For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

aadhar: ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా ? అయితే ఈ పని చేయండి..

|

aadhar: దేశంలో అతి ముఖ్యమైన ఐడెంటిటీ కార్డుల్లో ఒకటి ఆధార్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పకుండా దీనిని వినియోగిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ సేవలు పొందడానికైతే ఇది తప్పనిసరి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలా జరగకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు అవసరాల మేరకు ఆధార్ కార్డు వివరాలు అప్ డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.

ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయిన వాళ్లకు UIDAI ఓ ముఖ్యమైన సూచన చేసింది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ వివరాలు అప్‌ డేట్ చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలని తెలిపింది. ఆయా వ్యక్తుల గుర్తింపుతో పాటు చిరునామా రుజువులను ధృవీకరణ కోసం సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇందుకు గాను ఆన్‌ లైన్‌ లో రూ.25, ఆఫ్ లైన్‌ లో రూ.50 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.

UIDAI suggested to update ten years old aadhar details

అప్‌ డేట్ చేసే సమయంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని UIDAI సూచించింది. ప్రజల అవసరాన్ని వాళ్లు అవకాశంగా మలచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో పాటు పాన్‌ ను సైతం ఆధార్‌ తో అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మార్చి నెలాఖరు లోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంది. లేని పక్షంలో పాన్ వినియోగించేందుకు పనికిరాకుండా పోతుందని ఇప్పటికే ప్రకటించింది.

Read more about: aadhar uidai pan
English summary

aadhar: ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా ? అయితే ఈ పని చేయండి.. | UIDAI suggested to update ten years old aadhar details

UIDAI suggested to update ten years old aadhar details
Story first published: Wednesday, February 22, 2023, 22:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X