For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్ మాల్యా ధిక్కారకేసు: మాల్యాకు సుప్రీంకోర్టు చివరి అవకాశం; ఫిబ్రవరి 24కి విచారణ వాయిదా

|

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాపై దాఖలైన ధిక్కార కేసును ఫిబ్రవరి 24వ తేదీకి సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరయ్యేందుకు చివరి అవకాశంగా రెండు వారాల సమయం ఇచ్చింది అని సమాచారం. మాల్యా అలా చేయడంలో విఫలమైతే, "కోర్టు కేసును తార్కిక ముగింపుకు తీసుకువెళుతుంది" అని కూడా సుప్రీం కోర్టు జోడించింది.

మాల్యా ధిక్కార కేసు.. విచారిస్తున్న సుపీం ధర్మాసనం

మాల్యా ధిక్కార కేసు.. విచారిస్తున్న సుపీం ధర్మాసనం

లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 2017లో ధిక్కార నేరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతనికి విధించే ప్రతిపాదిత శిక్షపై అతనిని విచారించడానికి సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేయబడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు ధిక్కార నేరం కింద 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా చేసిన పిటిషన్‌ను గత ఏడాది అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) డిప్యూటీ సెక్రటరీ (ఎక్స్‌ట్రాడిషన్) సంతకంతో తన ముందు ఉంచిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం, అప్పగింత ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, యూకేలో మాల్యా అప్పీల్‌కు అన్ని మార్గాలను ముగించారని సుప్రీంకోర్టు పేర్కొంది.

శిక్ష విషయంలో మాల్యా వాదనకు అవకాశం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం

శిక్ష విషయంలో మాల్యా వాదనకు అవకాశం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం

మాల్యాకు శిక్ష విషయంలో తన వాదనను వినిపించేందుకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఈ విషయంలో కోర్టుకు సహకరిస్తున్న అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలను జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. తాము 2 వారాల పాటు వాయిదా వేస్తున్నాము. నవంబర్ 30, 2021 ఆర్డర్ విఫలమైతే, ఆ విషయాన్ని తార్కిక ముగింపుకు తీసుకువెళ్లి, తదుపరి కొనసాగిస్తామని బెంచ్ తన ఆర్డర్‌లో పేర్కొంది.

మాల్యాను యూకే నుండి రప్పించేందుకు ప్రయత్నాలపై సుప్రీంకు వివరణ

మాల్యాను యూకే నుండి రప్పించేందుకు ప్రయత్నాలపై సుప్రీంకు వివరణ

ఇదిలా ఉంటే జనవరి 18, 2021 నుండి, యూ కె నుండి మాల్యాను రప్పించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, అయితే ఈ విషయంలో ఉన్న కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అప్పగింత అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వంతో ఎంఈఏ లేవనెత్తిందని, మాల్యాను అప్పగించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మెహతా తెలిపారు. మాల్యా మార్చి 2016 నుండి యూ కెలో ఉన్నారు. స్కాట్లాండ్ యార్డ్ ఏప్రిల్ 18, 2017న మూడు సంవత్సరాల క్రితం అమలు చేసిన అప్పగింత వారెంట్‌పై బెయిల్‌పై ఉన్నారు.

 మాల్యాకు యూకేలో అప్పీల్ చేసే అవకాశం లేదన్న కేంద్రం

మాల్యాకు యూకేలో అప్పీల్ చేసే అవకాశం లేదన్న కేంద్రం

మాల్యాను భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్న రహస్య చట్టపరమైన చర్యలపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని అంతకుముందు సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 9, 2017 నుండి ప్రారంభమై, గత ఏడాది మే 14న యూకేలో మాల్యా తన అప్పగింతకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను కొట్టివేసే వరకు మాల్యాపై అప్పగింత ప్రక్రియల వివరాలను కేంద్రం ఇంతకుముందు సుప్రీం కోర్టుకు అందించింది. తద్వారా మాల్యా యూ కెలో అప్పీల్ యొక్క అన్ని మార్గాలు మూసుకుపోయాయని పేర్కొంది.

భారత్ కు మాల్యాను అప్పగించే అవకాశం

భారత్ కు మాల్యాను అప్పగించే అవకాశం

అప్పీల్‌కు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, మాల్యా భారత్‌కు లొంగిపోవడాన్ని సూత్రప్రాయంగా 28 రోజుల్లోగా పూర్తి చేయాలని కేంద్రం పేర్కొంది. అయితే విజయ్ మాల్యా అప్పగింతకు ముందు పరిష్కరించాల్సిన మరో చట్టపరమైన సమస్య ఉందని యూ కె హోమ్ ఆఫీస్ తెలియజేసింది. ఏదేమైనా విజయమాల్య భారత్ కు అప్పగించే అవకాశం ఉంది.

English summary

Vijay Mallya contempt case: SC gives last chance to Mallya, adjourns hearing for Feb 24

SC gives last chance to Vijay Mallya, adjourns hearing for Feb 24 granting him two weeks time as the last opportunity to appear before it personally or through counsel.
Story first published: Thursday, February 10, 2022, 18:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X