For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో అమెరికా కీలక పెట్టుబడులు, NIIFలో ఇన్వెస్ట్

|

భారత్‌లో అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడులు పెడుతోంది. కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తోంది. వివిధ ప్రాజెక్టుల్లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా ఫైనాన్షియల్ కార్పోరేషన్ ప్రకటించింది. గత మూడు దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అని, అయితే కరోనా కారణంగా ఇటీవల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ సమస్యలు ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భారత్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF)లో అమెరికా 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (DFC) తెలిపింది.

ఐపీవోకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే MTAR: మొత్తం కోటికి పైగా షేర్లుఐపీవోకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే MTAR: మొత్తం కోటికి పైగా షేర్లు

పెట్టుబడులకు ఒప్పందం

పెట్టుబడులకు ఒప్పందం

NIIF నిధుల సేకరణ తుది రౌండ్‌లో ఈ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దీనిపై NIIF సీఈవో సుజయ్‌బోస్ స్పందిస్తూ.. DFC నిర్ణయం భారత్‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడులను మరింత బలోపేతం చేసిందన్నారు. దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అబివృద్ధి కోసం చేపట్టే ఇన్‌ప్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత మూడు దేశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్ ఉందని, కానీ మౌలిక సదుపాయాల లోటుతో బాధపడుతోందని DFC మంగళవారం పేర్కొంది.

DFC సీఈవో ఏమన్నారంటే..

DFC సీఈవో ఏమన్నారంటే..

ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి, దేశంలో క్లిష్టమైన అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి మూలధనాన్ని సమీకరించడానికి NIIF కృషి చేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. DFC పెట్టుబడి ఇండో-పసిఫిక్ అభివృద్ధికి తోడ్పడుతుందని, భారత్ అంతా వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు DFC అనుమతిస్తోందని DFC సీఈవో అడమ్ బోహ్లెర్ అన్నారు.

ప్రమాణాలతో తన నిబద్ధత..

ప్రమాణాలతో తన నిబద్ధత..

DFC తమ అన్ని ప్రాజెక్టులలో ఉన్నత ప్రమాణాలతో తన నిబద్ధతను కనబరుస్తుందని, NIIFతో ఈ భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉందని సుజయ్ బోస్ అన్నారు. చివరి రౌండ్‌లో DFC పెట్టుబడులు భారత్‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడులను బలోపేతం చేస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధికి, అభివృద్ధికి, అమెరికా విదేశాంగ విధానానికి తోడ్పడుతుందన్నారు.

English summary

భారత్‌లో అమెరికా కీలక పెట్టుబడులు, NIIFలో ఇన్వెస్ట్ | US body announces $54 million investment in India to support infrastructure projects

An American financial corporation has announced to invest $54 million in India to support the development of critical infrastructure projects in the country in the wake of the COVID-19 pandemic.
Story first published: Wednesday, December 23, 2020, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X