For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: అమెరికన్లపై వేటు.. ఇండియన్లకు చోటు.. హైదరాబాద్ లో ఉద్యోగుల్ని పెంచుతోంది..

|

Pepsico: ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. దీంతో కంపెనీలు సైతం భారీగా ఉద్యోగుల కోతకే మెుగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ పెప్సికో తన ప్రధాన కార్యాలయంలో వందలాది మందిని తొలగించింది. కంపెనీ స్నాక్స్, శీతలపానీయాల వ్యాపారంలో ప్రపంచఖ్యాతి పొందింది.

ఇండియాలో ఉద్యోగాలు..

ఇండియాలో ఉద్యోగాలు..

అమెరికాలో ఉద్యోగులను తగ్గిస్తున్న ఈ కంపెనీ ఇండియాలో మాత్రం ఉద్యోగుల నియామకానికి ఉపక్రమించింది. భారత్ లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కంపెనీ కొత్తగా 1,200 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా..

హైదరాబాద్ కేంద్రంగా..

పెప్సికో తన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ 2019లో హైదరాబాద్‌లో ప్రారంభించింది. అప్పట్లో 250 మంది ఉద్యోగులు ఇందులో పనిచేసేవారు. అయితే ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. వీరికి మరో 1200 మందిని అదనంగా జోడించి మెుత్తం ఉద్యోగుల సంఖ్యను 4,000కు చేర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ సైతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా వెల్లడించింది.

ఇటీవల కేటీఆర్..

ఇటీవల కేటీఆర్..

పెప్సికో EVP కార్పొరేట్ వ్యవహారాల రాబర్టో అజెవెడో ఇటీవల తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రిని కలుసుకున్నారు. గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌ను వేగంగా విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. నీటి సమర్ధవంతమైన వినియోగంలో మెరుగుదల, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

 కంపెనీ ఉత్పత్తులు..

కంపెనీ ఉత్పత్తులు..

PepsiCo శీతల పానీయాలు మాత్రమే కాక డోరిటోస్ నాచోస్, పొటాటో చిప్స్, క్వేకర్ వోట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది. కంపెనీ అమెరికా వ్యాప్తంగా 1.29 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి దాదాపుగా 3.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ పెరుగుతున్న ముడి పదార్థాల ధరలకు అనుగుణంగా ఉత్పత్తుల ధరలను సైతం పెంచుతోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ కిరాణా దుకాణాల్లో ఆహారం, పానీయాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.

English summary

Hyderabad: అమెరికన్లపై వేటు.. ఇండియన్లకు చోటు.. హైదరాబాద్ లో ఉద్యోగుల్ని పెంచుతోంది.. | US company pepsico increasing work force in hyderabad global service center

US company pepsico increasing work force in hyderabad global service center
Story first published: Sunday, January 22, 2023, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X