For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకిదే చివరి వర్కింగ్ డే: 'జూమ్'లో ఉబెర్ షాక్, ఇలాంటి కాన్ఫరెన్స్‌లో ఉండలేం.. ఉన్నతాధికారి

|

కరోనా మహమ్మారి చాలామంది చాలామంది ఉద్యోగాలు పోయేందుకు కారణం అవుతోంది. చాలా కంపెనీలు పింక్ స్లిప్స్ ఇవ్వడం లేదా వేతనాలలో కోత విధించడం చేస్తున్నాయి. రైడ్ హెయిలింగ్ ఉబెర్ అయితే ఇటీవల ఏకంగా 3,700 మంది ఉద్యోగాలను జూమ్ ద్వారా తెలియజేసి, తొలగించింది. ఉద్యోగం నుండి తీసివేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.

ఉద్యోగ కోతలపై హెచ్చరించిన ఖతార్, వేలాదిమంది ఉద్యోగులకు ఉబెర్ షాక్ఉద్యోగ కోతలపై హెచ్చరించిన ఖతార్, వేలాదిమంది ఉద్యోగులకు ఉబెర్ షాక్

టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగాల కోత వెల్లడి

టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగాల కోత వెల్లడి

ఉద్యోగులతో సమావేశాల కోసం ఉబెర్ పాపులర్ టెలి కాన్ఫరెన్స్ సాఫ్టువేర్ జూమ్ ఉపయోగిస్తుంది. గత వారం కూడా ఇలాగే ఈ టెలికాన్ఫరెన్స్ సాఫ్టువేర్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడి, వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ వెబ్ సైట్ ఓ వీడియో కాల్‌ను కూడా సంపాదించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్ ఫ్రమ్ హోమ్

ఉద్యోగుల తొలగింత బాధాకరమైన విషయమని, కానీ కరోనా కారణంగా ప్రస్తుత అనూహ్య పరిస్థితుల్లో ఇది వాస్తవరూపం దాల్చుతోందని ఉబెర్ ఓ న్యూస్ వెబ్ సైట్‌తో వెల్లడించిందట. దాదాపు అన్ని దేశాల్లో, నగరాల్లో ఎంతోమంది ఇంటి నుండి పని చేస్తున్నారని గుర్తు చేసింది. తాము ఉదారంగా ఇతర ప్యాకేజీ, ప్రయోజనాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపిందిత.

మీకు ఇదే చివరి పని దినం

మీకు ఇదే చివరి పని దినం

కాగా లీకైన వీడియోలో... అరిజోనా స్కాట్స్‌డేల్‌కు చెందిన ఉబెర్స్ ఫోనిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ హెడ్ రుఫిన్ చెవలౌ మాట్లాడారు. ఉబెర్ బిజినెస్ బాగా పడిపోయిందని, దాదాపు సగానికి పైగా పడిపోయిందని వీడియో కాన్ఫరెన్స్‌లోని వ్యూయర్స్‌తో చెబుతున్నారు. ట్రిమ్ వ్యాల్యూమ్ తగ్గిపోయాయని, ఇది చాలా క్లిష్టమైన, జీర్ణించుకోలేని వాస్తవమన్నారు. ఎంతోమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, ఇలాంటి స్థితిలో బిజినెస్ లేదని చెప్పారు. దీంతో 3,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పారు. మీరు ఎంతో చేశారని, ఉబెర్‌లో మీకు ఇదే చివరి పని దినం అని సూటిగా చెప్పారు.

ఇలాంటి కాన్ఫరెన్స్‌లో ఉండలేం.. ఉబెర్ ఉన్నతాధికారి ఉద్వేగం

ఇలాంటి కాన్ఫరెన్స్‌లో ఉండలేం.. ఉబెర్ ఉన్నతాధికారి ఉద్వేగం

46 దేశాల్లో మొత్తం 3,700 మంది ఉద్యోగులను తొలగించారు. వీరందరికీ జూమ్ ద్వారా తెలియజేశారు. ఇది వినడానికి చాలా కష్టమని తనకు తెలుసునని రుఫిన్ చెవలౌ ఉద్వేగానికి గురయ్యారు. ఇలాంటి కాన్ఫరెన్స్‌లో ఉండాలని ఎవరూ కోరుకోరని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధాకర వార్తను సాధ్యమైనంత త్వరగా చెప్పాల్సిన పరిస్థితి అన్నారు.

ఏప్రిల్‌లో 80 శాతం డౌన్

ఏప్రిల్‌లో 80 శాతం డౌన్

ఏప్రిల్ నెలలో ఉబెర్ వ్యాపారం 80 శాతం క్షీణించింది. అదే సమయంలో ఉబెర్ ఈట్స్ పుడ్ డెలివరీ మాత్రం పెరిగింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడంపై దృష్టి సారించినట్లు ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి అన్నారు. సంక్షోభం నేపథ్యంలో తన మూలవేతనం వదులుకుంటున్నట్లు చెప్పారు. కఠిన నిర్ణయాలు అవసరమని, తమ పెట్టుబడుల్లో కొన్నింటిపై సమీక్షిస్తామని చెప్పారు.

English summary

మీకిదే చివరి వర్కింగ్ డే: 'జూమ్'లో ఉబెర్ షాక్, ఇలాంటి కాన్ఫరెన్స్‌లో ఉండలేం.. ఉన్నతాధికారి | Uber uses Zoom to layoff about 3,700 employees

Uber uses Zoom to layoff about 3,700 as coronavirus pandemic puts brakes on business.
Story first published: Tuesday, May 12, 2020, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X