For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా కోసం ట్రంప్ కీలక నిర్ణయం: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ సహా 6గురు భారతీయులకు చోటు

|

కరోనా కారణంగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదు. కానీ ఇప్పటికే భారీ నష్టం జరిగింది. ఆయా దేశాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సహా 6గురు

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సహా 6గురు

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కార్యాచరణకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన 200 మంది నిపుణులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో భారత సంతతికి చెందిన వారు ఆరుగురు కూడా ఉండటం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా ఆరుగురు ఎంపికయ్యారు.

ట్రంప్ ఏమన్నారంటే

ట్రంప్ ఏమన్నారంటే

ఈ 200 మంది బృందం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అనుసరించాల్సిన ప్రణాళికలను, సలహాలను అధ్యక్షుడు ట్రంప్‌కు అందిస్తారు. వివిధ రంగాలలో ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని, వారు తమకు సలహాలు, సూచనలు ఇస్తారని ట్రంప్ చెప్పారు.

ఆరుగురు వీరే..

ఆరుగురు వీరే..

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రతా, మాస్టర్‌కార్డ్ అజయ్ బంగా, పెర్నోర్డ్ రిచర్డ్‌కు చెందిన ఆన్ ముఖర్జీ ఉన్నారు. మొదటి నలుగురిని టెక్ గ్రూప్ నుండి తీసుకున్నారు. ముఖర్జీని మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుండి తీసుకున్నారు. బంగాను ఫైనాన్షియల్ సర్వీస్ రంగం నుండి తీసుకున్నారు.

మిగతా ప్రముఖులు..

మిగతా ప్రముఖులు..

ఈ జాబితాలో ఇతర ప్రముఖల విషయానికి వస్తే ఆపిల్స్ టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎలిసన్, ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్, టెస్లా ఎలాన్ మస్క్, ఫియట్ క్రిస్లేర్ మైక్ మాన్లే, ఫోర్డ్ బిల్ ఫోర్డ్, జనరల్‌కు చెందిన మేరీ బారా ఉన్నారు.

ట్రంప్‌కు సూచనలు.. సలహాలు

ట్రంప్‌కు సూచనలు.. సలహాలు

ఆయా రంగాల్లోని వీరంతా ఆయా రంగాలు ఎదుర్కొనే ఒడిదుడుకులపై అధ్యక్షుడికి సూచనలు, సలహాలు ఇస్తారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థఇక సేవలు, హెల్త్, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్నాలజీ, ట్రాన్సుపోర్ట్స్, స్పోర్ట్స్.. ఇలా ఒక్కో రంగానికి ఒక్కో బృందం ఉంది.

English summary

అమెరికా కోసం ట్రంప్ కీలక నిర్ణయం: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ సహా 6గురు భారతీయులకు చోటు | Trump names NRIs including Satya Nadella and Pichai in Great American Economic Revival Industry Groups

President Donald Trump has roped in six Indian-American corporate leaders, including Sunder Pichai from Google and Satya Nadella from Microsoft, to seek advice from the "brightest" and the "smartest" people on how to restart US economy that has been crippled by the coronavirus pandemic.
Story first published: Wednesday, April 15, 2020, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X