For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీఎస్ఎన్ఎల్, జియో ముద్దు, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫొన్ ఐడియా వద్దు

|

మొబైల్ డేటా పెరగడం వొడాఫొన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ పాలిట శాపంగా మారింది. డిసెంబర్‌లో ఆ నెట్‌వర్క్ వినియోగదారులు క్రమంగా తగ్గిపోయారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, జియోకే మొగ్గుచూపారు. దీంతో ప్రైవేట్ సంస్థలతో పాటు బీఎస్ఎన్‌ఎల్ కూడా ఖాతాదారుల మెప్పును పొందినట్లైంది.

డిసెంబర్ గణాంకాల ప్రకారం బీఎస్ఎన్‌ఎల్ 4 లక్షల 26 వేల 958 మంది కస్టమర్లను సంపాదిచగలింది. వైర్‌లెస్ నెట్‌వర్క్‌లో అదనంగా 82 వేల 308 మంది సభ్యులను నమోదు చేశామని జియో వెల్లడించింది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొన్నది.

Vodafone Idea, Bharti Airtel losses were gains for Jio and BSNL in December

వొడాఫోన్ ఐడియా 36 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిందని కఠోర సత్యాన్ని ట్రాయ్ పేర్కొన్నది. అంతకుముందు నెలలో 3.64 కోట్ల మంది వినియోగదారులను కంపెనీ కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్ అయిన కంపెనీ గత 11 నెలల నుంచి వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. దీంతో సంస్థకు 33.26 కోట్ల నష్టం వాటిల్లింది.

భారతీ ఎయిర్‌కు టెల్ కాస్త తక్కువగా 11 వేల 50 మంది కస్టమర్లు దూరమయ్యారు. నవంబర్‌లో కంపెనీ 16.59 లక్షల మంది యూజర్లను సంపాదించగలిగింది. కానీ డేటా చార్జీ పెంచడంతో వినియోగదారులు తిరిగి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. మరోవైపు నవంబర్‌లో వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 28.8 మిలియన్లు తగ్గిందని ట్రాయ్ తెలియజేసింది.

English summary

బీఎస్ఎన్ఎల్, జియో ముద్దు, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫొన్ ఐడియా వద్దు | Vodafone Idea, Bharti Airtel losses were gains for Jio and BSNL in December

Bharat Sanchar Nigam and Reliance Jio were the two companies which added mobile subscribers in December, according to the data released by the Telecom Regulatory Authority of India.
Story first published: Wednesday, February 26, 2020, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X