.199 ప్లాన్ రూ.249కు పెంపు: వొడాఫోన్ ఐడియా టారిఫ్ ఎంత పెరిగింది, ఏ ప్లాన్‌కు ఎంత?

|

న్యూఢిల్లీ: డిసెంబర్ 3వ తేదీ నుంచి వాయిస్ కాల్స్, డేటా ఛార్జ్ టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా ఆదివారం ప్రకటించింది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ టారిఫ్ పెంచుతున్నాయి. జియో ఆరో తేది నుంచి, వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు 3వ తేదీ నుంచి టారిఫ్ పెంచుతున్నాయి. ఈ కంపెనీలు భారీ మొత్తంలో టారిఫ్ పెంచుతున్నాయి. కస్టమర్ల పరంగా వొడాఫోన్ ఐడియా మొదటి స్థానంలో ఉంది. ఈ టెలికం కంపెనీ ఛార్జీల పెరుగుదల ఇలా....

వినియోగదారులకు టెలికం కంపెనీల షాక్: పెంచిన ఛార్జీలు ఇలా...

41 శాతానికి పైగా పెరుగుదల

41 శాతానికి పైగా పెరుగుదల

వొడాఫోన్ ఐడియా 2, 28, 84, 365 రోజుల కాల వ్యవధితో అపరిమిత వినియోగం కింద ఉన్న స్కీంలకు కొత్త ఛార్జీలను ప్రకటించింది. వీటి పెరుగుదల 41.2 శాతం వరకు ఉంది. అన్‌లిమిటెడ్ స్కీం కింద ప్రతిరోజు ఉన్న ఎస్సెమ్మెస్ పరిమితిని 100కు, కాల్స్‌కు కూడా కాల వ్యవధికి అనుగుణంగా నిమిషాల పరిమితిని వర్తింప చేస్తున్నారు. పరిమితి దాటితే నిమిషానికి 6 పైసలు ఛార్జ్ ఉంటుంది.

ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే?

ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే?

ఇప్పటి వరకు 365 రోజుల కాల పరిమితితో అపరిమిత కాల్స్, 12GB డేటా స్కీం రూ.998గా ఉంది. 3వ తేదీ నుంచి ఇది 50 శాతం పెరిగి రూ.1,499 అవుతుంది. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్‌తో 365 రోజుల కాలపరిమితి గల ప్లాన్‌కు రూ.1,699 ఉండగా, ఇది రూ.2,399 అవుతుంది.

84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5GB డేటా ప్లాన్ రూ.458 నుంచి 31 శాతం పెరిగి రూ.599కి పెరుగుతుంది.

రూ.199 ప్లాన్ ధరను రూ.249కి పెంచారు. ఇది 25 శాతం పెరిగినట్లయింది. రోజుకు 1.5GB డేటా ఉంటుంది.

వొడాఫోన్ ఐడియా కాంబో ఆఫర్లు

వొడాఫోన్ ఐడియా కాంబో ఆఫర్లు

- మినిమం రీచార్జ్ రూ.49. ఇందులో రూ.38 టాక్ టైమ్, 100MB డేటా, టారిఫ్ సెకనుకు 2.5 పైసలు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.79 రీఛార్జ్‌తో రూ.64 టాక్ టైమ్, 200MB డేటా, టారిఫ్ సెకనుకు 1 పైసలు, 28 రోజుల వ్యాలిడిటీ

28 రోజుల అన్‌లిమిటెడ్ ప్యాక్స్

28 రోజుల అన్‌లిమిటెడ్ ప్యాక్స్

- రూ.149 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1000 నిమిషాలు), 2GB డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.249 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1000 నిమిషాలు), రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.299 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1000 నిమిషాలు), రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.399 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1000 నిమిషాలు), రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

84 రోజుల అన్‌లిమిటెడ్ ప్యాక్స్

84 రోజుల అన్‌లిమిటెడ్ ప్యాక్స్

- రూ.379 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 3000 నిమిషాలు), 6GB డేటా, 1000 ఎస్సెమ్మెస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీ

- రూ.599 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 3000 నిమిషాలు), రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీ

- రూ.699 ప్లాన్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 3000 నిమిషాలు), రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీ

అన్‌లిమిటెడ్ 365 రోజుల ప్యాక్స్

అన్‌లిమిటెడ్ 365 రోజుల ప్యాక్స్

- రూ.1,499 ప్లాన్. అన్‌లిమిటెడ్ (FUP 12,000 నిమిషాలు) 24GB డేటా, 3,600 ఎస్సెమ్మెస్‌లు, 365 రోజుల వ్యాలిడిటీ

- రూ.2,399 ప్లాన్. అన్‌లిమిటెడ్ (FUP 12,000 నిమిషాలు) రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 365 రోజుల వ్యాలిడిటీ

అన్‌లిమిటెడ్ సాచెట్

అన్‌లిమిటెడ్ సాచెట్

- రూ.19. అన్‌లిమిటెడ్ ఆన్ నెట్ వాయిస్, 150MB డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, 2 రోజుల వ్యాలిడిటీ

ఫస్ట్ రీఛార్జ్.. ప్రోడక్ట్ బెనిఫిట్స్

ఫస్ట్ రీఛార్జ్.. ప్రోడక్ట్ బెనిఫిట్స్

- రూ.97 రీఛార్జ్. రూ.45 టాక్ టైమ్, 100MB డేటా. టారిఫ్ సెకనుకు 1పైసలు. 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.197 రీఛార్జ్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1,000 నిమిషాలు), 2GB డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.297 రీఛార్జ్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 1,000 నిమిషాలు), 1.5GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ

- రూ.647 రీఛార్జ్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (FUP 3,000 నిమిషాలు), రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీ

English summary

రూ.199 ప్లాన్ రూ.249కు పెంపు: వొడాఫోన్ ఐడియా టారిఫ్ ఎంత పెరిగింది, ఏ ప్లాన్‌కు ఎంత? | Vodafone Idea hikes prepaid prices by up to 40 percent

Vodafone Idea Limited has hiked prices of its prepaid services by introducing new updated new plans that be available across India starting December, 3 2019, it said in an official statement.
Story first published: Monday, December 2, 2019, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X